News January 28, 2025
కుంభమేళాలో ప్రకాశ్ రాజ్.. నిజమిదే

తాను కుంభమేళాకు వెళ్లానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ కావడంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. తప్పుడు ప్రచారం చేసి పవిత్ర పూజలను కలుషితం చేయడమే పిరికి వాళ్ల పని అని దుయ్యబట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మిగతాది కోర్టులో చూసుకుందామని రాసుకొచ్చారు.
Similar News
News February 10, 2025
ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక: సీఎం

TG: ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చూడాలన్నారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపాలని, అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట బాధ్యతను కలెక్టర్లు, ఎస్పీలకు ఇవ్వాలని సూచించారు.
News February 10, 2025
ఏపీలో లిక్కర్ ధరలు పెంపు!

AP: రాష్ట్రంలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మద్యంపై 15 శాతం మేర ధరలు పెంచాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్‌ను 14.5 నుంచి 20 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో ధరల పెంపు అనివార్యమైనట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇకపై 3 కేటగిరీలుగా(ఇండియన్ మేడ్, ఫారిన్ మేడ్, బీర్) మద్యం సరఫరా ఉంటుందని తెలిపాయి. రూ.99 మద్యం, బీర్లపై పెంపు ఉండదని చెప్పాయి.
News February 10, 2025
30 ఏళ్లు దాటిన మహిళలు ఈ పరీక్షలు చేసుకోవాలి!

1. మామోగ్రఫీ- దీని ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించవచ్చు. 2.పాప్ స్మియర్ టెస్ట్ – గర్భాశయ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించవచ్చు. 3.కంప్లీట్ బ్లడ్ కౌంట్(CBC)- రక్తహీనతతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను దీని ద్వారా గుర్తించవచ్చు. 4. థైరాయిడ్ 5. విటమిన్ -D, కాల్షియం టెస్ట్. ఈ పరీక్షలు చేయించుకొని దానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT