News June 5, 2024

నా ప్రియమైన సోదరుడితో..: స్టాలిన్

image

ఈ రోజు ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశంలో పాల్గొన్న డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ Xలో ఓ స్పెషల్ ఫొటో పంచుకున్నారు. రాహుల్ గాంధీతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన ఆయన.. ‘నా ప్రియమైన సోదరుడితో..’ అని క్యాప్షన్ పెట్టారు. కాగా డీఎంకేకు పార్లమెంటు ఎన్నికల్లో 22 సీట్లు వచ్చాయి.

News June 5, 2024

ట్విటర్‌లో విరాట్ కోహ్లీ రికార్డు

image

ట్విటర్(X)లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన అథ్లెట్ల లిస్టులో టీమ్‌ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(63.5M) రెండో స్థానానికి చేరారు. తొలి స్థానంలో ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో (111.4M) కొనసాగుతున్నారు. కోహ్లీ తర్వాతి స్థానాల్లో వరుసగా నెయ్‌మర్.Jr (63.4M), బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్(52.8M), సచిన్ టెండూల్కర్ (40M) ఉన్నారు.

News June 5, 2024

రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.

News June 5, 2024

కొత్త ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక!

image

అవును.. కూటమికి 164 సీట్లు కట్టబెట్టిన ఏపీ ప్రజలు గట్టి హెచ్చరిక కూడా పంపారు. పథకాలు అందిస్తే చాలు.. ప్రజలు ఓట్లు వేసేస్తారని కలలో కూడా అనుకోవద్దని స్పష్టం చేశారు. పథకాల రూపంలో రూ.లక్షల కోట్లు YCP ఇచ్చింది. అయినా కూటమి అభివృద్ధి నినాదానికే పట్టం కట్టారు. ఇటు YCP కంటే ఒకింత ఎక్కువ పథకాలే ప్రకటించిన కూటమి.. సంపద సృష్టించి పంచుతామంటోంది. అది కార్యరూపం దాల్చాలని కూటమిపై AP ప్రజానీకం ఆశలు పెట్టుకుంది.

News June 5, 2024

MLC ఉప ఎన్నిక కౌంటింగ్.. వారిద్దరి మధ్యే పోటీ!

image

TG: నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ MLC ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఇప్పటివరకు 4 రౌండ్లు పూర్తికాగా, మొత్తం 96వేల ఓట్లను లెక్కించారు. తీన్మార్ మల్లన్న(కాంగ్రెస్), రాకేశ్ రెడ్డి(బీఆర్ఎస్) మధ్య పోటీ నెలకొంది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. చెల్లని ఓట్లు భారీగా నమోదవుతున్నట్లు సమాచారం. 4 హాళ్లు, 96 టేబుళ్లపై కౌంటింగ్ కొనసాగుతోంది.

News June 5, 2024

ప్రధాని మోదీకి శుభాకాంక్షలు: US, రష్యా అధ్యక్షులు

image

లోక్‌సభ ఎన్నికల్లో NDA విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి US అధ్యక్షుడు జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘PM మోదీ, NDA నేతలకు అభినందనలు. మన దేశాల మధ్య స్నేహం అంతకంతకూ పెరుగుతోంది’ అని ట్వీట్ చేశారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ప్రధాని మోదీకి విషెస్ తెలియజేశారు.

News June 5, 2024

ఐర్లాండ్‌ను కుప్పకూల్చిన భారత బౌలర్లు

image

T20WC: టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ తక్కువ స్కోరుకే కుప్పకూలింది. భారత బౌలర్లు నిప్పులు చెరగడంతో బ్యాటర్లు చేతులెత్తేశారు. అర్ష్‌దీప్, హార్దిక్ ధాటికి ఆ జట్టు టాపార్డర్ కకావికలమైంది. 16 ఓవర్లు ఆడి 96 పరుగులకే ఆలౌటైంది. హార్దిక్ పాండ్య 3, అర్ష్‌దీప్ 2, బుమ్రా 2, అక్షర్ 1, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. ఆ జట్టులో గారెత్ డెలానీ (26)దే అత్యధిక స్కోరు.

News June 5, 2024

CM రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బే..!

image

అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీచాయి. MP ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటి హస్తం పార్టీకి సవాల్ విసిరింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన MBNRలోనూ కాషాయ జెండా రెపరెపలాడింది. 2019లో రేవంత్ ఎంపీగా గెలిచిన మల్కాజ్‌గిరిలో బీజేపీ పాగా వేసింది. తెలంగాణ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే హైకమాండ్ దగ్గర రేవంత్ పలుకుబడి పెరిగేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

News June 5, 2024

రేపు ఢిల్లీకి పురందీశ్వరి

image

AP: బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ పెద్దలతో ఆమె సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి జరగబోయే NDA పక్ష నేతల సమావేశానికి ఆమె హాజరు కానున్నట్లు సమాచారం.

News June 5, 2024

528 రోజుల తర్వాత భారత జెర్సీలో పంత్

image

భారత స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ 528 రోజుల తర్వాత టీమ్ ఇండియా జెర్సీలో మెరిశారు. ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన రీఎంట్రీ ఇచ్చారు. కాగా 2022 డిసెంబర్‌లో పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం తర్వాత ఆయన దాదాపు ఏడాదిన్నరపాటు క్రికెట్‌కు దూరమయ్యారు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో మళ్లీ బ్యాట్ పట్టారు. ఆ తర్వాత వరల్డ్ కప్‌నకు ఎంపికయ్యారు.