News January 27, 2025

నాగోబా జాతర శుభాకాంక్షలు చెప్పిన సీఎం

image

TG: దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన నాగోబా జాతర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ (D) కేస్లాపూర్‌లో (మెన్షన్) మెస్రం వంశస్థుల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు సాగుతుందని, భక్తులు నాగోబాను దర్శించుకొని ఆశీస్సులు అందుకోవాలని ఆకాంక్షించారు. అధికారికంగా నిర్వహిస్తున్న ఈ జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు వెల్లడించారు. కాగా రేపటి నుంచి జాతర ప్రారంభం కానుంది.

News January 27, 2025

కొత్త క్యాంపెయిన్ ప్రారంభించిన వైసీపీ

image

AP: అధికార మదంతో కూటమి నేతలు ఊరురా దాడులు, దౌర్జన్యానికి పాల్పడుతూ అక్రమాలు చేస్తున్నారని వైసీపీ మండిపడింది. బాధితులకు అండగా ఉంటామంటూ కొత్త క్యాంపెయిన్ షురూ చేసింది. ‘మీ ఊరిలో కూటమి నేతలు అరాచకాలు చేస్తే ఫొటోలు, వీడియోలు తీసి #KutamiFiles #ConstituencyName ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి’ అని పిలుపునిచ్చింది. బాధితుల తరఫున వైసీపీ పోరాటం చేస్తుందని పేర్కొంది.

News January 27, 2025

అంతరిక్షం నుంచి మహాకుంభమేళా ఫొటోలు

image

యూపీ ప్రయాగ్‌రాజ్‌లో ‘మహా కుంభమేళా’ వైభవంగా కొనసాగుతోంది. రోజూ కోట్లాది మంది భక్తుల పుణ్యస్నానాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రాత్రి వేళ విద్యుత్ కాంతులతో ఉన్న మహాకుంభమేళా వైభవాన్ని ISSలో ఉన్న నాసా వ్యోమగామి డాన్ పెటిట్ ఫొటో తీశారు. ‘గంగా నది తీరంలో ప్రపంచంలోనే అతి పెద్ద మానవ సమ్మేళనం రాత్రివేళ వెలుగులీనుతోంది’ అని రాసుకొచ్చారు. ఈ చిత్రాలు వైరలవుతున్నాయి.

News January 27, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ.. రేపు టికెట్లు విడుదల

image

FEB 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు ICC వెల్లడించింది. PAK కాలమానం ప్రకారం మ.2 గంటలకు టికెట్లు <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంటాయంది. కరాచీ, లాహోర్, రావల్పిండిలో జరిగే 10 మ్యాచ్‌ల టికెట్లను బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. దుబాయ్ వేదికగా జరిగే IND మ్యాచ్‌ల టికెట్లను త్వరలో రిలీజ్ చేస్తామంది. ఫైనల్ మ్యాచ్(MAR 9) టికెట్లు 4 రోజుల ముందు అందుబాటులోకి వస్తాయంది.

News January 27, 2025

శ్రీచైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ సీజ్

image

TG: మాదాపూర్‌లో శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించిన సెంట్రల్ కిచెన్‌‌ లైసెన్స్ రద్దు చేసిన అధికారులు తాజాగా కిచెన్‌ను సీజ్ చేశారు. ఈ మేరకు ఆ ఫొటోలను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ట్వీట్ చేశారు. ఆరు నెలల వ్యవధిలో పలుమార్లు చేసిన తనిఖీల్లో పిల్లలకు నాసిరకం భోజనం అందిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే.

News January 27, 2025

విడాకుల తర్వాత బాధపడ్డా.. కానీ ధైర్యాన్ని కోల్పోలేదు: సమంత

image

విడాకులు తీసుకున్న మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో తనకు బాగా తెలుసునని హీరోయిన్ సమంత చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నా గురించి ఎన్నో అబద్ధాలు పుట్టించారు. అందులో నిజం లేదని చాలాసార్లు చెప్పాలనిపించింది. అయితే నాతో నేను చేసుకున్న సంభాషణే ఆపింది. డివోర్స్ తర్వాత బాధగా అనిపించినా నేను ఏడుస్తూ ధైర్యాన్ని కోల్పోలేదు. నా జీవితంలో తదుపరి అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నా’ అని పేర్కొన్నారు.

News January 27, 2025

కస్టోడియల్ డెత్‌ కేసు: 8 మంది పోలీసులకు జీవిత ఖైదు

image

కస్టోడియల్ డెత్‌ కేసులో చండీగఢ్ CBI ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హిమాచల్‌ ప్ర‌దేశ్‌కు చెందిన ఐజీ స‌హా మ‌రో ఏడుగురు తాజా, మాజీ పోలీసుల‌కు జీవిత ఖైదు విధించింది. 2017లో సిమ్లాలో ఓ మైన‌ర్ బాలికపై హ‌త్యాచారం కేసులో నిందితుడు పోలీసుల క‌స్ట‌డీలో మృతి చెందాడు. అయితే క‌స్ట‌డీలో ఉన్న అతణ్ని మ‌రో నిందితుడు హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు చిత్రీక‌రించారు. విచార‌ణ అనంత‌రం కోర్టు వారిని దోషులుగా తేల్చింది.

News January 27, 2025

ఘోరం: శానిటరీ ప్యాడ్ అడిగిన బాలికను..

image

శానిటరీ ప్యాడ్ అడిగిన 11వ తరగతి బాలిక పట్ల ప్రిన్సిపల్ అమానవీయంగా ప్రవర్తించిన ఘటన UP బరేలీలో జరిగింది. ఎగ్జామ్ రాస్తుండగా విద్యార్థినికి పీరియడ్స్ మొదలయ్యాయి. బ్లీడింగ్ కావడంతో దిక్కుతోచని ఆమె శానిటరీ ప్యాడ్ ఇవ్వాలని ప్రిన్సిపల్‌ను అడిగింది. వెంటనే ఏర్పాటుచేయాల్సిన ఆయన బాలికను అవమానిస్తూ గంటపాటు బయట నిలబెట్టాడు. ఈ ఘటనపై ఆమె తండ్రి ఫిర్యాదుతో విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News January 27, 2025

కాంబ్లీకి విడాకులు ఇవ్వాలనుకున్నా.. కానీ: ఆండ్రియా

image

మాజీ క్రికెటర్ <<15042382>>వినోద్ కాంబ్లీతో<<>> వివాహ బంధంపై రెండో భార్య ఆండ్రియా హెవిట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాగుడుకు బానిసైన ఆయనకు 2023లో విడాకులు ఇవ్వాలనుకున్నట్లు తెలిపారు. అయితే కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆలోచనను విరమించుకున్నట్లు చెప్పారు. ‘నేను వదిలేస్తే కాంబ్లీ నిస్సహాయ స్థితిలో ఉంటారు. అది నన్ను బాధిస్తుంది. అందుకే డివోర్స్‌ నిర్ణయం వెనక్కి తీసుకున్నా’ అని పేర్కొన్నారు.

News January 27, 2025

ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్

image

అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఎన్నికల్లో గెలవడం, బాధ్యతలు చేపట్టడంపై మోదీ అభినందనలు తెలియజేశారు. ట్రంప్ పాలనలో అమెరికా మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరువురు నేతల మధ్య ఇదే తొలి ఫోన్ సంభాషణ.