News January 22, 2025

సైఫ్ ఇంట్లో సెక్యూరిటీ గార్డ్స్ నిద్రపోయారు: నిందితుడు

image

సైఫ్‌పై దాడి నిందితుడు షరీఫుల్‌తో పోలీసులు సీన్‌ రీక్రియేషన్ చేశారు. ‘అతడు ఇంట్లోకి ప్రవేశించేముందు షూ విప్పేసి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. కారిడార్‌లో సీసీ కెమెరా లేదని, సెక్యూరిటీ గార్డులు నిద్రపోతున్నట్లు చెప్పాడు. చోరీ చేసేందుకు సైఫ్ కొడుకు రూమ్‌లోకి ప్రవేశించగా పనిమనిషి తనను చూసి కేకలు వేసిందన్నాడు’ అని పోలీసులు తెలిపారు. తర్వాత సైఫ్ అతడిని పట్టుకునేందుకు చూడగా కత్తితో దాడి చేశాడని చెప్పారు.

Similar News

News February 19, 2025

CT తొలి మ్యాచ్.. పాకిస్థాన్ ఓటమి

image

CT-2025 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన NZ 5 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. 321 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 47.2ఓవర్లకు 260 పరుగులు చేసి ఆలౌటైంది. బాబార్ ఆజమ్, కుష్‌దిల్ అర్ధశతకాలు చేశారు. విలియమ్, శాంట్నర్ చెరో 3 వికెట్లతో సత్తా చాటారు. 23న భారత్‌తో జరిగే మ్యాచ్‌లోనూ పాక్ ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.

News February 19, 2025

జాక్‌పాట్ కొట్టిన రేఖా గుప్తా

image

ఢిల్లీ నాలుగో మహిళా సీఎంగా షాలిమార్ బాగ్ (నార్త్ వెస్ట్) MLA రేఖా గుప్తాను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెకు ముఖ్యమంత్రి పదవి వరించడం విశేషం. రేఖ అనూహ్యంగా సీఎం అభ్యర్థి రేసులోకి వచ్చారు. పర్వేశ్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ వంటి హేమాహేమీలను కాదని హైకమాండ్ ఆమె వైపే మొగ్గు చూపింది. అలాగే దేశంలోని NDA పాలిత రాష్ట్రాల్లో ఈమె ఒక్కరే మహిళా సీఎం కావడం విశేషం.

News February 19, 2025

నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం

image

TG: నల్గొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సాగర్ డ్యామ్ కింది భాగంలో మంటలు చెలరేగాయి. దాదాపు 120 ఎకరాల్లో మంటలు ఎగసిపడుతున్నట్లు సమాచారం. నాగార్జునపేట తండా, జమ్మనకోట తండా, మూలతండా వరకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రధాన డ్యామ్‌కు కూతవేటు దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

error: Content is protected !!