News January 21, 2025

హైకోర్టులో మేరుగు నాగార్జునకు ఊరట

image

AP: వైసీపీ నేత మేరుగు నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన అత్యాచారం కేసును క్వాష్ చేయాలని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా తనను లైంగికంగా వేధించడంతోపాటు, తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఓ మహిళ మేరుగు నాగార్జునపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News January 21, 2025

ఫిబ్రవరి 20లోపు పిల్లలు పుడితేనే..

image

అమెరికాలో ఇక గ్రీన్ కార్డు లేదా <<15212260>>పౌరసత్వం<<>> ఉంటేనే అక్కడ పుట్టే పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభించనుంది. ఫిబ్రవరి 20, 2025 నుంచి ఈ ఉత్తర్వులు అమలు కానున్నాయి. దీన్ని బట్టి గ్రీన్ కార్డు, పౌరసత్వం లేని వారు ఆ లోపు పిల్లలకు జన్మనిస్తేనే సిటిజన్‌షిప్ వస్తుంది. ఆ తర్వాత H1B, స్టూడెంట్ వీసా (F1), గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తున్న వారు, విజిటింగ్ వీసా ఉన్న వారు అక్కడ పిల్లలను కంటే పౌరసత్వం వర్తించదు.

News January 21, 2025

క్రికెట్ టూర్లలో ఫ్యామిలీ ఉండాల్సిందే: బట్లర్

image

క్రికెట్ టూర్లలో తమ వెంట కుటుంబం ఉండాల్సిందేనని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అభిప్రాయపడ్డారు. వారు వెంట ఉండటం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ‘ఫ్యామిలీనే మాకు తొలి ప్రాధాన్యత. వారు మా వెంట ఉంటేనే ఎంజాయ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. టూర్ల సమయంలో భార్యలు, కుటుంబసభ్యులు మాతో ఉండడంతో చాలా దృఢంగా ఉంటాం. క్రికెట్, ఫ్యామిలీని మేనేజ్ చేసే సత్తా ఇప్పటి క్రికెటర్లకు ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

News January 21, 2025

ఇన్వెస్టర్లకు ₹6లక్షల కోట్ల నష్టం.. కారణాలివే

image

బేర్స్ దెబ్బకు దేశీయ స్టాక్‌మార్కెట్లు రక్తమోడుతున్నాయి. ఆరంభం నుంచీ ఆటుపోట్లకు లోనవుతున్న బెంచ్‌మార్క్ సూచీలు ఇప్పుడు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 75,900 (-1200), నిఫ్టీ 23,039 (-310) వద్ద చలిస్తున్నాయి. దీంతో నేడు రూ.6L CR ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బ్రిక్స్ దేశాలపై ట్రంప్ 100% టారిఫ్స్ ప్రకటన, బలహీన క్యూ3 ఫలితాలు, BOJ వడ్డీరేట్ల పెంపు అంచనా, FIIs వెళ్లిపోవడమే ఇందుకు కారణాలు.

News January 21, 2025

జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత మరో ఫిర్యాదు

image

TDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి, BJP నేత మాధవీలత సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. తనను ప్రాస్టిట్యూట్ అంటూ పరుష పదజాలంతో దూషించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల జేసీపై ఆమె ‘మా’, ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాడిపత్రి జేసీ పార్కులో న్యూ ఇయర్ వేడుకలకు యువతులు వెళ్లొద్దంటూ మాధవి ఓ వీడియో విడుదల చేయగా, ఆమెపై జేసీ ఫైరయ్యారు. ఆ తర్వాత క్షమాపణ కూడా చెప్పారు.

News January 21, 2025

ఒకే చోట రూ.82 లక్షల కోట్లు

image

ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులు హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఒకే దగ్గర నిలబడ్డారు. ఈ నలుగురి నికర ఆదాయం $950 billion+గా ఉంది. అంటే అక్షరాలా రూ.82లక్షల కోట్లు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ $433 బిలియన్లతో ప్రపంచ కుబేరుడిగా ఉన్నారు.

News January 21, 2025

టీమ్ ఇండియా జెర్సీలో మహ్మద్ షమీ

image

స్టార్ పేసర్ మహ్మద్ షమీ చాన్నాళ్ల తర్వాత టీమ్ ఇండియా జెర్సీ ధరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు షమీ ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ అంతర్జాతీయ మ్యాచులకు దూరమయ్యారు. కాలి గాయంతో బాధపడుతూ ఆయన దాదాపు ఏడాదిన్నరపాటు జట్టుకు దూరంగా ఉన్నారు.

News January 21, 2025

కాంగ్రెస్ ‘జైబాపూ’ ఈవెంట్లో ఫ్రీడమ్ ఫైటర్స్‌కు అవమానం

image

కర్ణాటక బెలగావిలో ఫ్రీడమ్ ఫైటర్స్‌కు ఘోర అవమానం జరిగింది. గౌరవిస్తామని జై బాపూ ఈవెంట్‌కు కాంగ్రెస్ వారిని ఆహ్వానించింది. తీరా వచ్చాక వారినెవరూ కన్నెత్తి చూడలేదు. ఐడీ కార్డులు ఇవ్వకపోవడంతో పోలీసులు లోపలికి రానివ్వలేదు. దాంతో 92 ఏళ్ల ఆ వృద్ధులు బాంక్వెట్ హాల్ మెట్లమీదే పడిగాపులు పడ్డారు. నీళ్లు, ఆహారం లేక అలమటించారు. రానంటున్నా పిలిచి అవమానించారని ఆవేదన చెందారు. మీడియా కలగజేసుకొని వారికి సాయపడింది.

News January 21, 2025

సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్

image

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముంబై లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాసేపటి క్రితం ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. జనవరి 16న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దుండగుడు కత్తితో దాడి చేశాడు.

News January 21, 2025

PHOTOS: ఫ్యామిలీతో అల్లు అర్జున్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో దిగిన కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భార్య స్నేహా రెడ్డితో పాటు కొడుకు అయాన్, కూతురు అర్హ వైట్ టీషర్టు ధరించి కెమెరాలకు పోజులిచ్చారు. మొన్నటి వరకు ‘పుష్ప-2’ సినిమా కోసం హెయిర్, బియర్డ్ పెంచిన బన్నీ.. తాజాగా తన లుక్‌ను మార్చేసిన విషయం తెలిసిందే. కాగా, మార్చి నెల నుంచి త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో సినిమా ప్రారంభం కానుంది.