News July 21, 2024

ASSEMBLY: జగన్‌కు ముందు వరుసలో సీటు లేనట్లేనా?

image

AP: అసెంబ్లీలో ఇంకా సీట్ల కేటాయింపు జరగకపోవడంతో మాజీ సీఎం జగన్‌కు ముందు వరుసలో సీటు దక్కడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సాధారణ సభ్యుడిగానే ఆయన ఎక్కడో ఓ చోట కూర్చోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ 11 సీట్లే రావడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని అధికారపక్షం తేల్చి చెబుతోంది. కాగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

News July 21, 2024

వారితో డేటింగ్.. నన్ను చీటర్ అన్నారు: బాలీవుడ్ హీరో

image

తాను గతంలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్‌తో డేటింగ్ చేసినట్లు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ఓ పాడ్ కాస్ట్‌లో చెప్పారు. చివరకు తనను వారు చీటర్స్ అన్నారని తెలిపారు. తన జీవితంలో చాలా భాగం మోసగాడు అనే లేబుల్‌తోనే జీవించానని పేర్కొన్నారు. ఇప్పటికీ కొందరు ఆ ట్యాగ్‌ను వాడుతారన్నారు. 2022లో రణ్‌బీర్ ఆలియాను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు రాహ అనే కుమార్తె ఉన్నారు.

News July 21, 2024

భారత్ భారీ స్కోర్

image

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తొలిసారిగా 200కుపైగా పరుగులు చేసింది. యూఏఈతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఈ ఫీట్ సాధించింది. గతంలో ఇంగ్లండ్‌పై సాధించిన 198/4 అత్యధిక స్కోరు. ఇప్పుడా రికార్డును అధిగమించింది. హర్మన్ ప్రీత్ కౌర్ (66), రిచా ఘోష్ (64) విధ్వంసంతో జట్టు 201 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో కవిశా 2 వికెట్లు పడగొట్టారు.

News July 21, 2024

‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ డేట్ ఫిక్స్

image

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.

News July 21, 2024

గురువుల పట్ల గౌరవంతో మెలగాలి: చంద్రబాబు

image

AP: గురువుల పట్ల అందరూ గౌరవంగా మెలగాలని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో జరిగిన గురు పౌర్ణమి మహోత్సవంలో ఆయన వేణుదత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ‘వేదవ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలి. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరుచుకోవాలి’ అని ఆయన సూచించారు.

News July 21, 2024

OTTలో సూపర్ మూవీ.. మీరు చూశారా?

image

గురువారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ‘ఆడు జీవితం’ సినిమా తెలుగు ప్రేక్షకులను కదిలిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ నేపథ్యం కలిగిన కుటుంబాలు ఈ మూవీకి ఎంతగానో కనెక్ట్ అవుతున్నాయి. ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయుల కష్టాలను ఈ మూవీలో అద్భుతంగా చూపించారు. ఇప్పటికీ సౌదీలో చాలా మంది భారతీయులు అలాంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరి మీరు ఈ చిత్రాన్ని చూశారా? కామెంట్ చేయండి.

News July 21, 2024

MLAలు ‘పసుపు’ దుస్తులతో రావాలి: TDLP

image

AP: రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో హాజరుకావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీడీఎల్పీ సూచించింది. తొలుత వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్లాలని పేర్కొంది. కాగా రేపటి నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.

News July 21, 2024

భార్య కోసం రోజూ 320 కి.మీ ప్రయాణం

image

భార్య కోసం రోజూ 320 కి.మీ ప్రయాణిస్తున్నాడో భర్త. చైనాకు చెందిన లిన్ షు ఏడేళ్ల పాటు ప్రేమించిన అమ్మాయిని ఇటీవలే పెళ్లాడాడు. ఆమె సొంత ఊరైన వైఫాంగ్‌లోనే వారు ఉంటుండటంతో అక్కడి నుంచే ఆఫీస్‌కు వెళ్తున్నాడు. ఆ ఆఫీస్ 320 కి.మీ దూరంలో ఉండటం గమనార్హం. రోజూ ఉదయాన్నే ఐదింటికి స్టార్ట్ అవుతుంది లిన్ ప్రయాణం. నెలకు రూ.18వేలను, డైలీ 7 గంటల టైమ్‌ను వెచ్చిస్తున్నాడు లిన్. కోరి పెళ్లాడిన పిల్ల కోసం తప్పదుగా!

News July 21, 2024

‘మురారి’ ఫ్లాప్‌ అంటూ ట్వీట్.. స్పందించిన కృష్ణవంశీ

image

మహేశ్ ‘మురారి’ ఫ్లాప్ అంటూ ఓ వెబ్‌సైట్‌కు చెందిన ట్విటర్ హ్యాండిల్ చేసిన ట్వీట్‌పై ఆ సినిమా దర్శకుడు కృష్ణవంశీ స్పందించారు. ‘నేను మురారి ‘తూర్పుగోదావరి’ హక్కుల్ని నిర్మాత వద్ద రూ.55లక్షలకు కొన్నాను. రూ.1.30కోట్లు వచ్చాయి. సక్సెస్‌కు లాభాలే కొలమానమైతే ఆ సినిమా హిట్టో కాదో మీరే డిసైడ్ చేయండి’ అని పేర్కొన్నారు. రిప్లై ఇంకొంచెం ఘాటుగా ఇవ్వాల్సిందంటూ ఓ అభిమాని కోరగా తప్పని కృష్ణవంశీ వారించారు.

News July 21, 2024

నిఫా వైరస్.. 14 ఏళ్ల బాలుడు మృతి

image

కేరళలో నిఫా వైరస్ సోకిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మళప్పురం జిల్లాకు చెందిన బాలుడికి శుక్రవారం నిఫా వైరస్ నిర్ధారణ కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈరోజు ఉదయం మూత్రం ఆగిపోయిందని, కాసేపటికే తీవ్రమైన గుండెపోటుతో మరణించినట్లు అధికారులు తెలిపారు. అతడికి ఎవరెవరు దగ్గరగా వచ్చారనే దానిపై ఆరా తీస్తున్నామన్నారు. 2018 నుంచి కేరళలో నిఫా వైరస్ వల్ల 21 మంది చనిపోయారు.