News April 22, 2024

అభ్యర్థుల ప్రకటన ఇంకెప్పుడు?

image

TG: లోక్‌సభ నామినేషన్ల గడువు 25న ముగియనుంది. ఇప్పటికే BRS, BJP అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తున్నాయి. కానీ అధికార కాంగ్రెస్ మాత్రం మరో 3 స్థానాల్లో క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉంది. HYD, ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. పలుమార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లొచ్చినా ఈ ప్రక్రియ కొలిక్కి రాలేదు. దీంతో అభ్యర్థి ఎవరో తెలియకుండా ప్రచారమెలా చేయాలని కార్యకర్తలు అంటున్నారు.

News April 22, 2024

వేసవి సెలవులు.. స్కూళ్లకు ప్రభుత్వం హెచ్చరిక

image

AP: పాఠశాలలకు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 12న స్కూళ్లు పున:ప్రారంభం కానుండగా.. సెలవుల్లో పాఠశాలలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. చట్టం ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 23వ తేదీ ఆఖరి పని దినం కానున్నట్లు తెలిపింది. అదే రోజు విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందిస్తామని పేర్కొంది.

News April 22, 2024

పండువెన్నెల్లో నేడు ఒంటిమిట్ట రాములోరి కళ్యాణం

image

AP: కడప జిల్లా ఒంటిమిట్టలో నేడు సీతారాముల కళ్యాణం నిర్వహించనున్నారు. సాధారణంగా అన్ని ఆలయాల్లో శ్రీరామ నవమి రోజున కళ్యాణం జరుపుతారు. ఇక్కడ మాత్రం నవమి తర్వాత చతుర్దశి రోజున పండువెన్నెల్లో స్వామివార్ల పెళ్లి వేడుక నిర్వహిస్తారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈ ఉత్సవానికి సీఎం జగన్ బదులు దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

News April 22, 2024

జాన్సన్ బేబీ పౌడర్‌తో మహిళకు క్యాన్సర్.. రూ.375 కోట్ల పరిహారం

image

ప్రఖ్యాత జాన్సన్& జాన్సన్, కెన్‌వ్యూ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థల బేబీ పౌడర్లు వాడటం వల్ల థెరిసా గార్సియా అనే మహిళ క్యాన్సర్‌తో చనిపోయినట్లు చికాగో కోర్టు తేల్చింది. ఆమె కుటుంబానికి రూ.375 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ‘ఆస్బెస్టాస్ ఎక్స్‌పోజర్‌తో ముడిపడిన క్యాన్సర్ మెసోథెలియోమాతో థెరిసా మరణించింది. దీనికి కెన్‌వ్యూ 70%, JJ 30% బాధ్యత వహించాలి’ అని స్పష్టం చేసింది.

News April 22, 2024

సీఎంపై రాళ్ల దాడి చేస్తామంటూ ఫోన్ కాల్స్!

image

AP: సీఎం జగన్‌పై రాళ్ల దాడి చేస్తామంటూ ఆకతాయిలు 1902 హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేసి బెదిరించారు. దీనిపై విచారణ చేపట్టిన విశాఖ పోలీసులు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీఎం ఆదివారం విశాఖలో నిర్వహించిన రోడ్ షోలో రాళ్ల దాడి చేస్తామని వీరు 1902కు కాల్ చేశారు.

News April 22, 2024

RCB ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

image

ఈ ఏడాదీ RCBకి అదృష్టం కలిసి రాలేదు. 8 మ్యాచ్‌లలో ఒకటి గెలిచి, ఏడింట్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఏదైనా జట్టు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే 16 పాయింట్లు ఉండాలి. RCB మిగిలిన 6 మ్యాచ్‌లను భారీ మార్జిన్‌లతో గెలిచినా 14 పాయింట్లే ఉంటాయి. దీనిప్రకారం ఆ జట్టు సొంతంగా ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం లేదు. మిగతా టీమ్‌లపై ఆధారపడాల్సిందే. అవి భారీ తేడాలతో ఓడిపోవడం లేదా మ్యాచ్‌లు రద్దవడం జరగాలి.

News April 22, 2024

మాల్దీవులు: ముయిజ్జు పార్టీ ఘన విజయం

image

మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (PNC) ఘన విజయం సాధించింది. మొత్తం 93 సీట్లు ఉండగా, 88 స్థానాల ఫలితాలను ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో 66 సీట్లను ముయిజ్జు పార్టీ కైవసం చేసుకుని, స్పష్టమైన మెజారిటీతో మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. కాగా, ముయిజ్జు చైనాకు విధేయుడిగా ఉన్నారు.

News April 22, 2024

నేడు డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదల

image

ఏపీ డీఈఈసెట్-2024 నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సుకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మే 9వ వరకు అప్లై చేసుకోవచ్చు. అదే నెల 21న హాల్ టికెట్లు, 24న పరీక్ష, మే 30న ఫలితాలు వెల్లడిస్తారు. జూన్ 6వ తేదీ నుంచి కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు నమోదు, 12 నుంచి 15 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.

News April 22, 2024

నేటి నుంచి 3 రోజుల పాటు సలేశ్వరం జాతర

image

TG: తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు ఉ.7 నుంచి సా.6 వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. నల్లమల అడవుల్లో కొండలు, వాగులు దాటుకుంటూ లోయ గుహలో వెలసిన లింగం దగ్గరకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు రాంపూర్‌పెంట వరకు బస్సులు, కార్లలో వచ్చి, అక్కడి నుంచి 5 కి.మీ దట్టమైన అడవుల్లో నడవాల్సి ఉంటుంది.

News April 22, 2024

మర్రి చెట్టు తొర్రలో రూ.66 లక్షలు దాచారు.. చివరికి ఏమైందంటే?

image

AP: ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇటీవల ATMలో నగదు నింపే వ్యాన్ నుంచి రూ.66 లక్షలను దుండుగులు దోచుకెళ్లారు. ఇంటి దొంగలే ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. ఆ నగదును మర్రి చెట్టు తొర్రలో దాచినట్లు వారు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. అక్కడికెళ్లి ఆ మొత్తాన్ని సీజ్ చేశారు.