News January 26, 2025

ఇవాళ వైన్స్, మాంసం దుకాణాలు బంద్

image

రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వైన్ షాపులు, బార్లు, మాంసం దుకాణాలు తెరుచుకోవు. ఇవాళ జంతువులను వధించరాదని, అన్ని చికెన్, మటన్, చేపల మార్కెట్లు మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా బెల్టు షాపుల్లో మద్యం విక్రయించే అవకాశం ఉండటంతో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

News January 26, 2025

నేడు నాలుగు పథకాలు ప్రారంభం

image

TG: రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 4 కొత్త పథకాలను ప్రారంభించనుంది. రైతుభరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను తొలుత 621 గ్రామాల్లోనే అమలు చేయనుంది. FEB నుంచి MAR వరకు అర్హులందరికీ లబ్ధి చేకూర్చనుంది. నారాయణపేట జిల్లా చంద్రవంచలో జరిగే పథకాల పండుగలో CM రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే ఇవాళ ఆదివారం కావడంతో లబ్ధిదారుల అకౌంట్లలో నగదు రేపు జమ కానుంది.

News January 26, 2025

విజయ ‘తిలకం’ దిద్దాడు

image

దాదాపు చేజారిందనుకున్న మ్యాచ్‌లో నిన్న ఇంగ్లండ్‌పై తెలుగు కుర్రాడు తిలక్ వర్మ <<15261334>>అదరగొట్టారు<<>>. మిగతావారు ఔట్ అవుతున్నా ఎక్కడా ఒత్తిడికి లోను కాలేదు. తప్పుడు షాట్లు ఆడలేదు. ఈక్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తయినా సెలబ్రేషన్ చేసుకోలేదు. ఎందుకంటే అతడి దృష్టంతా మ్యాచ్ గెలిపించడంపైనే. చివరికి మరో 4 బంతులు ఉండగానే భారత్ నుదుటిపై విజయ తిలకం దిద్ది, అప్పుడు గాల్లోకి ఎగురుతూ సంబరాలు చేసుకున్నారు. * HATS OFF TILAK

News January 26, 2025

అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం

image

AP: అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు ACA అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. ‘అహ్మదాబాద్ స్టేడియం(1.10 లక్షల సీటింగ్)కంటే పెద్దదిగా అమరావతి స్టేడియం(1.25లక్షల సీటింగ్) ఉంటుంది. 60 ఎకరాల్లో రూ.800 కోట్ల వ్యయంతో దీనిని నిర్మిస్తాం. అమరావతిలో 200 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేస్తాం. 2027కల్లా IPLకు ఏపీ నుంచి 15 మంది ఎంపికయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు.

News January 26, 2025

కుంభమేళాలో భారత క్రికెటర్లు.. ఏఐ ఫొటోలు వైరల్

image

భారత క్రికెటర్లు కుంభమేళాను సందర్శిస్తే ఎలా ఉంటారో తెలిపేలా ఏఐ ద్వారా కొందరు ఫొటోలు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ధోనీ, రోహిత్, కోహ్లీ, హార్దిక్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ కాషాయ దుస్తుల్లో తిలకం దిద్దుకుని కనిపించారు. ఇవి క్రికెట్ ప్రియులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

News January 26, 2025

బంగ్లా ఎన్నికల నుంచి హసీనా పార్టీపై నిషేధం

image

మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని తమ దేశ ఎన్నికల నుంచి నిషేధిస్తున్నట్లు తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహ్‌ఫూజ్ ఆలం తెలిపారు. ‘బంగ్లా అనుకూల పార్టీలు మాత్రమే ఇకపై ఎన్నికల్లో పాల్గొంటాయి. బీఎన్‌పీ, జమాత్-ఈ-ఇస్లామ్ వంటి పార్టీలే బరిలో ఉంటాయి. ఇవే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. సంస్కరణలు పూర్తయ్యే వరకూ మాత్రం దేశంలో ఏ ఎన్నికా జరగదు’ అని స్పష్టం చేశారు.

News January 26, 2025

పద్మ అవార్డులు పొందిన తెలుగు నటులు వీరే

image

టాలీవుడ్ నటులకు చాలా తక్కువగా పద్మ అవార్డులు వచ్చాయి. ఇప్పటివరకు ఐదు మందినే పద్మ పురస్కారాలు వరించాయి. ఎన్టీఆర్ పద్మశ్రీ-1968, అక్కినేని నాగేశ్వరరావు పద్మశ్రీ-1968, పద్మ భూషణ్-1988, పద్మ విభూషణ్-2011, క్రిష్ణ పద్మభూషణ్-2009, చిరంజీవి పద్మభూషణ్-2006, పద్మ విభూషణ్-2024, నందమూరి బాలకృష్ణ-2025.

News January 26, 2025

కుంభమేళా.. నాగసాధువుల గురించి ఈ విషయాలు తెలుసా?

image

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వేలసంఖ్యలో నాగసాధువులు తరలివచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. నాగసాధువులు ఒంటి మీద నూలుపోగు లేకుండా హిమాలయాల్లో ధ్యానం చేస్తుంటారు. విపరీతమైన చలి, ఎండకు కూడా వీరు చలించరు. అన్ని రుతువులకు తట్టుకునేలా అగ్నిసాధన, నాడీ శోధన, మంత్రపఠనం చేసి శరీరం, మనసుపై నియంత్రణ పొందుతారు. రోజులో ఒక్కసారి మాత్రమే భోజనం తీసుకుంటారు. వీరు చనిపోయిన చోటే సమాధి చేస్తారు.

News January 26, 2025

అది షో ఆఫ్ ఎలా అవుతుంది?: ఊర్వశీ రౌతేలా

image

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి గురించి మాట్లాడే సమయంలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తన ఆభరణాల గురించి మాట్లాడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఊర్వశీ స్పందించారు. ‘సైఫ్‌పై దాడి విషయాలు నాకు అంతగా తెలియవు. నాకు తెలిసినంత వరకు చెప్పా. అదే సమయంలో నాకు బహుమతిగా వచ్చిన కానుకల గురించి చెప్పా. ఇది ఏమాత్రం షో ఆఫ్ కాదు. అదే నిజమైతే నా చేతికి ఉన్న చిన్న వాచ్‌ను కూడా చూపించేదాన్ని’ అని చెప్పారు.

News January 26, 2025

టీ20ల్లో అరుదు

image

SA టీ20లో పార్ల్ రాయల్స్ సంచలనం నమోదు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో కేవలం స్పిన్నర్లతోనే ఆ జట్టు బౌలింగ్ చేయించింది. ఈ లీగ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ 140 పరుగులు చేయగా, ప్రిటోరియా 129కే పరిమితమైంది. దీంతో PR 11 పరుగుల తేడాతో విజయం సాధించగా ప్లేఆఫ్‌కు దూసుకెళ్లింది.