India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ECET-2024 ఫైనల్ ఫేజ్ సీట్లను అధికారులు కేటాయించారు. 22,365 మంది విద్యార్థులు క్వాలిఫై కాగా.. వారిలో 14,212 మంది సర్టిఫికెట్లు వెరిఫికేషన్ పూర్తి చేసుకుని, 9646 మంది ఆప్షన్లు ఎంచుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 23లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు వెల్లడించారు. లేదంటే అలాట్‌మెంట్ ఆర్డర్లు రద్దువుతాయని హెచ్చరించారు.
వచ్చే ఫిబ్రవరిలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనున్న నేపథ్యంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ఫిట్‌నెస్‌పై బీసీసీఐ దృష్టి సారించింది. 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సిన వన్డే ఫార్మాట్లో ఆయన ఎంత ఫిట్‌గా ఉన్నారనేదానిపై సెలక్టర్లలో సందేహాలున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో విజయ్ హజారే టోర్నీలో బౌలింగ్ ప్రదర్శనను నిశితంగా పరిశీలించనున్నారని బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ టోర్నీ ఈ ఏడాది చివర్లో జరగనుంది.
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ముఠాకు చెందినవారిగా అనుమానిస్తున్న ఫైజ్, పర్వేజ్ అనే ఇద్దరికి బాంబే హైకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. దావూద్‌తో సంబంధమున్నంత మాత్రాన ఉగ్రవాదులుగా పరిగణించలేమని వ్యాఖ్యానించింది. ‘UAPA చట్టం కేవలం దావూద్‌పై ప్రయోగించారు. అతడి ముఠాతో సంబంధం ఉన్నవారికి అది వర్తించదు’ అని స్పష్టం చేసింది. ఫైజ్ వద్ద పట్టుకున్న 600 గ్రాముల గంజాయి స్వల్ప మొత్తమేనని పేర్కొంది.
AP: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులు జరిగే ఈ సమావేశాల్లో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. రేపు ఉ.10 గంటలకు గవర్నర్ శాసనసభ, మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలను అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేయనుంది.
AP: రాష్ట్రంలో ప్రాజెక్టులు ‘జల’కళకళలాడుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు వరద వెల్లువెత్తుతోంది. శ్రీశైలంలో గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 817 అడుగులకు చేరింది. జూరాల నుంచి దీనిలోకి 97,208 క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రకాశం బ్యారేజీలో 14 గేట్ల ద్వారా 10,150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలూరు జిల్లా పోలవరం స్పిల్‌వే వద్ద నీటి మట్టం 31.7 మీటర్లకు చేరింది.
నటుడు సోనూసూద్ తన తల్లి సరోజ్ సూద్ జయంతి సందర్భంగా ఆమెను స్మరిస్తూ Xలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు లేని ఈ ప్రపంచం అందంగా లేకపోయినా మీ నుంచి నేర్చుకున్న విలువలతో ముందుకు సాగుతున్నా. మిమ్మల్ని హత్తుకొని ఎంతగా మిస్ అవుతున్నానో చెప్పాలని ఉంది. లవ్ యూ సో మచ్’ అని రాసుకొచ్చారు. కరోనా సమయంలో ఎందరికో సాయం చేసిన సోనూ ఇటీవల ఏపీ <<13660267>>యువతి<<>>కి అండగా నిలిచిన సంగతి తెలిసిందే.
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఢిల్లీలో ఇవాళ అఖిలపక్ష సమావేశం జరిగింది. బీజేపీ నుంచి జేపీ నడ్డా, రాజ్‌నాథ్, టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నుంచి విజయసాయి, జనసేన నుంచి బాలశౌరి, BRS నుంచి సురేశ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశాల్లో నీట్ వివాదం, మణిపుర్ హింస, ధరల పెరుగుదల, ED-CBIల దుర్వినియోగం సహా పలు అంశాలపై చర్చించాలని కాంగ్రెస్, SP డిమాండ్ చేశాయి.
AP: YCP అధినేత జగన్ ఇవాళ సా.5 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ కానున్నారు. APలో కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి కొనసాగుతున్న అరాచక పాలన, చేస్తున్న హత్యలు, దాడులు, విధ్వంసాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారని YCP వెల్లడించింది. వినుకొండలో రషీద్ దారుణ హత్య, ఆ మర్నాడే పుంగనూరులో MP మిథున్ రెడ్డి వాహనంపై రాళ్ల దాడి సహా పలు అంశాలపై సాక్ష్యాలు, వీడియోలను గవర్నర్‌కు జగన్ అందిస్తారని తెలిపింది.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జాన్వీ కపూర్ డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని తండ్రి బోనీ కపూర్ చెప్పారు. ఫుడ్ పాయిజన్ వల్ల జాన్వీని ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఆరోగ్యం మెరుగవ్వడంతో ఇవాళ ఉదయం ఇంటికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలోనూ హీరోయిన్‌గా ఎంపికయ్యారు.
తమిళనాడుకు చెందిన ఆయన పేరు అరుణాచలం. కాటికాపరి పని వారికి తరతరాల కులవృత్తి. ఇప్పుడాయన మాతూర్ పంచాయతీ అధ్యక్షుడు. అయినా కులవృత్తిని వీడలేదు. పంచాయతీ పెద్దనన్న గర్వంలేదు. పగలు గంజి పెట్టిన ఖద్దరు దుస్తుల్లో ఊరికోసం తపిస్తూ, రాత్రుళ్లు తువ్వాలు భుజాన వేసుకుని కాటికాపరిగా పనిచేస్తున్నారు. అనాథ శవాలకు సొంత ఖర్చులతో అంత్యక్రియలు చేస్తున్నారు. దీంతో ఆయన పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Sorry, no posts matched your criteria.