India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తన జీవితంలో ఇప్పటివరకు విజయం అంటే తెలీదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘సినిమాల్లో ఉన్నప్పుడు ‘‘తొలిప్రేమ’’తో విజయం చూశా అంతే. ఆ తర్వాత నేను విజయం సాధించానని గానీ డబ్బులు వచ్చాయని గానీ ఎవరూ చెప్పలేదు. నా జీవితమంతా దెబ్బలు తింటూ, మాటలు పడుతూ గడిపేశా. ఈరోజు నాకు 21కి 21 స్థానాల్లో విజయం అందించారు’ అని కార్యకర్తల సమావేశంలో పవన్ తెలిపారు.
కేరళలో 20 స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటివరకు 9 స్థానాలు గెలిచింది. మరో 5 చోట్ల ముందంజలో ఉంది. సీపీఎం, బీజేపీ, RSP ఒక్కో స్థానంలో గెలిచి, ఒక్కో స్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి. IUML పార్టీ రెండు చోట్ల, KEC ఒక చోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
INC గెలిచిన స్థానాలు: ఎర్నాకులం, ఇడుక్కి, మావెలిక్కర, తిరువనంతపురం, కోజికోడ్, వయనాడ్, వదకర, చాలకుడి, అలప్పుజ
టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ భారీ మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి పాలైన లోకేశ్.. ఈసారి అదే స్థానం నుంచి 91వేల ఓట్లకు పైగా మెజారిటీతో జయకేతనం ఎగరేశారు.
ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ప్రధాని మోదీ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఆయన వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ‘మేము బీజేపీ వెన్ను విరిచి రాజకీయ రివేంజ్ తీర్చుకున్నాం’ అని ఆమె అన్నారు. పార్టీకి తక్కువ సీట్లు రావడంతో టీడీపీ, జేడీయూ మద్దతు తీసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోందని మమత తెలిపారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 2019 ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని TDP.. ఈ ఎన్నికల్లో మొత్తం 9 స్థానాల్లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, కురుపాం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపు కోట, విజయనగరంలో TDP అభ్యర్థులు గెలుపొందగా.. నెల్లిమర్లలో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. గత ఎన్నికల్లో జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన YCP ఈ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం గమనార్హం.
బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటేలా లేదు. దీంతో ఎన్డీయేకి TDP, JDU ‘హ్యాండ్’ ఇస్తే పరిస్థితి ఏంటని నెట్టింట చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఈ కూటమి 294 సీట్లలో గెలుపు/ముందంజలో ఉంది. టీడీపీకి 16, జేడీయూకి 12 ఉన్నాయి. ఈ 28 తీసేస్తే మిగిలినవి 266. ప్రభుత్వ ఏర్పాటుకు 272 కావాలి. అంటే NDAకు మరో 6 అవసరం. బీజేపీ వద్ద 243 ఉన్నాయి. అనూహ్య పరిస్థితులు ఎదురైతే చిన్నపార్టీలు, ఇతరుల సాయంతో ప్రభుత్వం నడపొచ్చు.
AP: వైసీపీ ఘోర ఓటమితో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీటీడీ ఈవోకు ఆయన రాజీనామా లేఖ రాశారు. వెంటనే తన రిజైన్ ఆమోదించాలని కోరారు. తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కుమారుడు భూమన అభినయ్ ఓటమి దిశగా సాగుతున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీలోని మైన్‌పురి స్థానంలో పోటీ చేసిన ఆమె 2,21,639 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు నార్త్ గోవాలో బీజేపీ అభ్యర్థి శ్రీపాద్ నాయక్ వరుసగా ఆరోసారి విక్టరీ అందుకున్నారు. సౌత్ గోవాలో కాంగ్రెస్ అభ్యర్థి విరియాటో ఫెర్నాండెజ్ విజయం సాధించారు.
AP: ఐదేళ్లుగా అమరావతి రాజధాని నిరసనలతో అట్టుడికిన తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ సునాయాసంగా గెలిచింది. టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ 39,044 ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. మొత్తం ఆయనకు 1,08,346 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ నుంచి ఇక్కడ పోటీ చేసిన మాజీ మంత్రి మేకతోటి సుచరితకు 69,302 ఓట్లు నమోదయ్యాయి.
ఝార్ఖండ్ గాంధే అసెంబ్లీ ఉపఎన్నికలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్‌పై ఆమె 1,148 ఓట్ల తేడాతో గెలుపొందారు. కల్పనకు 16,203 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్థికి 15,055 ఓట్లు వచ్చాయి. నోటాకు 743 ఓట్లు రావడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.