India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీ విషయంలో ICC యూనిఫామ్ రూల్స్‌ను పాటిస్తామని BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. హోస్ట్ నేషన్ పేరును ఇండియా జెర్సీపై ఉంచేందుకు BCCI నిరాకరించిందన్న వార్తలపై స్పందించారు. టోర్నీ ప్రారంభ వేడుక కోసం కెప్టెన్ రోహిత్ శర్మను పాకిస్థాన్‌కు పంపడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మ్యాచులు ఏ వేదికపై ఆడినా హోస్ట్ నేషన్ పేరు అన్ని దేశాల జట్ల జెర్సీలపై ఉండాలనేది ICC రూల్.

ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉన్న ట్రూకాలర్ యాప్ ఇకపై ఐవోఎస్ ఫోన్లలోనూ పనిచేయనుంది. ఇకపై ఐఫోన్‌లలో అందుబాటులో ఉండేలా ట్రూకాలర్ అప్డేట్ తీసుకొచ్చింది. దీనికోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఫోన్ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. Settings > Apps > Phone > Call Blocking & Identification ఎనేబుల్ చేయాలి. ఇది iOS 18.2 & ఆపైన వెర్షన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 8న శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన ఈ తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు.

TG: సర్పంచ్ ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. బీసీ కమిషన్ రిపోర్టు దాదాపుగా పూర్తయిందని, సీఎం రేవంత్ దావోస్ నుంచి వచ్చాక ఆ రిపోర్టును ఆమోదిస్తారని తెలిపారు. పథకాల లబ్ధిదారులను గ్రామ సభల ద్వారానే ఎంపిక చేస్తున్నామని, 96% గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు రిప్లై ఇస్తుంటారు. తాజాగా ఓ యువకుడు తన బాధను తమన్ దృష్టికి తీసుకెళ్లగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తాను ఓ రిథమ్ ప్యాడ్ ప్లేయర్ అని, అది పాడైపోయిందని చెప్పడంతో కొత్తది కొనిస్తానని హామీ ఇచ్చారు. వివరాలు చెప్పాలని కోరారు. దీంతో తమన్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. తమన్ గోల్డ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ వాడని యూజర్లకు ఖర్చు తగ్గించేందుకు కాల్స్, SMSల కోసం ప్రత్యేక ప్లాన్లు తేవాలని ట్రాయ్ చెప్తే టెలికం కంపెనీలు మాత్రం తమకు అనుకూలంగా వాడేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న ప్లాన్లలో డేటా కట్ చేసి రేట్లు అలాగే ఉంచాయి. డేటా ఉండే రూ.479 ప్యాక్ ధరను జియో రూ.60 పెంచి రూ.539గా నిర్ణయించింది. రూ.1,999 ప్లాన్ ధరను రూ.350 పెంచి రూ.2,249 చేసింది. అటు AirTel సైతం డేటా తొలగించి, ప్లాన్ రేట్లను పెంచింది.

AP: రాష్ట్రాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్‌గా మారుస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దావోస్‌లో విద్యారంగ గవర్నర్ల భేటీలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 3 AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం మధ్యంతర బడ్జెట్‌లో రూ.255 కోట్లు కేటాయించాం. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం’ అని చెప్పారు. APలో ఐటీ కార్యకలాపాలను ప్రారంభించాలని విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ను కోరారు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘డుంకీ’లో నటించిన వరుణ్ కులకర్ణి తీవ్ర కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తోటి నటుడు రోషన్ శెట్టి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. వరుణ్ వైద్య ఖర్చులను సైతం భరించలేని స్థితిలో ఉన్నాడని తెలుపుతూ ఇండస్ట్రీ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరుణ్ ‘స్కామ్ 1992’ & ‘ది ఫ్యామిలీ మ్యాన్’ (ప్రైమ్ వీడియో) వంటి సిరీస్‌లలో కనిపించారు.

TG: బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. బీఆర్ఎస్ నల్లగొండ దీక్షకు కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలలోగా సభ నిర్వహించుకోవాలని సూచించింది. కాగా ఈ నెల 21న నల్లగొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. కానీ స్థానిక పోలీసులు ఈ సభకు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

రోహిత్ శర్మ పదేళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో ఆడబోతున్నారు. రేపు J&Kతో మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ సందర్భంగా ముంబై కెప్టెన్ రహానే మాట్లాడుతూ ‘రోహిత్ ఏంటో అందరికీ తెలుసు. నేషనల్, ఇంటర్నేషనల్ ఏ మ్యాచ్ ఆడినా ఒకేలా ఉంటాడు. ఆట గురించి అతనికి బాగా తెలుసు. ఏం చేయాలో ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు. అతడిచ్చే ఇన్ పుట్స్ మాకు చాలా ముఖ్యం. రోహిత్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడనే నమ్మకముంది’ అని చెప్పారు.
Sorry, no posts matched your criteria.