India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ITR ఫైల్ చేసేందుకు గడువు ఈనెల 31తో ముగియనుంది. నిబంధనల ప్రకారం డిసెంబర్ 31 వరకూ ITR ఫైల్ చేసుకునే అవకాశం ఉన్నా ఉచితంగా చేసుకునేందుకు మాత్రం ఈనెల వరకే గడువుంది. వార్షిక ఆదాయం రూ.5లక్షల కంటే ఎక్కువున్న వారు ఆ తర్వాత చేస్తే రూ.5వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సర ఆదాయం రూ.5లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్నవారు రూ.వెయ్యి ఫైన్‌గా కట్టాలి. అలాగే పన్ను మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
AP: మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్నిప్రమాద <<13680493>>ఘటన<<>> వివరాలపై CM చంద్రబాబు ఆరా తీశారు. ఆదివారం రాత్రి 11.24కి ఘటన జరిగిందని, ఓ ఉద్యోగి రాత్రి 10:30 వరకు ఆఫీసులో ఉన్నారని అధికారులు తెలిపారు. CCTV కెమెరాలు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశించారు. అసైన్డ్ భూముల దస్త్రాలు దగ్ధమైనట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో సాక్ష్యాల చెరిపివేత కోణంలో లోతుగా విచారణ చేయాలని సూచించారు.
నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్‌లో వాడీవేడీ చర్చ జరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడ్డ ఈ వ్యవహారంపై కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతోందని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అయితే నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చిందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. నీట్ లీకేజీపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని సమాధానం ఇచ్చారు.
TG: మట్టి బోనమైనా, బంగారు బోనమైనా.. ఎవరు తీసుకొచ్చినా తాను సంతోషంగా స్వీకరిస్తానని సికింద్రాబాద్ ‘భవిష్యవాణి’లో స్వర్ణలత తెలిపారు. ‘ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. ప్రజలకు వ్యాధులు రాకుండా కాపాడతాను. కానీ పంటలు గతంలో లాగా పండించడం లేదు. రసాయనాలు ఎక్కువ వాడటం వల్లే వ్యాధులు వస్తున్నాయి. వాటిని తగ్గించుకుంటే వ్యాధులు తగ్గుతాయి’ అని వివరించారు.
AP: ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వైసీపీ అధినేత జగన్‌ను పలకరించడం అసెంబ్లీలో ఆసక్తికరంగా మారింది. మాజీ సీఎం వద్దకు వెళ్లిన రఘురామ ఆయనను పలకరించారు. కొన్ని నిమిషాల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. దీంతో వారి మధ్య ఏం చర్చ నడిచి ఉంటుందోనన్న కుతూహలం అందరిలోనూ నెలకొంది. సీఐడీ కస్టడీలో తనను చంపబోయారంటూ జగన్‌పై రఘురామ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.
ఫిట్‌నెస్ కోల్పోకుండా ఉంటే 2027 వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడతారని కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ వెల్లడించారు. గిల్‌ను మూడు ఫార్మాట్లలోనూ ఆడిస్తామని, సూర్య కుమార్ టీ20లు మాత్రమే ఆడతారని చెప్పారు. గాయంతో జట్టుకు దూరమైన షమీ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉందన్నారు. యువ క్రికెటర్లు నిలకడ చూపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కాసేపట్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన బీఏసీ భేటీ జరగనుంది. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? అనే విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
AP: విభజన చట్టం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తగినంత పరిహారం అందలేదని అసెంబ్లీలో ప్రసంగంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ‘ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలున్నాయి. రాజధాని హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగింది. భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చింది. ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యాసంస్థలను విభజించారు. ఫలితంగా ఉన్నత విద్యాసంస్థల కోల్పోయాం’ అని గవర్నర్ వెల్లడించారు.
ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్లేయర్‌కే కెప్టెన్సీ ఇవ్వాలని నిర్ణయించినట్లు టీమ్‌ఇండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. అందుకే సూర్య కుమార్‌కు టీ20 కెప్టెన్సీ ఇచ్చినట్లు తెలిపారు. హార్దిక్ పాండ్య జట్టులో కీలక ప్లేయర్ అని, కానీ అతనికి ఫిట్‌నెస్ ఛాలెంజింగ్‌గా మారిందని పేర్కొన్నారు. సూర్యకు కెప్టెన్ అయ్యేందుకు అన్ని లక్షణాలు, అర్హతలు ఉన్నాయని అన్నారు.
AP: విభజన వల్ల రాష్ట్రానికి నష్టం ఏర్పడిందని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ‘చంద్రబాబు విజనరీ నాయకుడు. 2014-2019 మధ్య రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగింది. ఆ తర్వాత YCP అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి. పెట్టుబడులు పక్కదారి పట్టాయి. రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లింది’ అని వివరించారు.
Sorry, no posts matched your criteria.