India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆంటిగ్వా, బహ్రైన్, బెర్ముడా, బ్రూనై, బహమాస్, కాయ్‌మన్ ఐలాండ్స్, UAE, కువైట్, మొనాకో, ఒమన్, ఖతార్, సెయింట్ కీట్స్, సౌదీ అరేబియా, సోమాలియా, తుర్క్స్ & కైకోస్ ఐలాండ్స్, వనాటు, వెస్ట్రన్ సహారాలో Income Tax ఉండదు. ప్రత్యామ్నాయ పద్ధతులు, పరోక్ష పన్నుల ద్వారా ఆయా దేశాలు ఆదాయం సమకూర్చుకుంటాయి. అమెరికాలో ఆదాయ పన్నును రద్దు చేసేందుకు యోచిస్తున్నామంటూ <<15288589>>ట్రంప్<<>> ప్రకటించడంతో వీటిపై చర్చ జరుగుతోంది.

చైనీస్ డీప్‌సీక్AI పంజాకు గ్లోబల్ టెక్ కంపెనీ, సిలికాన్ వ్యాలీ ముద్దుబిడ్డ Nvidia షేర్లు కుదేలయ్యాయి. రాత్రికి రాత్రే $593 బిలియన్ల మార్కెట్ విలువ హరించుకుపోయింది. ఒక్కరోజులోనే 17% తగ్గింది. భారత కరెన్సీలో ఈ విలువ ఏకంగా రూ.51లక్షల కోట్ల వరకు ఉంటుంది. LSEG డేటా ప్రకారం వాల్‌స్ట్రీట్ చరిత్రలోనే ఇదే రికార్డు ఒకరోజు మార్కెట్ విలువ నష్టం. దీంతో మరికొన్ని రోజులూ టెక్ షేర్లకు నష్టాలు తప్పకపోవచ్చు.

ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. పిటిషనర్ బాలయ్య తరఫు న్యాయవాది మణీంద్రసింగ్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదొక పనికిమాలిన పిటిషన్ అని, దీనిపై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ కేసును వాదించడానికి ఎలా వచ్చారంటూ ప్రశ్నించింది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో దాదాపు 10 రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 2 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.490 తగ్గి రూ.81,930గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.450 తగ్గి రూ.75,100కు చేరింది. వెండి ధర కేజీకి రూ.1,000 తగ్గి రూ.1,04,000గా ఉంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ ప్రజలకు సంచలన ఆఫర్ ప్రకటించారు. వారికి ఆదాయపు పన్నును తొలగించేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నట్లు రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో స్పష్టం చేశారు. ఆ నిర్ణయం వల్ల తగ్గే ఆదాయాన్ని ఇతర దేశాలపై దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా సమకూర్చుకుంటామని పేర్కొన్నారు. అమెరికన్లను మరింత శక్తిమంతులుగా, సంపన్నులుగా మారుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను CM చంద్రబాబు ఘోరంగా మోసం చేశారని APCC చీఫ్ షర్మిల విమర్శించారు. ‘డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెబుతున్నారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు గారి తీరు. హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర ఆర్థిక భారం కనపడలేదా?’ అని ప్రశ్నించారు. పథకాలకు కేంద్రం డబ్బులివ్వకపోతే వెంటనే BJPకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోవాలని సూచించారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రెండు వారాల్లోనే ₹100కోట్లకు పైగా లాభాలు సాధించిందని సినీ వర్గాలు తెలిపాయి. 72 వర్కింగ్ డేస్‌లో దాదాపు ₹50కోట్లతో ఈ సినిమాను రూపొందించారని పేర్కొన్నాయి. తెలుగులో ఈ బడ్జెట్‌లో తెరకెక్కి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన మూవీ ఇదేనేమోనని రాసుకొచ్చాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ నటించిన ఈ సినిమా ఈనెల 14న విడుదలై ఇప్పటివరకు ₹270crకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గద్దర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గద్దర్‌పై అనేక కేసులు ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు తీసిన నరహంతకుడతను. ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకి. నిషేధిత మావోయిస్టు సంస్థలో పనిచేసిన గద్దర్‌కు అవార్డు ఎలా ఇవ్వమంటారు? అతడికి, ఎల్టీటీఈకి పెద్ద తేడా లేదు. రాజీవ్ గాంధీని బలితీసుకున్న ఎల్టీటీఈకి కూడా రేవంత్ పద్మ అవార్డులు ఇవ్వమంటారా?’ అని ప్రశ్నించారు.

TG: CM రేవంత్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతోందని BRS నేత RS.ప్రవీణ్ అన్నారు. రాష్ట్ర ఆదాయం, ఉద్యోగ అవకాశాల పెంపునకు గత ప్రభుత్వం ‘మొబిలిటీ వ్యాలీ’ కార్యక్రమం పెట్టడానికి సంకల్పించిందని గుర్తుచేశారు. ఫార్ములా-ఈ రేసు నాలుగు సార్లు జరగాల్సి ఉందని, రేవంత్ వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోయాయని ఆరోపించారు. CM రేవంత్‌పై FIR నమోదు చేయాలని నార్సింగ్ PSలో ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

విరాట్ కోహ్లీ మరెంతో కాలం ఆడే అవకాశం లేని నేపథ్యంలో ఆయన ఎప్పుడు ఎక్కడ ఆడినా లైవ్ చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. విరాట్ 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఈ నెల 30న ఢిల్లీ తరఫున రంజీ బరిలో దిగనుండగా ఆ మ్యాచ్ టెలికాస్ట్ కాకపోవచ్చని తెలుస్తోంది. దీంతో విరాట్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అటు.. ఢిల్లీ టీమ్ పగ్గాలను ఆ జట్టు మేనేజ్‌మెంట్ ఆఫర్ చేయగా విరాట్ తిరస్కరించినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.