News June 4, 2024

పర్చూరు, కందుకూరులో టీడీపీ గెలుపు

image

AP: ప్రకాశం జిల్లాలోని పర్చూరు, కందుకూరు నియోజకవర్గాల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. పర్చూరులో ఏలూరి సాంబశివరావు, కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు గెలిచారు. చీరాలలో ఎంఎం కొండయ్య యాదవ్, మార్కాపురంలో కందుల నారాయణరెడ్డి విజయ దుందుభి మోగించారు.

News June 4, 2024

175 సీట్లు గెలిస్తే ఎంత బాధ్యత ఉంటుందో.. ఇప్పుడూ అంతే ఉంది: పవన్

image

AP: ఏపీ ప్రజలు తనకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘మెగా డీఎస్సీ ఇప్పించే బాధ్యత నాది. సీపీఎస్ విషయంలో ఉద్యోగులకు న్యాయం చేస్తాం. ఏరు దాటాక తెప్ప తగలేసే బుద్ధి నాకు లేదు. 175 సీట్లు గెలిస్తే ఎంత బాధ్యత ఉందో ఇప్పుడూ అంతే ఉంది. మా పాలనలో శాంతి భద్రతలు చాలా బలంగా ఉంటాయి. వ్యవస్థల్లో రాజకీయ జోక్యం ఉండదు’ అని పవన్ స్పష్టం చేశారు.

News June 4, 2024

నాకు ఇది తొలి విజయం: పవన్ కళ్యాణ్

image

AP: తన జీవితంలో ఇప్పటివరకు విజయం అంటే తెలీదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘సినిమాల్లో ఉన్నప్పుడు ‘‘తొలిప్రేమ’’తో విజయం చూశా అంతే. ఆ తర్వాత నేను విజయం సాధించానని గానీ డబ్బులు వచ్చాయని గానీ ఎవరూ చెప్పలేదు. నా జీవితమంతా దెబ్బలు తింటూ, మాటలు పడుతూ గడిపేశా. ఈరోజు నాకు 21కి 21 స్థానాల్లో విజయం అందించారు’ అని కార్యకర్తల సమావేశంలో పవన్ తెలిపారు.

News June 4, 2024

కేరళలో 9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం.. 5 చోట్ల లీడింగ్

image

కేరళలో 20 స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటివరకు 9 స్థానాలు గెలిచింది. మరో 5 చోట్ల ముందంజలో ఉంది. సీపీఎం, బీజేపీ, RSP ఒక్కో స్థానంలో గెలిచి, ఒక్కో స్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి. IUML పార్టీ రెండు చోట్ల, KEC ఒక చోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
INC గెలిచిన స్థానాలు: ఎర్నాకులం, ఇడుక్కి, మావెలిక్కర, తిరువనంతపురం, కోజికోడ్, వయనాడ్, వదకర, చాలకుడి, అలప్పుజ

News June 4, 2024

నారా లోకేశ్‌కు భారీ మెజారిటీ

image

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ భారీ మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి పాలైన లోకేశ్.. ఈసారి అదే స్థానం నుంచి 91వేల ఓట్లకు పైగా మెజారిటీతో జయకేతనం ఎగరేశారు.

News June 4, 2024

మోదీ రాజీనామా చేయాలి: మమత

image

ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ప్రధాని మోదీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆయన వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘మేము బీజేపీ వెన్ను విరిచి రాజకీయ రివేంజ్ తీర్చుకున్నాం’ అని ఆమె అన్నారు. పార్టీకి తక్కువ సీట్లు రావడంతో టీడీపీ, జేడీయూ మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోందని మమత తెలిపారు.

News June 4, 2024

విజయనగరంలో కూటమి క్లీన్ స్వీప్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2019 ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని TDP.. ఈ ఎన్నికల్లో మొత్తం 9 స్థానాల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, కురుపాం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపు కోట, విజయనగరంలో TDP అభ్యర్థులు గెలుపొందగా.. నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. గత ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన YCP ఈ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం గమనార్హం.

News June 4, 2024

NDAకు టీడీపీ, జేడీయూ ‘హ్యాండ్’ ఇస్తే!

image

బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటేలా లేదు. దీంతో ఎన్డీయేకి TDP, JDU ‘హ్యాండ్’ ఇస్తే పరిస్థితి ఏంటని నెట్టింట చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఈ కూటమి 294 సీట్లలో గెలుపు/ముందంజలో ఉంది. టీడీపీకి 16, జేడీయూకి 12 ఉన్నాయి. ఈ 28 తీసేస్తే మిగిలినవి 266. ప్రభుత్వ ఏర్పాటుకు 272 కావాలి. అంటే NDAకు మరో 6 అవసరం. బీజేపీ వద్ద 243 ఉన్నాయి. అనూహ్య పరిస్థితులు ఎదురైతే చిన్నపార్టీలు, ఇతరుల సాయంతో ప్రభుత్వం నడపొచ్చు.

News June 4, 2024

TTD ఛైర్మన్ పదవికి భూమన రాజీనామా

image

AP: వైసీపీ ఘోర ఓటమితో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీటీడీ ఈవోకు ఆయన రాజీనామా లేఖ రాశారు. వెంటనే తన రిజైన్ ఆమోదించాలని కోరారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కుమారుడు భూమన అభినయ్ ఓటమి దిశగా సాగుతున్నారు.

News June 4, 2024

అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ విజయం

image

స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీలోని మైన్‌పురి స్థానంలో పోటీ చేసిన ఆమె 2,21,639 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు నార్త్ గోవాలో బీజేపీ అభ్యర్థి శ్రీపాద్ నాయక్ వరుసగా ఆరోసారి విక్టరీ అందుకున్నారు. సౌత్ గోవాలో కాంగ్రెస్ అభ్యర్థి విరియాటో ఫెర్నాండెజ్ విజయం సాధించారు.