India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్‌లో నిన్నటి వర్షపు జల్లులు ఆగకుండా కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ముసురు ఎప్పుడు పోతుంది? వారం రోజులుగా కనిపించకుండా పోయినా సూరీడు ఎప్పుడు వస్తాడని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. మీ ప్రాంతాన్ని కూడా ముసురు అలుముకుందా? కామెంట్ చేయండి.
TG: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్ పోర్టల్‌లో త్వరలో అవకాశం కల్పిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. అయితే అంతకుముందు విధివిధానాలు, అర్హుల విషయమై మంత్రిమండలిలో చర్చించాల్సి ఉంటుందన్నారు. రేషన్ కార్డుల కోసం ప్రజావాణిలో ఇప్పటి వరకు 1,944 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయని మంత్రి తెలిపారు.
విశాఖకు చెందిన జ్యోతి తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డు. తల్లి ఆస్పత్రి, ఇళ్లల్లో పనులు చేస్తుంటారు. 1999లో జన్మించిన జ్యోతి.. 24 ఏళ్లకే 100 మీటర్ల హార్డిల్స్‌లో నేషనల్ రికార్డులను బద్దలుకొట్టారు. గతేడాది ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇప్పటివరకు 3 సార్లు నేషనల్ ఛాంపియన్‌గా నిలిచారు. వరల్డ్ ర్యాంకింగ్ కోటాలో పారిస్ ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకున్నారు.
<<-se>>#Olympics2024<<>>
TG: రాష్ట్ర బడ్జెట్ నుంచి సాగునీటి రంగంలో ఎక్కువభాగం ప్రాజెక్టుల కోసం తీసుకున్న రుణాల చెల్లింపులకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం ₹29వేల కోట్లు ఈ రంగానికి కేటాయించే అవకాశం ఉండగా అందులో ₹18వేల కోట్లు రుణాలకు, ₹9 వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణానికి ఇవ్వనున్నట్లు సమాచారం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రాజెక్టులకు నిధులిచ్చే అంశంపై ఇటీవల మంత్రి ఉత్తమ్ అధికారులతో సమీక్షించారు.
AP: సర్వీసులో ఉంటూ చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు 3 కేటగిరీల్లో పరిహారం చెల్లించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లాస్-4 ఉద్యోగులైతే ₹5లక్షలు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులైతే ₹8L, గెజిటెడ్ ఉద్యోగులైతే ₹10L ఇవ్వనుంది. ఉద్యోగి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందే అర్హత లేకపోవడం, ఆ ఫ్యామిలీలో మరెవరూ సంపాదించే వారు లేకపోతే ఈ పరిహారం అందించనున్నట్లు ఆదేశాల్లో పేర్కొంది.
ప్రపంచ నంబర్-1 టెన్నిస్ ప్లేయర్, ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత జన్నిక్ సిన్నర్ (ఇటలీ) పారిస్ ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నారు. టాన్సిల్స్ కారణంగా ఈ మెగా ఈవెంట్‌కు దూరమవుతున్నట్లు ఆయన ప్రకటించారు. తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని, ఇటలీ అథ్లెట్లకు ఇంటి నుంచే సపోర్ట్ చేస్తానని చెప్పారు.
<<-se>>#Olympics2024<<>>
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్న సినిమాపై ఆగస్టు 22న అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అదే రోజు నుంచి షూటింగ్‌ను ప్రారంభిస్తారని సినీవర్గాలు తెలిపాయి. దీనికోసం ఒక ప్రత్యేక సెట్ వేశారని పేర్కొన్నాయి. ‘స్పిరిట్’ మూవీ ఆలస్యం కానున్న నేపథ్యంలో దానికంటే ముందే రాజాసాబ్, హనుతో చేసే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని రెబల్ స్టార్ భావిస్తున్నారట.
AP: రాష్ట్ర పోలీస్ శాఖలో 20వేల సిబ్బంది కొరత ఉందని హోంమంత్రి అనిత వెల్లడించారు. ‘కోర్టుల్లో కేసుల కారణంగా కానిస్టేబుళ్ల నియామకం నిలిచిపోయింది. వివాదం పరిష్కారం కాగానే నియామకాలు చేపడతాం’ అని శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా చెప్పారు. 2024 నాటికి రాష్ట్రంలో బాలికలు, మహిళల మిస్సింగ్ కేసులు 46,538 నమోదయ్యాయని, ట్రేసవుట్ కాని కేసుల పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
బడ్జెట్‌లో బిహార్, ఏపీ తప్ప మిగిలిన రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపించిందని ఇండియా కూటమి నేతలు ఫైరవుతున్నారు. ఇదే ప్రచారాస్త్రంగా పలు రాష్ట్రాల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. త్వరలో ఎలక్షన్స్ జరిగే మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్‌తో పాటు BJP విస్తరించాలని భావిస్తున్న తమిళనాడు, కేరళ, తెలంగాణలో ఇది ప్రధాన ప్రచారంగా మారే అవకాశం ఉంది. దీనిపై LSలో చర్చించేందుకు రాహుల్ 20 మంది ఎంపీలకు బాధ్యతలు అప్పగించారు.
TG: BRS అధినేత, మాజీ CM కేసీఆర్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు అసెంబ్లీకి రానున్నారు. గాయం కారణంగా గత సమావేశాలకు గైర్హాజరయ్యారు. కాగా ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వచ్చి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పలుమార్లు చెప్పింది. అటు తమ బాస్ సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చూడాలని BRS అభిమానులూ వేచి చూస్తున్నారు. మొత్తానికి ఈరోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆసక్తికరంగా సాగనున్నాయి.
Sorry, no posts matched your criteria.