India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్‌లోని స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మేకర్స్ ఇళ్లపై నిన్నటి నుంచి రైడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చిత్ర డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు దిల్ రాజు ఇల్లు, కార్యాలయంలోనూ రైడ్స్ కొనసాగుతున్నాయి.

బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన పుష్ప-2 మూవీ OTT స్ట్రీమింగ్ డేట్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నెల 29 లేదా 31న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం 3 గంటల 40 నిమిషాల నిడివితో ఉన్న రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శిస్తుండగా, OTTలోనూ ఇదే వెర్షన్‌నే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.1850 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది.

తీరప్రాంతాల పేర్లు మార్చేందుకు అధికారికంగా అంతర్జాతీయ ఒప్పందాలేమీ లేవు. ఈ వివాదాల పరిష్కారం, సయోధ్యకు ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ (IHO) ప్రయత్నిస్తుంది. ట్రంప్ కోరుకుంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోను US పత్రాల్లో గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చుకోవచ్చు. EX బ్రహ్మపుత్రను చైనాలో సాంగ్‌పో, యార్లంగ్ జంగ్‌బోగా పిలుస్తారు. తమను వేరుచేసే జలసంధిని పర్షియన్ గల్ఫ్‌గా ఇరాన్, అరేబియన్ గల్ఫ్‌గా సౌదీ పిలుస్తాయి.

దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రూ.10వేల కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు MOU కుదుర్చుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ సెంటర్ ఏర్పాటు కానుండగా, 3600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కాగా కంట్రోల్ ఎస్ సంస్థ ఇప్పటికే HYDలో తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

‘మహా కుంభమేళా’కు వెళ్లి వచ్చిన వారి అభిప్రాయాలు మీకోసం. ‘ట్రైన్‌లో వెళ్తే స్టేషన్ నుంచి బయటకు వచ్చేందుకు అరగంట పడుతుంది. టాక్సీలు దొరకవు. సిటీ అంతా ట్రాఫిక్. ఆన్‌లైన్ కంటే క్యాష్ తీసుకెళ్లండి. ఆన్‌లైన్‌లోనే టెంట్స్ బుక్ చేసుకోవచ్చు. రూ.5వేలు చెల్లిస్తే బోట్‌లో వెళ్లి స్నానం చేసి రావొచ్చు. నాగ సాధువుల ఆశీర్వాదం కోసం సగం రోజు కేటాయించండి’ అని సూచించారు. అధికారిక కాటేజీల నంబర్లను పై ఫొటోలో చూడొచ్చు.

కర్ణాటకలో జరిగిన <<15220489>>రోడ్డు ప్రమాదంలో <<>>ఏపీ వాసులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని Xలో పోస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.

HYDలో పెట్టుబడి పెట్టేందుకు మరో ప్రతిష్ఠాత్మక కంపెనీ ముందుకొచ్చింది. హైటెక్ సిటీలో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తామని HCL ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న WEFలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కొత్త టెక్ సెంటర్ ఏర్పాటుతో 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్‌తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.860 పెరిగి రూ.82,090 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.750 పెరిగి రూ.75,250కి చేరింది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ.1,04,000గా ఉంది.

సైఫ్‌పై దాడి నిందితుడు షరీఫుల్‌తో పోలీసులు సీన్ రీక్రియేషన్ చేశారు. ‘అతడు ఇంట్లోకి ప్రవేశించేముందు షూ విప్పేసి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. కారిడార్‌లో సీసీ కెమెరా లేదని, సెక్యూరిటీ గార్డులు నిద్రపోతున్నట్లు చెప్పాడు. చోరీ చేసేందుకు సైఫ్ కొడుకు రూమ్‌లోకి ప్రవేశించగా పనిమనిషి తనను చూసి కేకలు వేసిందన్నాడు’ అని పోలీసులు తెలిపారు. తర్వాత సైఫ్ అతడిని పట్టుకునేందుకు చూడగా కత్తితో దాడి చేశాడని చెప్పారు.

యాక్టర్ సైఫ్ అలీఖాన్‌పై కత్తిదాడి కేసులో మరో ట్విస్ట్. మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఆఫీసర్ పీఐ సుదర్శన్ గైక్వాడ్‌ను ఈ కేసు నుంచి తప్పించారు. ఆయన స్థానంలో అజయ్ లింగ్‌నూర్కర్‌ను నియమించారు. అధికారిని ఎందుకు మార్చారో పోలీసు పెద్దలు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో చాలా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని, పురోగతేమీ కనిపించడం లేదని కొందరు పెదవి విరుస్తున్నారు.
Sorry, no posts matched your criteria.