News April 21, 2024

మహబూబ్ నగర్‌: ముక్కోణపు పోరులో గెలిచేదెవరు?

image

TG: మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానంలో ఈసారి ముక్కోణపు పోరు జరగనుంది. చల్లా వంశీధర్ రెడ్డి(INC), డీకే అరుణ(BJP), మన్నె శ్రీనివాస్ రెడ్డి(BRS) పోటీ చేస్తున్నారు. ముగ్గురూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం, పార్టీలు బలంగా ఉండటంతో పోరు రసవత్తరంగా ఉండనుంది. ఇక్కడ కాంగ్రెస్ 10 సార్లు, జనతా పార్టీ, జనతా దళ్, బీజేపీ ఒక్కోసారి గెలవగా, 2009, 14, 19 ఎన్నికల్లో వరుసగా BRS సత్తా చాటింది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 21, 2024

భారత ఆర్థిక క్రమశిక్షణ సూపర్: IMF

image

ఎన్నికల ఏడాదిలోనూ భారత్ మంచి ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తోందని IMF ప్రశంసించింది. 6.8% వృద్ధి రేటును నమోదు చేయడం గొప్ప అంశమని ఆ సంస్థ ఆసియా, పసిఫిక్ విభాగం డైరెక్టర్ కృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ‘ఎన్నికల టైంలో ప్రభుత్వాలు జనాకర్షక పథకాలను ప్రకటిస్తాయి. కానీ భారత్ ద్రవ్య క్రమశిక్షణను పాటించింది. విదేశీ మారక నిల్వలు గరిష్ఠ స్థాయి 648.522 బి.డాలర్లకు చేరడమే దీనికి ఉదాహరణ’ అని పేర్కొన్నారు.

News April 21, 2024

మణిపూర్‌లో 11 చోట్ల రీపోలింగ్

image

మణిపూర్‌లోని 11 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నిన్న లోక్‌సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సందర్భంగా ఖురై, క్షేత్రీగావ్‌తో పాటు మరో 3 అసెంబ్లీ సెగ్మెంట్‌లలో పోలింగ్ కేంద్రాల వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కారణంగానే ఈ నెల 22న ఆయా కేంద్రాల్లో తిరిగి ఓటింగ్ ను నిర్వహించాలని ఈసీ ఆదేశించినట్లు తెలుస్తోంది.

News April 21, 2024

One Word Substitution- Person/People

image

☛ One who often talks of his achievements::- Egotist
☛ Someone who leaves one country to settle in another::- Emigrant
☛ A man who is womanish in his habits::- Effeminate
☛ One who runs away from justice::- Fugitive
☛ One who is filled with excessive enthusiasm in religious matters::- Fanatic
☛ One who believes in fate::- Fatalist

News April 21, 2024

బ్లూవేల్ ఛాలెంజ్‌కు USలో ఇండియన్ బలి?

image

ఆత్మహత్యలను ప్రోత్సహిస్తూ కొన్నేళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన ‘బ్లూవేల్’ గేమ్ మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికాలో ఇటీవల ఓ భారత విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. దీనికి బ్లూవేల్ ఛాలెంజే కారణమని అక్కడి పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ విద్యార్థి రెండు నిమిషాలపాటు ఊపిరి బిగపట్టినట్లు సమాచారం. ఈ కేసుపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

News April 21, 2024

బ్లూవేల్ ఛాలెంజ్ అంటే ఏమిటి?

image

ఇది ఒక ఆన్‌లైన్ గేమ్. మొదటగా రష్యాలో మొదలైంది. ఈ గేమ్‌లో 50 రోజులపాటు 50 రకాల ఛాలెంజ్‌లు పూర్తి చేయాలనే టార్గెట్ ఉంటుంది. అర్ధరాత్రి లేవడం, భయానక వీడియోలు చూడటంతోపాటు పలు రకాల సాహసాలను లైవ్‌లో ప్రదర్శించాలి. చివరికి తీవ్రత పెంచి ఆత్మహత్య చేసుకోవాలనే టాస్క్ కూడా ఉండొచ్చు. 2015లో ఓ టీనేజర్ సూసైడ్ తర్వాత పలు దేశాలు ఈ గేమ్ నెట్‌వర్క్‌ను క్లోజ్ చేశాయి. ఇప్పుడు మరోసారి ఈ గేమ్ వెలుగులోకి వచ్చింది.

News April 21, 2024

వేమన నీతి పద్యం- భావం

image

నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై
వెఱ్ఱివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడు రీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: నిండుగా ఉన్న నదులు నిదానంగా, గంభీరంగా ప్రవహిస్తాయి. చిన్న వాగులు అతి వేగంగా గట్లుదాటి పొర్లి ప్రవహిస్తాయి. అలాగే యోగ్యుడు, మంచివాడు నిదానంగా, గంభీరంగా మాట్లాడతాడు. నీచుడు మాత్రం అధికంగా మాట్లాడతాడు.

News April 21, 2024

24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర

image

TG: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 24 నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. ఆ రోజున మిర్యాలగూడలో రోడ్‌షో నిర్వహిస్తారు. 17 రోజులపాటు యాత్ర కొనసాగనుంది. మే 10న సిద్దిపేటలో ప్రచారానికి ముగింపు పలకనున్నారు.

News April 21, 2024

ఏప్రిల్ 21: చరిత్రలో ఈరోజు

image

1910: ప్రముఖ అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ మరణం
1938: ప్రముఖ ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ మరణం
1939: తెలుగు రంగస్థల నటుడు భాను ప్రకాశ్ జననం
2000: బాలీవుడ్ నటి నిగర్ సుల్తానా మరణం
2013: గణిత శాస్త్రవేత్త శకుంతలా దేవి మరణం
2022: రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకరరావు మరణం
నేడు జాతీయ పౌర సేవల దినోత్సవం

News April 21, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.