News January 23, 2025
VIRAL: సిగరెట్ మానేసేందుకు వింత నిర్ణయం

తుర్కియేకు చెందిన ఇబ్రహీం యూసీల్ అనే వ్యక్తి సిగరెట్ తాగడం మానేసేందుకు వింత నిర్ణయం తీసుకున్నారు. తలకు బంతి లాంటి హెల్మెట్ ధరించి, దానికి తాళం వేసి భార్య చేతికి తాళం చెవి ఇస్తున్నారు. 2013 నుంచి ఆయన ఇలాగే హెల్మెట్‌తో దర్శనమిస్తున్నారు. గతంలో ఇబ్రహీం రోజుకు రెండు పెట్టెల సిగరెట్లు తాగేవారు. పిల్లల బర్త్‌డే రోజు మానేయడం, మళ్లీ తాగడం చేస్తుండేవారు. దీంతో ఈ హెల్మెట్ ఆలోచన చేశారు.
Similar News
News February 14, 2025
ఎల్లుండి OTTలోకి కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’

కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ మూవీ ‘మ్యాక్స్’ ఈ నెల 15న ఓటీటీలోకి రానుంది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో జీ5లో అందుబాటులో ఉండనుంది. ఫిబ్రవరి 22న రిలీజ్ చేస్తామని గతంలో చెప్పిన సంస్థ వారం ముందుగానే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించి సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. అదే రోజు రాత్రి 7.30కు జీ కన్నడ ఛానల్‌లో ప్రసారం చేస్తామని పేర్కొంది. DEC 25న విడుదలై ఈ చిత్రం దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది.
News February 13, 2025
పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శనాలు

AP: తిరుమల శ్రీవారి భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పర్యాటక శాఖ ద్వారా దర్శన సౌకర్యాలను పునరుద్ధరించాలని CM చంద్రబాబు నిర్ణయించారు. గతంలో ₹300 టికెట్లను వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాలకు, RTCలకు కేటాయించేవారు. వీటిని బ్లాక్‌లో ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో TTD రద్దు చేసింది. ఇప్పుడు పూర్తిగా AP పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే దర్శనం కల్పించనుంది. విధివిధానాలపై త్వరలో క్లారిటీ రానుంది.
News February 13, 2025
ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోలేదు: విష్ణు

‘కన్నప్ప’ కోసం ఏడేళ్లుగా కష్టపడుతున్నామని, రూ.140 కోట్లతో తెరకెక్కిస్తున్నామని హీరో మంచు విష్ణు తెలిపారు. ప్రభాస్, మోహన్ లాల్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఈ చిత్రంలో నటించారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పారితోషికం గురించి నేను ‘కంప్లీట్ యాక్టర్’ వద్ద ప్రస్తావిస్తే ఆయన నవ్వుతూ ‘నువ్వు అంత పెద్దవాడివయ్యావా’ అని అన్నారన్నారు. డార్లింగ్ వల్ల తనకు స్నేహంపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు.