India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అసెంబ్లీ ఎన్నికల్లో 21 MLA సీట్లు సాధించిన తమ పార్టీ.. అధికారంలో భాగస్వామ్యం కచ్చితంగా తీసుకుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశంలోనే ఏపీ ఎన్నికలు కీలకంగా మారాయన్నారు. జనసేన గోరంత దీపం.. కొండంత వెలుగునిచ్చిందని చెప్పారు. ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారని.. ఇది రాజకీయాల్లో కొత్త మార్పునకు నాందికావాలని ఆకాంక్షించారు.
APలో టీడీపీ విజయంపై యంగ్ టైగర్ NTR స్పందించారు. ‘ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చరిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలు. ఏపీని అభివృద్ధి పథం వైపు నడిపిస్తారని ఆశిస్తున్నా. అద్భుత మెజార్టీతో గెలిచిన లోకేశ్, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్‌కి, ఎంపీలుగా గెలిచిన భరత్‌కి, పురందీశ్వరి అత్తకు, ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్‌కు నా శుభాకాంక్షలు’ అని NTR ట్వీట్ చేశారు.
ఏపీ సచివాలయంలో మంత్రుల నేమ్ బోర్డులను అధికారులు తొలగించారు. మంత్రుల ఛాంబర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. వాటిలోని సామగ్రి తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా కీలక ఫైళ్లు మిస్ అవుతున్నాయనే ఆరోపణలతో పలు శాఖల అధికారులు ఇప్పటికే సోదాలు చేపట్టారు. ల్యాప్‌టాప్‌లు, డేటాను పరిశీలిస్తున్నారు.
TG: మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రాజీనామా చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. బీజేపీ కోసం బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందని సీఎం తప్పుడు ప్రచారం చేశారని మీడియా సమావేశంలో విమర్శించారు. TGలో బీజేపీకి 10 సీట్లు వస్తాయని అంచనా వేసినా 8కే పరిమితమయ్యామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కేంద్రంతో ఇక్కడి ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబుకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చంద్రబాబుకు అభినందనలు చెప్పారు. ‘ఏపీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడుకి కంగ్రాట్స్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
☛ రవీంద్ర దత్తారామ్ వైకర్ – శివసేన- ముంబై నార్త్ వెస్ట్- 48 ఓట్ల మెజార్టీ
☛ అదూర్ ప్రకాశ్- కాంగ్రెస్- అత్తింగళ్(కేరళ)- 684 ఓట్ల మెజార్టీ
☛ నారాయణ్ బెహరా- BJP-జయపురం(ఒడిశా) -1587 ఓట్ల మెజార్టీ
☛ అనిల్ చోప్రా-కాంగ్రెస్-జైపూర్-1615 ఓట్ల మెజార్టీ
☛ భోజ్‌రాజ్ నాగ్-BJP-కాంకేర్(ఛత్తీస్‌గఢ్)-1884 ఓట్ల మెజార్టీ
తెలంగాణలో BJP 8 MP సీట్లు దక్కడం వెనుక కిషన్ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల మూణ్ణెళ్ల ముందు పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టడంతో అప్పటికప్పుడు క్యాడర్, లీడర్లను సెట్ చేసుకుని అసెంబ్లీ పోరులో గెలవడం అసాధ్యం. ఇది ఢిల్లీ పెద్దలకూ తెలుసు, కానీ పార్లమెంటు టార్గెట్‌తో ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించింది. అనుకున్నట్లే తన అనుభవం, చతురతతో ఆర్నెళ్లలోనే కాంగ్రెస్‌కు BJP ప్రత్యామ్నాయం అనేలా కిషన్ ఫలితం చూపారు.
బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి ప్రతికూల ఫలితాలు రావడంతో.. దానికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటానని తెలిపారు. తన రాజీనామాకు అనుమతించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. ప్రభుత్వంలో ఉండకుండా పార్టీ కోసం పని చేయాలనుకుంటున్నట్లు ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం మారడంతో ఏపీ సచివాలయంలో పోలీసు అధికారులు సోదాలు చేపట్టారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను పరిశీలించారు. సర్వర్లలోని డేటా డిలీట్ చేయడం లేదా బయటకు వెళ్లొచ్చనే అనుమానంతో తనిఖీలు చేపట్టారు. సిబ్బంది ల్యాప్‌టాప్‌లు బయటకు తీసుకెళ్లొద్దని ఆదేశించారు. పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.
కేంద్ర ‘జలశక్తి’ మంత్రి పదవిని టీడీపీ ఆశిస్తున్నట్టు సమాచారం. ఇదే జరిగితే తెలంగాణ నీటి వనరులు, కేటాయింపులపై తీవ్ర ప్రభావం పడొచ్చు. TG అసెంబ్లీ పోలింగ్ రోజు సాగర్ డ్యామ్‌ను AP అధీనంలోకి తీసుకుంది. దీంతో జలశక్తి పరిధిలోని KRMB రంగంలోకి దిగింది. సాగర్లో అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో TGకి 8.5, APకి 5.5 టీఎంసీల నీటిని ఏప్రిల్‌లో కేటాయించింది. ఇకపై వివాదాలు ముదిరితే ఏపీదే పైచేయి కావొచ్చు. మీరేమంటారు?
Sorry, no posts matched your criteria.