News April 20, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

image

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 60,517 మంది భక్తులు దర్శించుకోగా.. 27,788 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు సమకూరింది. వీకెండ్ కావడంతో ఇవాళ, రేపు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

News April 20, 2024

లాయర్లు గౌను ధరించాల్సిన అవసరం లేదు: HC

image

కోల్‌కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో.. వేసవి ముగిసే వరకు లాయర్లు గౌను ధరించాల్సిన అవసరం లేదని పేర్కొంది. వడగాడ్పులు, ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. వేసవి ముగిసిన వెంటనే గౌను ధరించాల్సి ఉంటుంది.

News April 20, 2024

IPL: ఒకే మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లకు ఫైన్

image

IPL చరిత్రలో తొలిసారి ఒకే మ్యాచ్‌లో ఇద్దరు కెప్టెన్లకు ఫైన్ పడింది. నిన్న చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదైంది. నిర్ణీత సమయానికి బౌలింగ్ వేయకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లకు BCCI రూ.12లక్షల చొప్పున ఫైన్ విధించింది. LSG కెప్టెన్‌గా KL.రాహుల్, CSK కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో CSKపై 8 వికెట్ల తేడాతో LSG గెలిచింది.

News April 20, 2024

నేడు ఉత్తరాంధ్రలోకి జగన్ బస్సు యాత్ర

image

AP: సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. నేడు ఉత్తరాంధ్రలోకి జగన్ అడుగుపెట్టనున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి నుంచి అనకాపల్లి నియోజకవర్గం మీదుగా పెందుర్తి చేరుకోనున్నారు. సా.3.30 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభ ఉండనుంది.

News April 20, 2024

బీర్ల అమ్మకాల్లో ఆల్‌టైమ్ రికార్డు

image

TG: రోజురోజుకు ఎండలు మండిపోతుండటంతో రాష్ట్రంలో బీర్లకు డిమాండ్ పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు రూ.670 కోట్ల విలువైన 23 లక్షల కేస్‌ల బీర్లను తాగేశారు. ఇది ఆల్‌టైమ్ రికార్డు అని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గతేడాది ఇదే నెల కంటే 28.7% అధికంగా బీర్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు. కొన్ని చోట్ల బీర్ల కొరత ఉండగా, దాన్ని అధిగమించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

News April 20, 2024

తిరుమల సమాచారం

image

తిరుమలలో భక్తుల రద్దీ నిన్న సాధారణంగా ఉంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. భక్తులు 9 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 60,517 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ద్వారా రూ.3.53 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది.

News April 20, 2024

ఈసారి మా స్పందన తీవ్రస్థాయిలో ఉంటుంది: ఇరాన్

image

ఇజ్రాయెల్ మరోసారి దుస్సాహసానికి పాల్పడితే తమ స్పందన తీవ్ర స్థాయిలో ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హొసేన్ అమీరాబ్దొల్లాహియన్ ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ ఏమైనా చేస్తే వెంటనే ప్రతిస్పందిస్తామని తేల్చిచెప్పారు. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడి అనంతరం రెండింటి మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి.

News April 20, 2024

తూర్పుగోదావరిలో జనసేనాని వారాహి యాత్ర

image

AP: ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జనసేనాని వారాహి యాత్ర నిర్వహించనున్నారు. కోరుకొండ బస్టాండ్‌లో సభ ఉంటుందని కూటమి అభ్యర్థి బత్తుల రామకృష్ణ తెలిపారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ సభకు బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి హాజరుకానున్నారు. మరోవైపు పిఠాపురంలో పవన్ పర్యటించనున్నారు. టీడీపీీ నేతలతో సమావేశం కానున్నారు.

News April 20, 2024

ఒంటిమిట్ట రాములోరికి తిరుమల లడ్డూలు

image

AP: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి టీటీడీ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. నిన్న 1.20 లక్షల లడ్డూలను తిరుమల నుంచి ఒంటిమిట్టకు పంపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాముల బరువు ఉంటుంది. ఒంటిమిట్టలో ఏప్రిల్ 22న సా.6.30 గంటల నుంచి శ్రీసీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరగనుంది.

News April 20, 2024

16,024 మంది సిబ్బంది సేవలు పొడిగింపు

image

TG: వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి శుభవార్త. గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సేవలను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. డీఎంఈ పరిధిలోని పలు విభాగాల్లో సర్వీసులను ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగించింది. ఈమేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.