News April 19, 2024

IPL: అత్యధిక పరుగులు, వికెట్లు ఎవరివంటే…

image

ఈ సీజన్‌ ఐపీఎల్‌‌లో బ్యాటర్లలో ఆర్సీబీ క్రికెటర్ కోహ్లీ 361 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్నారు. RR ఆటగాడు పరాగ్ 2వ స్థానంలో(318), ముంబై స్టార్ రోహిత్ మూడో ప్లేస్(297)లో ఉన్నారు. SRH స్టార్ క్లాసెన్ 7వ స్థానంలో(253) కొనసాగుతున్నారు. బౌలింగ్‌లో బుమ్రా 13 వికెట్లతో టాప్ ప్లేస్‌లో, చాహల్(12) రెండో స్థానంలో, ముంబై బౌలర్ కొయెట్జీ(12) 3వ స్థానంలో ఉన్నారు. SRH కెప్టెన్ కమిన్స్ 9 వికెట్లతో 9వస్థానంలో ఉన్నారు.

News April 19, 2024

UAEలోని భారత ఎంబసీ కీలక సూచనలు

image

యూఏఈలోని భారత ఎంబసీ భారత ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది. దుబాయ్‌కు వచ్చేవారు లేదా దుబాయ్‌ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు అత్యవసరం కాని పక్షంలో ప్రయాణాల్ని రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. అక్కడ వరదలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి చక్కబడే వరకు తమ సూచనల్ని అనుసరించాలని తెలిపింది. అవసరమైనవారికి సహాయం కోసం దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

News April 19, 2024

డాక్టర్ Vs డాక్టరేట్.. పూతల’పట్టు’ ఎవరిదో!

image

చిత్తూరు(D)లోని SC రిజర్వుడు స్థానం పూతలపట్టు. 2008లో సెగ్మెంట్ ఏర్పడగా.. 2009లో కాంగ్రెస్, 2014, 19లో YCP గెలుపొందాయి. ఇక్కడ మాజీ MLA, వైద్యుడు సునీల్ కుమార్‌ను YCP పోటీకి దించింది. 2009 నుంచి TDP తరఫున 3సార్లు పోటీ చేసి లలిత కుమారి ఓడిపోగా.. ఈసారి డా.మురళీ మోహన్‌‌(TDP) బరిలో ఉన్నారు. YCP టికెట్ దక్కని సిట్టింగ్ MLA బాబు కాంగ్రెస్‌లో చేరి పోటీలో నిలిచారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 19, 2024

డబ్బుల కోసమే లైంగిక ఆరోపణలు: నటుడి భార్య

image

నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ తన భర్త అని చెప్పుకుంటున్న <<13064583>>అపర్ణ<<>> ఠాకూర్ అనే మహిళపై ఎంపీ భార్య ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె రవికిషన్ నుంచి రూ.20 కోట్లు దోపిడీ చేసేందుకు యత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు రేప్ కేసుతో తన భర్తను బెదిరిస్తోందని తెలిపారు. ఆమె ఫిర్యాదుతో అపర్ణ, ఆమె కూతురు షెనోవా, కుమారుడు సోనక్, భర్త రాజేశ్‌పై కేసు నమోదైంది.

News April 19, 2024

ఫోన్ వేడెక్కుతోందా?

image

వేసవిలో ఫోన్ హీటింగ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఈ టిప్స్ పాటిస్తే హీట్ కాకుండా ఉంటుంది.
1.ఛార్జింగ్ పెట్టే ముందు ఫోన్ కేస్ తీసేయండి.
2.ఛార్జ్ అవుతున్నప్పుడు ఫోన్ వాడకండి.
3.బ్యాటరీ 20% ఉన్నప్పుడే ఛార్జింగ్ చేయండి. అలాగే 100% ఛార్జ్ చేయకండి.
4.మీ ఫోన్‌తో వచ్చిన బ్రాండెడ్ కేబుల్ మాత్రమే వాడండి.
5.ఫోన్ వేడిగా అనిపిస్తే ఆ టైంలో ఛార్జ్ చేయకండి.

News April 19, 2024

కారు షెడ్డులోనే.. ఇక ఇంటికి రాదు: రేవంత్

image

TG: కారు షెడ్డుకు పోయిందని.. ఇక ఇంటికి రాదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘పాడైపోయిన కారును తుక్కుగా అమ్మాల్సిందే. ఇక అది ఎందుకూ పనికిరాదు. కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. అయినా పాలమూరులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే. గత పదేళ్లలో పాలమూరు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. మహబూబ్‌నగర్‌లోని 2 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపించాలి’ అని ఆయన కోరారు.

News April 19, 2024

కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

ఢిల్లీ CM కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. రోజూ 15min పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డాక్టర్‌ను సంప్రదించేందుకు అనుమతివ్వాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. తనకు ఇన్సులిన్‌ను అందించాలని జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై వాదనలు విన్న కోర్టు ఈనెల 22న తీర్పును వెల్లడిస్తామని తెలిపింది. జైలు అధికారులు, ఈడీ దీనిపై రేపటిలోగా స్పందించాలని ఆదేశించింది.

News April 19, 2024

రిజర్వేషన్లను మార్చం.. మార్చనివ్వం: అమిత్ షా

image

కుల ఆధారిత రిజర్వేషన్లను BJP ఎప్పటికీ మార్చదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. మార్చేందుకు మరెవరికీ కూడా అవకాశం ఇవ్వబోమని అన్నారు. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే యోచనలో BJP ఉన్నట్లు వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు. 2014, 19లో మెజార్టీ ఉన్నా తాము ఆ ఆలోచన చేయలేదన్నారు. కాగా గుజరాత్‌లోని గాంధీనగర్ MPగా ఉన్న ఆయన మరోసారి అదే స్థానం నుంచి ఇవాళ నామినేషన్ వేశారు.

News April 19, 2024

IPL: పొరుగింటి పుల్లకూర రుచి!

image

పంజాబ్ జట్టును చూస్తే పొరుగింటి పుల్లకూర రుచి సామెత గుర్తొస్తుందంటున్నారు క్రీడాభిమానులు. ఇంగ్లండ్ ప్లేయర్లు బెయిర్‌స్టో, కరన్, లివింగ్‌స్టోన్ కోసం ఆ టీమ్ రూ.36.75 కోట్లు ఖర్చు చేసింది. కానీ వారి నుంచి 333 రన్స్ మాత్రమే వచ్చాయి. కేవలం రూ.40 లక్షలు పెట్టి కొన్న దేశీయ బ్యాటర్లు శశాంక్, అశుతోష్ 343 రన్స్ చేశారు. విదేశీయులపై రూ.కోట్లు వెదజల్లే బదులు ఇలాంటి ఆణిముత్యాలను గుర్తించాలంటున్నారు నెటిజన్లు.

News April 19, 2024

సీరియల్ నటి దివ్యాంకకు యాక్సిడెంట్

image

పాపులర్ టీవీ సీరియల్ నటి దివ్యాంకా త్రిపాఠీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో ఆమె చేతి ఎముకలు విరిగాయి. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని ఆమె భర్త వివేక్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘దివ్యాంకకు రెండు ఎముకలు విరిగాయి. వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు’ అని తెలిపారు. దివ్యాంక త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు.