News June 5, 2024

నేడు స్టాక్ మార్కెట్ ఎలా ఉందంటే..!

image

స్టాక్ మార్కెట్ సూచీలు నేడు స్తబ్ధుగా చలిస్తున్నాయి. 73,027 వద్ద మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్ 250 పాయింట్ల లాభంతో 72,329 వద్ద కొనసాగుతోంది. 22,128 వద్ద ఓపెనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 46 పాయింట్లు ఎగిసి 21,931 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీలో 29 కంపెనీలు లాభపడగా 21 నష్టాల్లో ఉన్నాయి. HUL, బ్రిటానియా, టాటా కన్జూమర్, నెస్లే, హీరోమోటో టాప్ గెయినర్స్. LT, హిందాల్కో, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, NTPC టాప్ లాసర్స్.

News June 5, 2024

ఈనెల 10న ‘కల్కి’ ట్రైలర్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ‘కల్కి’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈనెల 10వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను ట్విటర్‌లో పంచుకున్నారు. ఈనెల 27న ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, బుజ్జి గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే.

News June 5, 2024

ఓడిపోయా.. నా పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా: ముద్రగడ

image

AP: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో పవన్‌ను ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందానన్నారు. త్వరలో పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు. గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా రెడీ చేసుకున్నానని వివరించారు. కాగా పవన్‌ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయన ఎన్నికల ముందు శపథం చేసిన విషయం తెలిసిందే.

News June 5, 2024

చంద్రబాబుతో సమావేశమైన సీఎస్

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లపై ఆయనతో సీఎస్ చర్చించినట్లు తెలుస్తోంది. డీజీపీ హరీశ్ కుమార్ కూడా బాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్న వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

News June 5, 2024

చట్టసభలకు మాజీ సివిల్ సర్వెంట్లు

image

AP: NDA తరఫున పోటీచేసిన నలుగురు మాజీ బ్యూరోక్రాట్లు చట్టసభల్లో తమ గళం వినిపించనున్నారు. బాపట్ల(SC) లోక్‌సభ స్థానంలో మాజీ IPS తెన్నేటి కృష్ణప్రసాద్ గెలుపొందారు. చిత్తూరు MP స్థానంలో మాజీ IRS అధికారి దగ్గుమళ్ల వరప్రసాద్ నెగ్గారు. అంబేడ్కర్ కోనసీమ(D) రాజోలు(SC)లో జనసేన అభ్యర్థి విశ్రాంత IAS అధికారి దేవ వరప్రసాద్, పల్నాడు జిల్లా ప్రత్తిపాడు(SC)లో మాజీ IAS బూర్ల రామాంజనేయులు MLAలుగా విజయం సాధించారు.

News June 5, 2024

FINAL రిజల్ట్స్.. కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వచ్చాయంటే?

image

దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో పార్టీల వారీగా అత్యధికంగా బీజేపీకి 240, కాంగ్రెస్‌కు 99, SPకి 37, టీఎంసీకి 29, డీఎంకేకు 22, టీడీపీకి 16, జేడీయూకు 12 సీట్లు వచ్చాయని ఈసీ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇక ఓవరాల్‌గా ఎన్డీఏకు 293, ఇండియా కూటమికి 232, ఇతరులకు 18 సీట్లు వచ్చాయి. కాగా 2019లో కాంగ్రెస్‌కు 52 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే.

News June 5, 2024

చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం ఫిక్స్?

image

AP: సీఎంగా 4వసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 9న ఉ.11.53 గంటలకు ఆయన పదవీ ప్రమాణం చేస్తారని TDP వర్గాలు వెల్లడించాయి. 12న కూడా పండితులు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. మరీ ఆలస్యమవుతుందనే కారణంతో వద్దనుకున్నట్లు సమాచారం. విజయవాడ-గుంటూరు హైవే పక్కనున్న పొలాలు/స్థలాలను టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో వేదికను ఖరారు చేయనున్నారు.

News June 5, 2024

విజయవాడ దెబ్బ అదుర్స్.. మామూలుగా ఉండదు!

image

AP: విజయవాడ ప్రజలు విలక్షణ తీర్పు ఇస్తుంటారన్నది మరోసారి నిరూపితమైంది. 2019లో YCP వేవ్‌లోనూ TDP MPగా గెలిచిన కేశినేని నాని ఈసారి YCP నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఇంజినీర్ KL రావు ఇక్కడ 3సార్లు గెలిచారు. ఈయనే 1980లో పార్టీ మారి పోటీ చేస్తే ఓడిపోయారు. అలాగే ఆ తర్వాత ఎవరైనా 2సార్లు నెగ్గారే తప్ప హ్యాట్రిక్ కొట్టలేదు. ఈసారి కేశినేని నాని హ్యాట్రిక్ ఆశలకు ఆయన సోదరుడే(చిన్ని) గండి కొట్టారు.

News June 5, 2024

సాయంత్రం ఇండియా కూటమి భేటీ

image

పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించిన INDIA కూటమి నేతలు ఇవాళ ఢిల్లీలో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు AICC చీఫ్ ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల ఫలితాలపై నేతలు సమీక్షించనున్నారు. తాజా ఫలితాల్లో ఇండియా కూటమి 234 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ 99 సీట్లలో గెలిచింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి బయట పార్టీలను కూడా ఆహ్వానించే విషయంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

News June 5, 2024

టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల విక్టరీ

image

గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. వీరిలో 17 మంది ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీలతో జయకేతనం ఎగురవేశారు. ఇందులో CBN, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, గంటా, చినరాజప్ప, గోరంట్ల, నిమ్మల, గద్దె, అనగాని, గొట్టిపాటి, వంటి నేతలున్నారు. ఉండి, రాజమండ్రి సిటీలో అభ్యర్థులు మారగా వారూ గెలిచారు. కాగా నలుగురు MLAలు YCP వైపు మళ్లారు. YCP నుంచి పోటీచేసిన వల్లభనేని వంశీ, కరణం వెంకటేశ్, వాసుపల్లి గణేశ్ ఓడిపోయారు.