India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రాష్ట్రంలో మిగిలిన ఉపాధ్యాయ పోస్టులను కూడా పదోన్నతులతో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఖాళీలకు సంబంధించి జిల్లాలు, సబ్జెక్టుల వారీగా జాబితాను రూపొందించమని డీఈవోలను విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1500 ఖాళీలు ఉన్నట్లు అంచనా. అంటే అంతమందికీ ప్రమోషన్లు వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఇటీవల 19వేల మంది టీచర్లకు సర్కార్ పదోన్నతులు కల్పించింది.
గత పదేళ్లలో బడ్జెట్‌లో మహిళలకు కేటాయించే మొత్తాన్ని కేంద్రం క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. FY14 నుంచి FY25 మధ్య కేటాయింపులు 218.8% పెరిగినట్లు ఎకనామిక్ సర్వే చెబుతోంది. మహిళల సంక్షేమం, సాధికారతకు FY14లో ₹97,134 కోట్లు కేటాయించగా ఈ ఏడాది అది ₹3.10లక్షలకు చేరింది. బేటీ బచావో, బేటీ పడావో వంటి కార్యక్రమాలు, సుకన్య సమృద్ధి వంటి పథకాలు ఆడపిల్లల వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సర్వే పేర్కొంది.
రేడియోతో భారతీయుల బంధం ఎంతో ప్రత్యేకం. 1923లో బాంబే ప్రెసిడెన్సీ రేడియో క్లబ్‌లో ప్రారంభమైన ప్రసారాలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించాయి. కొన్నాళ్లకు ఈ రేడియో ప్రతీ ఇంటి ‘ఆకాశవాణి’ అయింది. అలా రేడియో హవా కొనసాగుతున్న వేళ 1977 జులై 23న చెన్నైలో FM లాంచ్ కావడంతో మరో ముందడుగు పడింది. ఈ రేడియో ప్రసారాల సుదీర్ఘ ప్రయాణానికి గుర్తుగా కేంద్రం ఏటా జులై 23ని నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్‌డే ప్రకటించింది.
AP: రాష్ట్రానికి ఇప్పటివరకు ₹35,492 కోట్ల ఆర్థికసాయం అందించినట్లు కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు కోసం ₹15,147కోట్లు, అమరావతికి ₹2500 కోట్లు, రాయలసీమకు ₹1,750 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. గత ఐదేళ్లలో వివిధ పథకాల ద్వారా ఏపీ ₹63వేల కోట్లు లబ్ధి పొందిందని వెల్లడించింది. గరిష్ఠంగా FY23లో రాష్ట్రానికి కేంద్ర పథకాల ద్వారా ₹16,114 కోట్ల లబ్ధి చేకూరిందని నిన్న పార్లమెంటులో వివరించింది.
TG: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుండగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం తెలియజేస్తారు. అనంతరం సభ వ్యవహారాల కమిటీ భేటీలో అసెంబ్లీ నిర్వహణ, చర్చించాల్సిన అంశాలు మొదలైన వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ, ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
భారత్‌తో విదేశాల్లో టీ20 సిరీస్ నిర్వహించడంపై తాము ఎలాంటి ప్రతిపాదన చేయలేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా నిర్వహించడంపైనే ప్రస్తుతం తాము దృష్టి సారించామని తెలిపింది. ఇంగ్లండ్/ ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ నిర్వహించడంపై బీసీసీఐని సంప్రదించిందన్న వార్తలను తోసిపుచ్చింది. భారత్ పాక్‌కు వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేలా చేయడమే తమ ముఖ్య అజెండా అని పేర్కొంది.
నేడు కేంద్రం ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ల రియాక్షన్‌పై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బడ్జెట్ రోజున మార్కెట్లు నష్టాలను నమోదు చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. 2014-2024 మధ్య 13సార్లు బడ్జెట్ (తాత్కాలిక బడ్జెట్‌తో కలిపి) ప్రవేశపెట్టగా ఏడు సార్లు మార్కెట్లు డీలా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈరోజు బడ్జెట్ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందా? అనేది చర్చనీయాంశమైంది.
శివ దర్శకత్వంలో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కంగువ’. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఇందులో సూర్య తమ్ముడు కార్తీ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. వీరిద్దరి ఎపిసోడ్ సీక్వెల్‌కు దారితీస్తుందని టాక్. కాగా ఈ చిత్రంలో జగపతి బాబు, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పార్లమెంటులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. మోదీ 3.0లో ఇది తొలి బడ్జెట్ కావడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా నిర్మల బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఏడోసారి. ఈరోజు ఆమె మొరార్జీ దేశాయ్ (6) రికార్డ్ బ్రేక్ చేయనున్నారు.
1856: స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర తిలక్ జననం
1870: రచయిత రాయసం వెంకట శివుడు జననం
1906: స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జననం
1949: తెలుగు సినీ దర్శకుడు కోడి రామకృష్ణ జననం
1975: కోలీవుడ్ హీరో సూర్య జననం
>>జాతీయ ప్రసార దినోత్సవం
Sorry, no posts matched your criteria.