India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: కాకినాడ జిల్లాకు చెందిన చలమలశెట్టి సునీల్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఓడిపోతూనే ఉంది. 2009 నుంచి ఇదే తంతు జరుగుతోంది. సునీల్ 2009లో PRP తరఫున కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడారు. 2014లో YCP తరఫున, 2019లో TDP తరఫున, 2024లో YCP తరఫున MPగా పోటీ చేయగా ఆయన ఓడిపోయారు. అలాగే ఆయన ప్రాతినిథ్యం వహించిన పార్టీలు కూడా ఓడాయి. దీంతో ఆయన ప్రతీసారి ఓడిపోబోయే పార్టీలోకే వెళ్తారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
AP: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఈవీఎంల ధ్వంసం సహా 4 కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్‌ను పొడిగించింది. వారంపాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులపై గురువారం తదుపరి విచారణ చేస్తామని తెలిపింది. కాగా పిన్నెల్లిని ఇవాళ అరెస్టు చేస్తారని ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే.
AP: ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్‌కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి Xలో శుభాకాంక్షలు తెలిపారు. ‘హింసాత్మక ఘటనలకు తావులేదని నిన్న మీరిచ్చిన సందేశం హర్షణీయం. మీ వ్యాఖ్యలకు భిన్నంగా, ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింస, భౌతిక దాడులు, వేధింపులపై మీరు స్పందించాలి. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదు’ అని రాసుకొచ్చారు.
TG: ఈ నెల 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు. 31 జిల్లాల్లో 897 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఎగ్జామ్స్‌ను సజావుగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు ఒక అడిషనల్ కలెక్టర్‌తోపాటు ఓ ఉన్నతాధికారిని నియమించామన్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ కోసం ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు.
AP: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రేపు రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, విజయ నగరం, విశాఖలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
AP: ఉద్యోగాల పేరుతో ఏపీ నుంచి 150 మందిని కాంబోడియాకు తరలించగా వారిలో 68 మందిని వెనక్కి తీసుకొచ్చినట్లు విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. ఈ వ్యవహారంలో 21 మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశామన్నారు. భారతీయులు లక్ష్యంగా ఏపీవాసులతో సైబర్ క్రైమ్‌లు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 90 మందిని కాంబోడియా నుంచి తీసుకురావాల్సి ఉందని వెల్లడించారు.
రాజమౌళి డైరెక్షన్‌లో మహేశ్ బాబు నటించబోయే మూవీ షూటింగ్ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఆఫ్రికన్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎక్కువ భాగం అమెజాన్ అడవుల్లో షూటింగ్ చేస్తారని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు రామోజీ ఫిల్మ్ సిటీలో రూ.100 కోట్లతో భారీ సెట్ వేశారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2027లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ సిద్ధం చేశారని టాక్ నడుస్తోంది.
మోదీ, షా స్టాక్ మార్కెట్ల స్కాంకు పాల్పడ్డారన్న రాహుల్ <<13392703>>వ్యాఖ్యల<<>>కు బీజేపీ ఎంపీ పియూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే భయంతో స్టాక్ మార్కెట్ పడిపోయిందని అన్నారు. తిరిగి మోదీ ప్రభుత్వమే రావడంతో కుదురుకుంటోందని చెప్పారు. మరోవైపు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలోని ప్రతి మహిళకు రూ.లక్ష ఇస్తామనే హామీని ఎప్పుడు నెరవేరుస్తారంటూ కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు.
రీజినల్ రూరల్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి IBPS నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-A ఆఫీసర్స్(స్కేల్-1,2&3), గ్రూప్ ‘B’ ఆఫీస్ అసిస్టెంట్(మల్టీపర్పస్) పోస్టులకు కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్(CRP) ద్వారా నియామకాలు చేపట్టనుంది. రేపటి నుంచి ఈ నెల 27 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రిలిమ్స్ ఆగస్టు/సెప్టెంబర్‌లో నిర్వహించనుంది. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామనేది వెల్లడించలేదు. మరిన్ని వివరాలకు <
కాంగ్రెస్‌తో పొత్తు లోక్‌సభ ఎన్నికలకే పరిమితమని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి పూర్తి మద్దతు ఇచ్చామని తెలిపారు. ఢిల్లీలోని 7 సీట్లనూ కోల్పోవడంపై స్పందిస్తూ.. ‘మా టాప్ లీడర్లు జైలులో ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో పోటీ చేసినప్పటికీ బీజేపీ నేతల మెజార్టీని భారీగా తగ్గించాం’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.