India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత జట్టు తమ దేశానికి రాకపోతే వాళ్లు లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ అన్నారు. వారు ఆడకపోతే క్రికెటేమీ అంతం కాదన్నారు. ‘ఇప్పటికే ఇండియా లేకుండా మేం ఆడేందుకు సిద్ధమయ్యాం. మేము భారత్ వెళ్లి ఆడినప్పుడు.. వారు కూడా పాక్ రావాలి. చాలా మంది భారత ఆటగాళ్లు పాక్‌లో ఆడాలని అనుకుంటున్నారు. కానీ ఆ దేశ విధివిధానాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వరద ప్రవాహ సమయంలో వాగులు, వంకలు, కాలువలు దాటొద్దని సూచించింది. పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలంది.
డైరెక్టర్ హరీశ్ శంకర్ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తుంటారనే పేరుంది. ప్రస్తుతం ఆయన రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ చేస్తున్నారు. దీనిపై ఓ నెటిజన్ కామెంట్‌కు హరీశ్ స్పందించారు. ‘సర్ ఇదే మీకు లాస్ట్ రీమేక్ కావాలని ఆశిస్తున్నా. మీలో మంచి రచయిత ఉన్నారు. సొంత కథలతో మ్యాజిక్ చేయగలరు’ అని సదరు నెటిజన్ రాసుకొచ్చాడు. ‘ఈ మూవీ చూశాక రీమేక్ అని ఫీలైతే అప్పుడు మాట్లాడుకుందాం’ అంటూ డైరెక్టర్ సమాధానమిచ్చారు.
టీమ్‌ఇండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌ను నియమించేందుకు BCCI అంగీకరించినట్లు సమాచారం. శ్రీలంక సిరీస్ తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. బౌలింగ్ కోచ్ కోసం వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను హెడ్ కోచ్ గంభీర్ BCCIకి సూచించారు. 2014 IPL సీజన్‌లో గంభీర్ KKR కెప్టెన్ కాగా మార్కెల్ జట్టులో ఉన్నారు. గంభీర్ లక్నోకి మెంటార్‌గా ఉన్నప్పుడు ఆయన బౌలింగ్ కోచ్‌గా ఉన్నారు.
AP: గురు పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఇవాళ స్వామి వారికి గరుడసేవ వైభవంగా నిర్వహించారు. గరుడపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ శ్రీమలయప్పస్వామి భక్తులను కటాక్షించారు. కాగా ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తోంది.
బంగ్లాదేశ్ నుంచి వచ్చే ప్రజలకు తమ రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తామన్న ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. ‘ఈ విషయాలను కేంద్రం చూసుకుంటుంది. రాష్ట్రప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. మీ వ్యాఖ్యలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయి’ అని స్పష్టం చేసింది. బంగ్లాలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడి పౌరులకు ఆశ్రయం కల్పించేందుకు బెంగాల్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మమత వ్యాఖ్యానించారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అసెంబ్లీలో మధ్యాహ్నం 2.30 గంటలకు టీడీఎల్పీ భేటీ కానుంది. శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
*100- సచిన్
*80- కోహ్లీ
*71- పాంటింగ్
*63- సంగక్కర
*62- జాక్ కల్లిస్
*55- హషీమ్ ఆమ్లా
*54- మహేల జయవర్ధనే
*53- బ్రియాన్ లారా
*49- డేవిడ్ వార్నర్
*48- రూట్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్
*47- ఏబీ డివిలియర్స్
*45- కేన్ విలియమ్సన్
TG: ఉత్తర తెలంగాణలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వాన పడుతోంది. హైదరాబాద్ నగరంలోనూ వర్షం కురుస్తోంది. సిటీలో రాబోయే 4 గంటలు వాన కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు భద్రాద్రి గుండాల ఏజెన్సీలో వర్షం దంచికొడుతోంది.
పొరుగు దేశం బంగ్లాదేశ్ నుంచి ఎవరొచ్చినా తమ రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. శరణార్థులను మానవతాదృక్పథంతో చేరదీయాలంటూ ఐక్యరాజ్యసమితి చెప్పిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అందుకే బంగ్లా నుంచి వచ్చే ప్రజలకు రాష్ట్ర ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు. అలాగే బంగ్లా నుంచి బెంగాల్ వచ్చి తిరిగి ఆ దేశం వెళ్లలేకపోతున్నవారికి కూడా సాయం చేస్తామని ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.