India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తాజా ఎన్నికల ఫలితాలతో YCP నియంతృత్వ పాలనను ప్రజలు అథ:పాతాళానికి తొక్కేశారని.. TDP నేత MLA నిమ్మల రామానాయుడు అన్నారు. తాను చేసిన సంక్షేమాన్ని పక్కనపెట్టి, ప్రజలు తనను మోసం చేశారంటూ మాజీ సీఎం జగన్ చెప్పడం ఆయన పెత్తందారీతనానికి నిదర్శనమని విమర్శించారు. తన చేతగానితనాన్ని ప్రజల మీదకు నెట్టేసిన ఏకైక CM జగన్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. AP ఎన్నికల ఫలితాలు 5 కోట్ల ఆంధ్రుల సమష్టి విజయమని వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ఎన్నికల్లో NDA కూటమి విజయం సాధించడంతో మోదీకి చైనా కంగ్రాట్స్ చెప్పింది. ద్వైపాక్షిక సంబంధాలను, మైత్రిని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఇరుదేశాల్లో అభివృద్ధికి ఇది సహకరిస్తుందని పేర్కొన్నారు.
బీఎస్పీని ముస్లిం కమ్యూనిటీ అర్థం చేసుకోలేదని ఆ పార్టీ చీఫ్ మాయావతి అన్నారు. ముస్లిం అభ్యర్థులకు 35 స్థానాల్లో పోటీకి అవకాశం ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక నుంచి వారికి టికెట్లు ఇచ్చే ముందు లోతైన విశ్లేషణ చేయాలని పేర్కొన్నారు. UPలో ఆ పార్టీ 2014, 2024 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. 2019లో SPతో కలిసి పోటీ చేయడంతో 10 స్థానాలు గెలిచింది.
AP: ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున కొంతమంది వారసులు తొలి సారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారిలో యనమల రామకృష్ణుడు కూతురు దివ్య, గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు భానుప్రకాశ్, పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూర, బొజ్జల గోపాలక్రిష్ణ కుమారుడు సుధీర్, వర్ల రామయ్య కుమారుడు కుమార్ రాజా, జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి, అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మీ ఉన్నారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అమీన్‌పూర్, కాప్రా, కూకట్‌పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్‌తో పాటు పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. మరికొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమైంది. అయితే కొన్ని ప్రాంతాల్లో భిన్నంగా ఎండ కాస్తోంది. మరి మీ ప్రాంతంలో వర్షం పడుతోందా? కామెంట్ చేయండి.
AP: బస్తిపాటి నాగరాజు.. కర్నూల్ పార్లమెంట్ నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన ప్రస్తుతం కర్నూలు రూరల్ మండలం పంచలింగాల-1 ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నారు. బీసీ నేత అయిన ఆయన్ని టీడీపీ ఎంపీ బరిలో నిలపగా వైసీపీ అభ్యర్థి బీవై రామయ్యపై 1,11,298 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇప్పటి వరకు గ్రామ ప్రజాప్రతినిధి అయిన నాగరాజు ఏకంగా పార్లమెంట్ గడప తొక్కనున్నారు. 2000 నుంచి ఆయన టీడీపీలో కార్యకర్తగా కొనసాగుతున్నారు.
దేశవ్యాప్తంగా చంద్రబాబు పేరు ట్రెండ్ అవుతోంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు TDP ఎంపీలు కీలకంగా మారడంతో.. బాబు ఎటువైపు వెళ్తారనేది ఆసక్తిగా మారింది. అయితే తాను ఎన్డీయే కూటమిలోనే ఉన్నానని, ఏమైనా మార్పులు ఉంటే చెబుతానని CBN తెలిపారు. అటు.. ఏపీకి ప్రత్యేక హోదా, అమరావతి అభివృద్ధి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, నిధుల కోసం డిమాండ్ చేసేందుకు టీడీపీ అధినేతకు ఇదే మంచి అవకాశమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు దూసుకెళ్తున్నాయి. మూడు రోజుల్లోనే 30 శాతం మేర లాభపడ్డాయి. అంటే రూ.140 మేర ఎగిశాయి. గురువారమైతే ఏకంగా 20 శాతంతో అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఇంట్రాడేలో 472 వద్ద కనిష్ఠ, 546 వద్ద గరిష్ఠ స్థాయుల్ని చేరాయి. చివరికి రూ.91 లాభంతో రూ.546 వద్దే ముగిశాయి. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం, కేంద్రంలో కీలకంగా మారడమే ఇందుకు కారణాలు. కంపెనీలో భువనేశ్వరికి 24.37% వాటా ఉంది.
AP: నారా లోకేశ్ మంత్రి పదవిపై చర్చ జరుగుతోంది. గత TDP ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన సమర్థంగా పని చేశారు. మంగళగిరి కేంద్రంగా IT అనుబంధ సంస్థల్ని ఏర్పాటు చేయించారు. స్కిల్ హబ్ సెంటర్ ద్వారా యువతకు అక్కడే శిక్షణ ఇప్పించారు. గన్నవరానికి HCL వంటి దిగ్గజ ఐటీ కంపెనీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మరి ఈసారి అదే శాఖ తీసుకుంటారా? మరేదైనా కీలక శాఖ బాధ్యతలు చేపడతారా? అనేది ఆసక్తిగా మారింది.
AP: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గానికి చెందిన నలుగురు MLAలుగా ఎన్నికయ్యారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దామచర్ల జనార్దన్ (ఒంగోలు), డీబీవీ స్వామి (కొండపి), ఎంఎం కొండయ్య (చీరాల), గంటా శ్రీనివాస్ (భీమిలి) ఈ నియోజకవర్గానికి చెందినవారే. అలాగే ఒంగోలులో ఓడిన YCP అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్ది, కందుకూరులో ఓడిన YCP అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా ఇదే సెగ్మెంట్‌కు చెందినవారు.
Sorry, no posts matched your criteria.