News January 23, 2025

అటవీశాఖలో మార్పులపై పవన్ ఫోకస్

image

AP: అటవీశాఖలో సమూల మార్పులపై Dy.CM పవన్ దృష్టి సారించారు. అటవీ భూముల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ, ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు యాక్షన్ ప్లాన్, అటవీ ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సిబ్బంది కొరతను తీర్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎకో టూరిజం అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు.

News January 23, 2025

రేపు ఉ.10 గంటలకు..

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు ఈ నెల 24న ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అలాగే తిరుమల, తిరుపతిలో ఆ నెలకు సంబంధించిన గదుల కోటాను రేపు మ.3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక శ్రీవారి సేవ కోటా టికెట్లను ఈ నెల 27న ఉ.11 గం.కు విడుదల చేయనున్నారు. దళారులను నమ్మవద్దని <>ttdevasthanams.ap.gov.in/<<>> లోనే టికెట్లు బుక్ చేసుకోవాలని TTD సూచించింది.

News January 23, 2025

మూడో తరగతి విద్యార్థి ఫీజు రూ.2.1 లక్షలు

image

చదువును కొందరు బిజినెస్‌గా మార్చేశారని విమర్శలొస్తున్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని చెమటోడుస్తున్న తల్లిదండ్రులకు ఫీజుల రూపంలో కొన్ని స్కూళ్లు చుక్కలు చూపిస్తున్నాయని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్కూల్‌లో మూడో తరగతి ఫీజు షాక్‌కి గురిచేస్తోంది. పిల్లాడి చదువుకోసం ఏడాదికి రూ.2.1 లక్షలు చెల్లించాలా? అంటూ సీఎం సిద్ద రామయ్యను ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

News January 23, 2025

ఆస్కార్ నామినీల ప్రకటన.. లిస్ట్‌లో హిందీ మూవీ

image

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుకు నామినేషన్లు ప్రకటించారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటితో పాటు పలు విభాగాల్లో నామినీలను ప్రకటించారు. వీటిలో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియన్-అమెరికన్ చిత్రం ‘అనుజా’ చోటు దక్కించుకుంది. అవార్డు విజేతలను భారత కాలమానం ప్రకారం మార్చి 3న ప్రకటించనున్నారు.

News January 23, 2025

సరుకుతో పాటు ప్రయాణికులతో వెళ్లే రైళ్లు

image

ఇండియన్ రైల్వేలో కీలక మార్పులు జరుగుతున్నాయి. తాజాగా ఫ్రైట్ కమ్ ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. కింది అంతస్తులో సరుకు, పైన ప్రయాణికులు వెళ్లేలా డబుల్ డెక్కర్ లాంటి రైళ్లను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. రోడ్డు రవాణాతో పోటీ పడేందుకు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

News January 23, 2025

BSNL కస్టమర్లకు గుడ్ న్యూస్

image

ప్రైవేట్ టెలికం ఆపరేటర్లతో పోలిస్తే ప్రభుత్వ రంగ సంస్థ BSNL టారిఫ్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది వినియోగదారులు అందులోకి పోర్ట్ అయ్యారు. ఆఫర్లు బాగున్నా సిగ్నల్ చాలా ఇబ్బంది పెడుతోందని ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో BSNL కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65వేలకు పైగా 4G టవర్లు పని చేస్తున్నాయని పేర్కొంది. జూన్ వరకు వీటిని లక్షకు పెంచుతామని తెలిపింది.

News January 23, 2025

‘త్వరగా రావే.. టైమ్ అవుతోంది’

image

తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని పరిస్థితి ఇది. చాలా స్కూళ్లలో అవసరమైనన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో ఇలా ఒకరి తర్వాత ఒకరు టాయిలెట్ కోసం క్యూ కట్టాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ఒకటే టాయిలెట్ ఉంటోంది. ప్రభుత్వం మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. HYDలోని ఓ పాఠశాలలోని పరిస్థితి తెలియజేస్తూ ఓ జర్నలిస్టు తీసిన ఫొటో వైరలవుతోంది. దీనిపై మీ కామెంట్?

News January 23, 2025

ఈ కారణాలతోనే రిజైన్ చేస్తుంటారు: గోయెంకా

image

ఉద్యోగుల రాజీనామాలకు గల కారణాలను బిజినెస్‌మ్యాన్ హర్షా గోయెంకా తెలిపారు. రీజన్స్ ఇవేనంటూ ఓ ఫొటో షేర్ చేశారు. ‘సరైన మేనేజర్ లేకపోవడం, సమానంగా చూడకపోవడం, గుర్తింపు లేకపోవడం, తక్కువ జీతం ఇవ్వడం, విష సంస్కృతి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం, ఎదిగేందుకు తక్కువ ఆప్షన్స్ ఉండటం, ఆఫీస్‌లో జరిగే రాజకీయాలకు బలవడం, జాబ్ సెక్యూరిటీ లేకపోవడం, వర్క్ లోడ్ ఎక్కువ చేయడం వంటివి కారణాలు కావొచ్చు’ అని తెలిపారు.

News January 23, 2025

కుక్కర్‌లో బాడీ పార్ట్‌లు.. ట్విస్ట్?

image

భార్యను చంపి బాడీ పార్ట్‌లను <<15227723>>కుక్కర్‌లో ఉడికించిన కేసులో<<>> ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే గురుమూర్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా ఆయన మొబైల్‌లో ఓ మహిళ ఫొటోలు గుర్తించినట్లు సమాచారం. ఇదే విషయమై వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసుల నుంచి ఈ కేసు విషయమై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

News January 23, 2025

VIRAL: సిగరెట్ మానేసేందుకు వింత నిర్ణయం

image

తుర్కియేకు చెందిన ఇబ్రహీం యూసీల్ అనే వ్యక్తి సిగరెట్ తాగడం మానేసేందుకు వింత నిర్ణయం తీసుకున్నారు. తలకు బంతి లాంటి హెల్మెట్ ధరించి, దానికి తాళం వేసి భార్య చేతికి తాళం చెవి ఇస్తున్నారు. 2013 నుంచి ఆయన ఇలాగే హెల్మెట్‌తో దర్శనమిస్తున్నారు. గతంలో ఇబ్రహీం రోజుకు రెండు పెట్టెల సిగరెట్లు తాగేవారు. పిల్లల బర్త్‌డే రోజు మానేయడం, మళ్లీ తాగడం చేస్తుండేవారు. దీంతో ఈ హెల్మెట్ ఆలోచన చేశారు.