News January 22, 2025

మహా కుంభమేళాలో ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ ప్రదర్శన

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందించిన ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ సినిమాను ప్రదర్శించనున్నారు. సెక్టార్ 6లోని దివ్య ప్రేమ్ సేవా శిభిరంలో ప్రత్యేక స్క్రీన్ ఏర్పాటు చేశారు. తాజాగా విడుదలైన 4K వెర్షన్‌ను చూసేందుకు పాఠశాల పిల్లలు, భక్తులను ఆహ్వానిస్తున్నారు.

Similar News

News February 19, 2025

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోకి నకిలీ పోలీస్

image

TG: కానిస్టేబుల్‌ని అంటూ ఓ వ్యక్తి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌లోకి ప్రవేశించాడు. గోవర్ధన్ అనే అతను కానిస్టేబుల్ అని చెప్పి జ్ఞాన సాయి ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.3లక్షలు తీసుకున్నాడు. అతణ్ని నమ్మించడానికి CM సమీక్ష జరుగుతున్నప్పుడే CCCలోకి వెళ్లి వచ్చాడు. ఆపై అతను కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు CCTV ఫుటేజ్ పరిశీలించగా నిందితుడి చిత్రాలు నమోదయ్యాయి.

News February 19, 2025

మోదీని కలిసిన రిషి సునాక్ ఫ్యామిలీ

image

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ కుటుంబ సమేతంగా కలిశారు. వారి వెంట సునాక్ అత్త, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా బ్రిటన్ మాజీ ప్రధాని ఫ్యామిలీతో కలిసి భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

News February 19, 2025

ALL TIME RECORD

image

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైం రికార్డుకు చేరుకుంది. చరిత్రలో తొలిసారిగా ఇవాళ ఉదయం 7 గంటలకు 16,058 మెగావాట్ల మైలురాయిని చేరుకుంది. ఈ నెల 10న నమోదైన 15,998 మెగావాట్ల రికార్డును రాష్ట్రం అధిగమించింది. దీంతో విద్యుత్ సరఫరాపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. ఎంత పెరిగినా దానికి తగ్గట్లు సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు.

error: Content is protected !!