India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీకి 36.56శాతం ఓట్లు పడ్డాయి. ఆ తర్వాతి స్థానాల్లో INC(21.19%), SP(4.58%), TMC(4.37%), YSRCP(2.06%), BSP(2.04%), TDP(1.98%) RJD(1.57%), శివసేనUBT(1.48%), BJD(1.46%), NCP-శరద్ పవార్(0.92%) పార్టీలున్నాయి.
TG: గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ నెల 9న జరిగే ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినందున ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. జూన్ 9న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్-1 ప్రిలిమ్స్ మరో తేదీకి మార్చాలని దాఖలైన పిటిషన్‌పై వ్యాఖ్యానించింది.
జైలులో ఉన్న అమృత్ పాల్, షేక్ అబ్దుల్ రషీద్ నిన్న వెలువడిన ఫలితాల్లో ఎంపీలుగా గెలుపొందారు. అయితే, వీరు ప్రమాణ స్వీకారం చేసేందుకు పార్లమెంట్‌కు రావాల్సి ఉంటుంది. దీనికోసం అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. వీరిని ప్రత్యేక భద్రత నడుమ పార్లమెంట్‌కు తీసుకెళ్లి ప్రమాణస్వీకారం కాగానే తిరిగి జైలుకి తీసుకొస్తారు. దోషులుగా తేలి, రెండేళ్లు జైలులో ఉంటే వీరిపై అనర్హత వేటు పడుతుంది.
AP: కూటమికి బీజం వేసింది పవన్ కళ్యాణే అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ ముందుకొచ్చారని కొనియాడారు. బీజేపీ, టీడీపీ, జనసేన ఒకతాటిపైకి వచ్చి సమష్టిగా పని చేశాయని తెలిపారు. ‘గత ఐదేళ్లలో వ్యవస్థలు, ఎకానమీ కుప్పకూలాయి. ఎక్కడికక్కడ సహజ సంపదను దోచేశారు. అప్పులు ఎక్కడెక్కడ చేశారో తెలీదు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బాధ్యతతో పని చేస్తాం’ అని చెప్పుకొచ్చారు.
నిన్న భారీ నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం భారీ లాభాల దిశగా పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 1003 పాయింట్ల లాభంతో 73,082 వద్ద.. నిఫ్టీ 331 పాయింట్ల లాభంతో 22,216 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. HUL, హీరో మోటోకార్ప్, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా..BPCL, SBI, పవర్ గ్రిడ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిన్న సెన్సెక్స్ 4,390, నిఫ్టీ 1379 పాయింట్లు నష్టపోయాయి.
కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారనే విషయంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లో నాకు ఎంతో అనుభవం ఉంది. ఎన్నో రాజకీయ మార్పులను చూశా. ఇప్పుడు మేం ఎన్డీఏతోనే ఉన్నాం. ఇవాళ కూటమి మీటింగ్‌కు ఢిల్లీ వెళ్తున్నా. ఆ తర్వాత ఏమైనా మార్పులు ఉంటే మీకు(మీడియా) తప్పకుండా చెబుతా’ అని బాబు తెలిపారు.
AP: అసెంబ్లీని వైసీపీ ప్రభుత్వం కౌరవ సభగా మార్చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ‘శాసనసభలో నాకు, నా కుటుంబానికి, నా భార్యకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయా. గతంలో నాపై బాంబులతో దాడి చేసినప్పుడూ ఇంత బాధపడలేదు. గెలిచి సీఎంగానే వస్తానని ఆనాడు ప్రతిజ్ఞ చేశా. దాన్ని నిజం చేయడానికి ప్రజలు తోడ్పడ్డారు. ఇప్పుడు మళ్లీ శాసనసభను గౌరవసభ చేస్తా’ అని చెప్పారు.
YCP ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఐదేళ్లు మా కార్యకర్తలకు నిద్ర లేకుండా చేశారు. అహంకారులైన పాలకులకు ప్రజలు బుద్ధి చెప్పారు. కూటమికి 58.38%ఓట్లు పడ్డాయి. TDPకి 45%, YCPకి 39% ఓట్లు వచ్చాయి. స్వేచ్ఛను హరించడం వల్ల వచ్చిన ఈ ఫలితం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది’ అని అన్నారు.
లోక్‌సభ ఫలితాలపై పాక్ మీడియా ఆచితూచి స్పందించింది. అత్యుత్సాహం ప్రదర్శించలేదు. ‘ఆశ్చర్యకరంగా తక్కువ మార్జిన్‌తో గెలిచిన మోదీ కూటమి’ అని డాన్ పత్రిక హెడ్డింగ్ పెట్టింది. ‘రామ మందిరం కట్టిన చోట BJP ఓటమి, ఓటర్లు BJPని శిక్షించారన్న రాహుల్ గాంధీ’ అని బుల్లెట్ పాయింట్లు పెట్టింది. ఇక ఖతర్ కేంద్రంగా నడిచే అల్ జజీరా ‘మెజార్టీ కోల్పోవడం పీఎం మోదీ నేతృత్వంలోని కూటమికి పెద్ద దెబ్బే’ అని హెడ్‌లైన్ ఇచ్చింది.
నేడు పలు కీలక సమావేశాలకు ఢిల్లీ వేదిక కానుంది. కాసేపట్లో మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ చివరి సమావేశం జరగనుంది. అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకై రాజీనామా చేసే అవకాశం ఉంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై సాయంత్రం 4 గంటలకు ప్రధాని నివాసంలో NDA నేతల సమావేశం జరగనుంది. అటు సాయంత్రం 6 గంటలకు AICC చీఫ్ ఖర్గే నివాసంలో INDIA కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Sorry, no posts matched your criteria.