India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహారాష్ట్రలో పార్టీలను చీల్చిన వారికి ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో షాక్ ఇచ్చారు. తన బాబాయి శరద్ పవార్ నుంచి NCPని దక్కించుకున్న అజిత్ పవార్ పార్టీ 4చోట్ల పోటీ చేస్తే ఒకచోట మాత్రమే నెగ్గింది. అటు శరద్ పవార్ సారథ్యంలోని NCP 10 చోట్ల పోటీ చేయగా 8 గెలిచింది. మరోవైపు శివసేన విషయంలోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. పార్టీని చీల్చిన ఏక్‌నాథ్ శిండే వర్గం 7చోట్ల గెలిస్తే ఉద్ధవ్ ఠాక్రే వర్గం 9MP సీట్లు గెలుచుకుంది.
ఒడిశాలో అధికారం కోల్పోయినందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆ రాష్ట్ర మాజీ CM నవీన్ పట్నాయక్ అన్నారు. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ MLAలతో ఆయన మాట్లాడారు. తాను తొలిసారి CM అయినప్పుడు రాష్ట్రంలో 70% ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారని, దాన్ని 10శాతానికి తగ్గించానని గుర్తుచేశారు. 24ఏళ్లుగా రాష్ట్రానికి BJD సేవలందించిందని, ఇంకా పనిచేస్తూనే ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో BJPకి 78, BJDకి 51 సీట్లు వచ్చాయి.
కొత్త ప్రభుత్వం వస్తే నిరుద్యోగులు నోటిఫికేషన్లు వస్తాయనో, కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ బిల్లుల చెల్లిస్తారనో.. ఇలా ఒక్కో వర్గం ఒక్కో అంశంపై ఆశలు పెట్టుకుంటుంది. అయితే APలో మందుబాబులు బ్రాండ్ మద్యం దొరుకుతుందంటూ ఖుషీ అవుతున్నారు. ఇన్నాళ్లు నాసిరకం మద్యం అమ్ముతున్నారని వారు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక బూమ్ బూమ్.. ఆంధ్రా గోల్డ్ బైబై అంటూ నెట్టింట ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.
AP: వివేకా హత్య కేసు వెనుక ఓ జంట పాత్ర ఉందంటూ బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఈ కేసును 90 శాతం సీబీఐ ఛేదించిందని.. మిగిలిన 10శాతాన్ని పూర్తి చేయించి అసలు హంతకుల్ని జైలుకి పంపిస్తామన్నారు. ఇంతవరకు రాష్ట్రంలో భారతిరెడ్డి రాజ్యాంగం నడిచిందని ఆరోపించారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే కోడికత్తి, వివేకా హత్య కేసులపై జగన్‌ను నిలదీస్తామని చెప్పారు.
TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC ఓట్ల లెక్కింపు రెండో రౌండ్‌లోనూ తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్‌లో 7670 ఓట్ల ఆధిక్యం పొందిన ఆయన రెండో రౌండ్ పూర్తయ్యే సరికి 14,672 ఓట్ల మెజార్టీ పొందారు. రెండో రౌండ్‌లో మల్లన్నకు 34,575 ఓట్లు రాగా, రాకేశ్ రెడ్డి(BRS)కి 27,573 ఓట్లు, ప్రేమేందర్ రెడ్డి(BJP)కి 12,841 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్ అశోక్‌కు 2 రౌండ్లలో 20,037 ఓట్లే వచ్చాయి.
AP: YCP ఓటమితో రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి అందించారు. ఆయనతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు. ప్రస్తుతం వెకేషన్ కోర్టు నడుస్తుండటంతో ఏజీపీలు, ఏపీపీలు కొద్దిరోజుల తర్వాత రాజీనామా చేసే ఛాన్సుంది.
సార్వత్రిక పోరులో నిలిచిన రెండు ప్రాంతీయ పార్టీలు 100% స్ట్రైక్ రేట్ సాధించి సత్తా చాటాయి. ఏపీలో 21 అసెంబ్లీ, 2MP స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపిన జనసేన అన్నింట్లో గెలిచింది. అలాగే NDA కూటమి సీట్ల పంపకాల్లో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కి కేటాయించిన 5 MP స్థానాల్లో గెలిచింది. ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కృషితో అన్నిచోట్లా నెగ్గింది. దీంతో అందరిచూపు పవన్, చిరాగ్ పాశ్వాన్ వైపు మళ్లింది.
AP: వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈవీఎం ధ్వంసం సహా మూడు హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి. వీటిపై పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల 6 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ్టితో ఆ గడువు ముగియనుంది. దీంతో నరసరావుపేటలో పిన్నెల్లి నివాసం ఉంటున్న అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
AP: టీడీపీ సీనియర్ నేతలతో నేడు చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరడంపై బీజేపీ ప్రతిపాదనలు, రాష్ట్ర మంత్రివర్గ కూర్పు, తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇటు ఇదే అంశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించి వారి అభిప్రాయాలను పవన్ తీసుకోనున్నారు.
AP అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి మొత్తంగా 55.28శాతం ఓట్లు సాధించగా, YCP 39.37శాతానికే పరిమితమైంది. విడివిడిగా చూస్తే టీడీపీకి 1,53,84,576(45.60%) ఓట్లు రాగా, YCPకి 1,32,84,134(39.37%), జనసేనకు 6.85శాతం ఓట్లు పోలయ్యాయి. YCP కంటే కూటమికి 53,72,166 ఓట్లు అధికంగా రాగా.. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య 21,00,442 ఓట్ల వ్యత్యాసం ఉంది. ఎన్నికల్లో టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8, YCP 11 స్థానాల్లో గెలిచాయి.
Sorry, no posts matched your criteria.