News April 24, 2024

IPL.. బౌండరీ లైన్ల పరిధి పెంచాలని డిమాండ్

image

IPL-2024లో 250+ స్కోర్లు నమోదవుతున్నాయి. దీనిపై స్పందించిన సునీల్ గవాస్కర్.. ‘ప్రతి గ్రౌండ్‌లో బౌండరీ లైన్ల పరిధి పెంచాలి. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్‌కు, క్యాచ్‌కు తేడా లేదు. 2-3 మీటర్ల వరకు బౌండరీ పరిధి పెంచాలి. లేదంటే బౌలర్లు ఇబ్బంది పడతారు. క్రికెట్‌లో బ్యాటర్లు, బౌలర్ల మధ్య భీకరపోరు జరిగితేనే మ్యాచ్ ఆసక్తిగా ఉంటుంది. ప్రతిసారీ బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగినా బోర్ కొడుతుంది’ అని అభిప్రాయపడ్డారు.

News April 24, 2024

12 ఏళ్లలో ఇదే తొలిసారి

image

లోక్‌సభ ఎన్నికల్లో సూరత్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ముకేశ్ దలాల్ అరుదైన ఘనత సాధించారు. గత 12 ఏళ్లలో ఇలా సీటు కైవసం చేసుకున్న తొలి ఎంపీగా నిలిచారు. దీంతో 1951 నుంచి ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీల సంఖ్య 35కు చేరింది. చివరిసారిగా 2012లో యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

News April 24, 2024

సీఎస్ కీలక ఆదేశాలు

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29 వరకు నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుందని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపాలని ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా జాగ్రత్త పడాలని సీఎస్ సూచించారు.

News April 24, 2024

IPL: వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్

image

ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ప్రస్తుతం 6 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 61 రన్స్ చేసింది. ప్రస్తుతం బట్లర్ 28*, జైస్వాల్ 31* క్రీజులో ఉన్నారు. RR విజయానికి 84 బంతుల్లో 119 రన్స్ కావాలి.

News April 24, 2024

విశాఖను గంజాయి హబ్‌గా మార్చారు: CBN

image

AP: విశాఖను CM జగన్ గంజాయి హబ్‌గా మార్చారని TDP అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు విశాఖలో ఉండటం బాధాకరం. ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా భూ మాఫియా, సెటిల్‌మెంట్లే. రాక్షస మాఫియా వచ్చి విశాఖను నాశనం చేస్తోంది. ఉత్తరాంధ్రలో వేల కోట్ల ఆస్తులు కొట్టేశారు. ఎవరివల్ల రాష్ట్రం బాగుంటుందో ప్రజలు ఆలోచించాలి. మేం రాగానే మెగా DSCపైనే తొలి సంతకం ‘ అని శృంగవరపుకోట సభలో స్పష్టం చేశారు.

News April 24, 2024

IPLలో వికెట్లు ఇలా..

image

ఐపీఎల్‌లో చాహల్ 200 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన మొదటి బౌలర్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మెగా టోర్నీలో తొలిసారి 50 వికెట్లు తీసిన బౌలర్‌ ఆర్పీ సింగ్. ఇక 100, 150 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా లసిత్ మలింగ రికార్డులకెక్కారు.

News April 24, 2024

ముంబైకి అండగా తిలక్ వర్మ

image

ముంబై ఇండియన్స్ టీమ్‌కు తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ అండగా నిలుస్తున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ టీమ్‌ను గౌరవప్రదమైన స్థానంలో నిలుపుతున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు వరుసగా 25, 64, 32, 6, 16*, 31, 34*, 65 రన్స్ చేసిన 21 ఏళ్ల వర్మ.. ముంబైకి బ్యాక్ బోన్‌గా మారారు. బ్యాటింగ్‌లో మంచి టచ్‌లో ఉన్న తిలక్‌ను T20WC కోసం భారత జట్టుకు ఎంపిక చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

News April 24, 2024

సర్వేల ప్రకారం BRSకు 8-10 సీట్లు: KTR

image

ఈ LS ఎన్నికల్లో BRS 8-10 స్థానాల్లో గెలుస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు కాంగ్రెస్, BJP ప్రభుత్వాల మోసాలను సైతం వెలుగులోకి తేవాలని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హామీలను ప్రజలకు తెలియజేయాలన్నారు. సిరిసిల్లలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News April 24, 2024

రాణించిన సందీప్ శర్మ.. ముంబై 179/9

image

IPL: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో 20ఓవర్లలో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్(6), ఇషాన్(0)తో పాటు సూర్య కుమార్(10), హార్దిక్(10) విఫలమయ్యారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ(65), వధేరా(49) రాణించడంతో ముంబై గౌరవప్రదమైన స్కోర్ చేసింది. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ(5), బౌల్ట్(2) వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టారు.

News April 24, 2024

సీఎం జగన్ రేపటి బస్సు యాత్ర షెడ్యూల్

image

AP: CM జగన్ రేపటి బస్సు యాత్ర షెడ్యూల్‌ను వైసీపీ విడుదల చేసింది. 21వ రోజు యాత్రలో భాగంగా ఎంవీవీ సిటీ నుంచి రేపు ఉ.9 గంటలకు బయల్దేరి మధురవాడ, ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో CM భేటీ అవుతారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ, బొద్దవలస మీదుగా చెల్లూరు చేరుకుని సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం, అక్కివలస చేరుకుంటారు.