News January 27, 2025

Stock Markets: క్రాష్ తప్పదేమో..!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ ఏకంగా 170PTS నష్టాల్లో ట్రేడవుతోంది. ఆసియా, గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్సే అందుతున్నాయి. బడ్జెట్ సమీపిస్తుండటం, US ఫెడ్ మీటింగ్, అమెరికా ఎకానమీ డేటా, BOJ వడ్డీరేట్లు పెంచడం, Q3 ఫలితాలు ప్రభావం చూపనున్నాయి. డాలర్ ఇండెక్స్ మళ్లీ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటమే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 27, 2025

విదేశీ గంజాయి కలకలం.. అమెరికా నుంచి హైదరాబాద్‌కు..

image

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అమెరికా నుంచి తెచ్చిన 170 గ్రాముల విదేశీ గంజాయిని గచ్చిబౌలిలో పోలీసులు సీజ్ చేశారు. దీన్ని సరఫరా చేస్తున్న శివరామ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అబయ్ పరారీలో ఉన్నాడు. అమెరికా నుంచి గంజాయిని తెచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

News January 27, 2025

బ్రేక్ ఫాస్ట్‌లో ఏదో ఒకటి తినేద్దాం అనుకుంటున్నారా?

image

ఉదయం పూట కొందరు పని హడావుడిలో ఏదో ఒకటి తినేసి వెళ్తుంటారు. కానీ రోజంతా ఉత్సాహాన్ని ఇచ్చే ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన బ్రెడ్, అటుకులు, ఓట్ మీల్ వంటివి తీసుకోవాలి. గుడ్లు, పెరుగు వంటితోపాటు పీచు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. పండ్లు, ఆమ్లెట్, బాదం, అక్రోట్, సోయాపాలు, కాయగూరలు తినాలి. నూనెలో ముంచి తీసే పూరీ, వడ, బోండాలకు దూరంగా ఉండేలా చూసుకోవాలి.

News January 27, 2025

బాబర్ ఆజమ్ పరమ చెత్త రికార్డు

image

పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్ వైఫల్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. గత 61 ఇన్నింగ్సుల్లో (అన్ని ఫార్మాట్లు) బాబర్ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. దీంతో ఇన్ని ఇన్నింగ్సులు ఆడి సెంచరీ చేయని టాపార్డర్ బ్యాటర్‌గా అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు. కాగా బాబర్ కొద్ది రోజులుగా అన్ని ఫార్మాట్లలో పేలవ ప్రదర్శన చేస్తున్నారు. చివరిసారిగా ఆయన 2022లో మూడంకెల స్కోరు సాధించారు. అప్పటి నుంచి ఆయన మరో శతకం నమోదు చేయలేదు.

News January 27, 2025

ఊపిరి పీల్చుకున్న లాస్ ఏంజెలిస్

image

కార్చిచ్చుతో ఉక్కిరి బిక్కిరి అయిన లాస్ ఏంజెలిస్ తొలకరి వర్షాలతో ఊపిరి పీల్చుకుంది. ఈ సీజన్‌లో అక్కడ తొలికరి జల్లు కురిసింది. మరో మూడు రోజులపాటు కూడా అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ విభాగం తెలిపింది. ఈ వర్షాలతో కొత్త మంటలు చెలరేగకుండా ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ వానలతో కాలిపోయిన కొండ ప్రాంతాల నుంచి బూడిద ప్రవాహం కొట్టుకువస్తుందనే ఆందోళనలో ప్రజలు ఉన్నారు.

News January 27, 2025

నేడు కోర్టుకు లోకేశ్

image

AP: మంత్రి లోకేశ్ నేడు విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకు వెళ్లనున్నారు. సాక్షి పత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ కోసం ఆయన స్వయంగా హాజరుకానున్నారు. 2019కి ముందు వైజాగ్ ఎయిర్‌పోర్టులో లోకేశ్ స్నాక్స్ కోసం ఖర్చయిందని సాక్షి కథనం ప్రచురించింది. ఇది తప్పుడు ప్రచారమని గతంలో ఖండించిన ఆయన, అసత్యాలతో పరువుకు భంగం కల్గించారంటూ రూ.75 కోట్లకు దావా వేశారు.

News January 27, 2025

రేపు ఆ స్కూళ్లకు సెలవు

image

ఈనెల 28న షబ్ ఎ మిరాజ్ సందర్భంగా సెలవు ఉండే అవకాశముంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా పేర్కొనగా మైనార్టీ విద్యాసంస్థలు హాలిడే ప్రకటించనున్నాయి. మిగతావి తమ స్వీయ నిర్ణయం ప్రకారం తరగతుల నిర్వహణ లేదా సెలవును ఇవ్వవచ్చు. జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల్లో రేపు షబ్ ఎ మిరాజ్‌కు ఆయా ప్రభుత్వాలు సెలవు ప్రకటించాయి.

News January 27, 2025

UAE లేదా బంగ్లాతో భారత్ వామప్ మ్యాచ్?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు టీమ్ ఇండియా ఓ వామప్ మ్యాచ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ లేదా యూఏఈలో ఏదో ఒకదానితో ఈ మ్యాచ్ ఆడుతుందని సమాచారం. కాగా ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత్ తమ మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా ఆడనుంది. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. మార్చి 9న మెగా ఈవెంట్ ఫైనల్ జరగనుంది.

News January 27, 2025

అకౌంట్లలో డబ్బులు పడ్డాయా?

image

TG: అర్ధరాత్రి నుంచి ‘రైతు భరోసా’, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని సీఎం రేవంత్ నిన్న ప్రకటించారు. తొలి దశలో భాగంగా ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో పడతాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సుమారు 10 లక్షల మంది రైతు కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అందే సూచనలు ఉన్నట్లు సమాచారం. మరి మీకు డబ్బులు పడ్డాయా?

News January 27, 2025

నేడు ఇండోర్‌కు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఇవాళ మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. ఇండోర్‌లో సమీపంలోని అంబేడ్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్‌లో జరిగే ‘సంవిధాన్ బచావో’ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీలు కూడా వెళ్తారు. సాయంత్రం తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.