News April 19, 2024

బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా

image

TG: BRSకు వైరా మాజీ MLA లావుడ్యా రాములు నాయక్ రాజీనామా చేశారు. ‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు. నాకు టికెట్ ఇవ్వకుండా నాపై ఓడిపోయిన వ్యక్తికి సీటు ఇచ్చి అధిష్ఠానం నన్ను అవమానించింది. మళ్లీ ఓడిపోయిన వ్యక్తికే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అందుకే BRSకు రాజీనామా చేస్తున్నా’ అని ఆయన పార్టీ చీఫ్ కేసీఆర్‌కు లేఖ రాశారు.

News April 19, 2024

మరదలిపై బావ పోటీ!

image

AP: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక్కడ YCP నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఆమెపై నారాయణ చెల్లెలి కుమారుడు రమేశ్ కాంగ్రెస్ నుంచి పోటీకి దిగారు. 2019లో నారాయణ విజయం కోసం పని చేసిన రమేశ్.. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. YCP శ్రేణుల్లో ఆయనకు పరిచయాలు బాగానే ఉండటం కాస్త ప్రభావం చూపొచ్చనే చర్చ స్థానికంగా నడుస్తోంది.

News April 19, 2024

జగన్ పాలనంతా అంకెల గారడీలు, అబద్ధాలే: ప్రత్తిపాటి

image

AP: ఐదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలేనని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ‘ప్రతి రైతు కుటుంబంపై రూ.2.45 లక్షల అప్పు ఉంది. తుఫాన్లు, వరదలు, కరవుతో నష్టపోయిన వారిలో కొందరికే పరిహారం అందింది. అంకెల గారడీలు, అబద్ధాలతో జగన్ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. వైసీపీ పాలనతో రైతుల జీవితాలు గాలిలో దీపంలా మారాయి’ అని విమర్శించారు.

News April 19, 2024

రూ. 7వేల కోట్లు ఎవరి ఖాతాలోకి పోయాయి?: భట్టి

image

TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు తాను సిద్ధమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ‘బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రజల్ని ఆందోళనకు గురిచేయడం సరికాదు. గడచిన 4 నెలల్లో మేం రూ. 26వేల కోట్ల అప్పు చెల్లించాం. మేం వచ్చేసరికి ఖజానాలో రూ.3927 కోట్లు మాత్రమే ఉన్నాయి. బీఆర్ఎస్ రూ.7 వేల కోట్లు ఉన్నాయంటోంది. మరి ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి పోయిందో వారు చెప్పాలి’ అని స్పష్టం చేశారు.

News April 19, 2024

వావ్‌.. వాట్ ఏ క్రియేటివిటీ

image

తమిళనాడుకు చెందిన జంట చెన్నై సూపర్‌కింగ్స్ థీమ్‌తో పెళ్లి పత్రిక రూపొందించింది. ఆహ్వాన పత్రికలో సీఎస్‌కే లోగోను ఉపయోగించి వారి పేర్లను ముద్రించారు. మ్యాచ్ నమూనా టికెట్‌పై పెళ్లి సమయం, రిసెప్షన్ వంటి వివరాలను పేర్కొన్నారు. క్రియేటివిటీ ఉపయోగించి మ్యాచ్ ప్రివ్యూ, మ్యాచ్ ప్రిడిక్ష‌న్ వంటి పదాలతో తమ ప్రేమను వివరించారు. ఈ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

News April 19, 2024

Elections: మిగిలిన దశల పోలింగ్ ఎప్పుడంటే..

image

సార్వత్రిక ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌ నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన ఆరు దశల్ని చూస్తే.. ఈ నెల 26న రెండో దశ, మే 7న మూడు, మే 13న నాలుగు, మే 20న ఐదు, మే 25న ఆరు, జూన్ 1న ఏడో దశ ఎలక్షన్స్‌ను ఎన్నికల సంఘం నిర్వహించనుంది. జూన్ 4న ఓట్లను లెక్కిస్తారు.

News April 19, 2024

IPLలో సరే.. వరల్డ్‌కప్‌లో ఎలా?

image

T20WC సమీపిస్తున్న వేళ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ ఫిట్‌నెస్ సమస్య టీమ్ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. గాయంతో ఇన్నాళ్లూ క్రికెట్‌కు దూరమైన అతడు పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు. అయినా SKYతో MI యాజమాన్యం మ్యాచులు ఆడిస్తోంది. ఫిట్‌నెస్ సమస్యతో అతడు ఫీల్డింగ్‌కు రాకుండా ఇంపాక్ట్ ప్లేయర్‌ రూల్‌తో బ్యాటింగ్‌ మాత్రమే చేస్తున్నారు. మరి ఇలాంటి ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సౌకర్యం లేని T20WCలో సూర్య పరిస్థితి ఏంటో?

News April 19, 2024

ఓటింగ్ శాతం @11am

image

★ అరుణాచల్‌ప్రదేశ్: 20.13%
★ అస్సాం: 27.22%
★ బిహార్: 20.42
★ ఛత్తీస్‌గఢ్: 28.12
★ మధ్యప్రదేశ్: 30.46
★ మణిపుర్: 29.61
★ రాజస్థాన్: 22.59
★ తమిళనాడు: 23.87
★ పశ్చిమబెంగాల్: 33.56

News April 19, 2024

ఓటేసిన 102 ఏళ్ల బామ్మ

image

ఓటేసేందుకు పండుటాకులు తరలివస్తున్నారు. తమిళనాడులోని దిండిగల్‌లో 102 ఏళ్ల చిన్నమ్మ ఓటు వేశారు. ఉదయాన్నే పోలింగ్ బూత్‌కు వచ్చిన ఈ బామ్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలో 92 ఏళ్ల వృద్ధురాలు, ఉధంపూర్‌లో 91 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ సుబేదార్ సుఖ్ దేవ్ సింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకుని ఓటు విలువను చాటిచెప్పారు.

News April 19, 2024

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’

image

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26 నుంచి తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ‘హిస్టరీ రిపీట్ కావడం సాధారణం. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవుతాయి. అట్లుంటది టిల్లన్నతోని’ అని ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో అనుపమ హీరోయిన్‌గా నటించారు.