India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

HYD మీర్‌పేట్ <<15256609>>హత్య కేసులో<<>> పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటివరకు మిస్సింగ్‌గా ఉన్న కేసును హత్య కేసుగా మార్చారు. మాధవి భర్త గురుమూర్తిని నిందితుడిగా తేల్చారు. ఆమెను భర్త హత్య చేసినట్లు పలు ఆధారాలను సేకరించారు. వాటర్ హీటర్, బకెట్‌పై అవశేషాలను ఫోరెన్సిక్ బృందం గుర్తించింది. మాధవిని చంపి బకెట్‌లో పెట్టి వాటర్ హీటర్‌తో ఉడికించినట్లు తేల్చారు. అవశేషాలను మాధవి DNAతో ఫోరెన్సిక్ బృందం సరిపోల్చనుంది.

TG: ఇందిరమ్మ ఇళ్లకు PM ఆవాస్ యోజన పేరు పెట్టాలన్న కేంద్ర మంత్రి <<15254662>>బండి సంజయ్‌కు<<>> టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. మోదీకి, ఉక్కు మహిళ ఇందిరకు పోలిక ఏంటని ప్రశ్నించారు. పేదల ఇళ్లకు ఇందిర పేరు పెడితే తప్పేంటన్నారు. ఇందిరను అవమానించిన సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం అనడానికి దావోస్ పెట్టుబడులే నిదర్శనమని తెలిపారు.

AP: రాజకీయాలకు దూరమవుతున్నట్లు <<15252568>>విజయసాయిరెడ్డి<<>> తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేసింది. పార్టీ ఆరంభం నుంచి కష్టాల్లోనూ, విజయాల్లోనూ అండగా ఉన్నారని పేర్కొంది. రాజకీయాలు వీడి వ్యవసాయం చేయాలన్న VSR నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో ఆయనకు మరింత మంచి జరగాలని ఆకాంక్షించింది.

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించనున్నారు. కోస్గి మండలంలోని చంద్రవంచలో మధ్యాహ్నం ఒంటి గంటకు 4 కొత్త పథకాలను ఆయన ప్రారంభిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో పర్యటించి ఈ స్కీములను ప్రారంభించనున్నారు.

చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జట్టులో పలుమార్పులు చేశారు.
IND: శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్య (C), హార్దిక్, ధ్రువ్ జురెల్, సుందర్, అక్షర్, అర్ష్‌దీప్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
ENG: బట్లర్ (కెప్టెన్), సాల్ట్(కీపర్), డకెట్, బ్రూక్, లివింగ్‌స్టోన్, కార్సే, ఓవర్టన్, జె.స్మిత్, అర్చర్, రషీద్, వుడ్.

TG: తనకు మంత్రి పదవి కావాలనుకుంటే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసేవాడినని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలతో ఉన్న అనుబంధంతోనే అక్కడ పోటీ చేశానని పేర్కొన్నారు. మునుగోడు ప్రజలు తనను గతంలో కంటే డబుల్ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. మినిస్టర్‌ను కావాలనుకుంటే ఏడాది క్రితమే అయ్యేవాడినని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో రానున్న 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు ఆదిలాబాద్, కామారెడ్డి, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో 11-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

MPలోని ఇండోర్‌లో కేసర్ పర్వత్ ఒకప్పుడు పూర్తిగా బీడు వారిన ఓ కొండ ప్రాంతం. కానీ నేడు కశ్మీరీ కుంకుమ పువ్వు మొక్కలు, నేపాలీ రుద్రాక్ష, డ్రాగన్ ఫ్రూట్స్, అవకాడో, ఖర్జూరం వంటి అనేక వృక్షాలకు నెలవు. శంకర్ లాల్ గార్గ్ కృషి ఫలితమే ఆ పచ్చదనం. 2016లో ఆ కొండను కొన్న ఆయన 40వేల చెట్లను పెంచారు. పచ్చదనం చేరికతో ఇప్పుడు 30 రకాల పక్షులు, 25 రకాల సీతాకోకచిలుకలు, పలు జంతువులు ఆక్కడ ఆశ్రయం పొందుతున్నాయి.

సైఫ్ అలీఖాన్ లవ్ జిహాదీకి పాల్పడి ముంబైలో హీరోలా తిరుగుతున్నారని BJP MLA రాజాసింగ్ అన్నారు. ఆయన మొదటి భార్య అమృతా సింగ్, రెండో భార్య కరీనా కపూర్ ఇద్దరూ హిందువులేనని పేర్కొన్నారు. ‘ఖాన్ మన కూతుళ్లను ట్రాప్ చేస్తున్నారు’ అని ఆరోపించారు. ఆయనపై దాడి చేసింది హిందువు అని ఓ NCP లీడర్ అన్నారని, కానీ బంగ్లాదేశ్ ముస్లిం దాడి చేసినట్లు తేలిందని గుర్తు చేశారు. దీనిపై ఎవరేం మాట్లాడరేంటి అని ప్రశ్నించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే స్టేషన్ అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్‌గా పేర్కొనే దాన్ని 1913లో పూర్తి చేశారు. భూగర్భంలో రెండు అంతస్థుల్లో 44 ఫ్లాట్‌ఫామ్‌లు, 67 ట్రాక్స్ ఆ స్టేషన్లో ఏర్పాటు చేశారు. రోజూ 1.50 లక్షలమంది ప్రయాణికులు, 660 మెట్రో రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి. న్యూయార్క్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అదీ ఒకటి. పలు హాలీవుడ్ సినిమాల్ని అక్కడ తీయడం విశేషం.
Sorry, no posts matched your criteria.