India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అజర్ హాసన్ అనే యువకుడు నాలుగేళ్లలో 70 కేజీల బరువు తగ్గి ఫిట్‌నెస్ మోడల్‌గా మారాడు. ఇందులో 55KGS 7 నెలల్లోనే తగ్గినట్లు చెప్పారు. అతడి బాడీ ఫ్యాట్ 55% నుంచి 9%కి తగ్గింది. సరైన శిక్షణ, కఠోర శ్రమ, బ్యాలన్స్‌డ్ డైట్‌తో ఇది సాధ్యమైందన్నారు. తన తండ్రి మృతదేహాన్ని సమాధిలో పెట్టేటప్పుడు ఊబకాయం వల్ల కిందికి వంగలేకపోయానని, ఆ తర్వాత శ్రమించి బరువు తగ్గినట్లు MTV రోడీస్ షోలో అజర్ తెలిపారు.

TGలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, KCR, KTR ఫొటోలతో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘట్‌కేసర్ గట్టు మైసమ్మ జాతర సందర్భంగా అభిమానులు దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో CBNకు బాస్ ఈజ్ బ్యాక్, పవన్‌కు ట్రెండ్ సెట్టర్, KCRకు గాడ్ ఆఫ్ TG కమింగ్ సూన్, KTRకు ఫ్యూచర్ ఆఫ్ TG అని క్యాప్షన్స్ పెట్టారు. సీనియర్ NTR, లోకేశ్, చిరంజీవి, హరీశ్ రావు ఫొటోలు కూడా ఆ బ్యానర్‌లో ఉండటం గమనార్హం.

ఇండియా ఓపెన్ టోర్నీలో పాల్గొన్న డెన్మార్క్ ప్లేయర్ బ్లిచ్‌ఫెల్ట్ ఢిల్లీలో పరిస్థితులు సరిగా లేవని అన్నారు. వాయు కాలుష్యం, పక్షుల రెట్టల మధ్య ప్రాక్టీస్ చేయలేకపోయానని చెప్పారు. వరుసగా రెండో ఏడాది అనారోగ్యానికి గురయ్యానని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. దీనిపై స్పందించిన BAI టోర్నీ నిర్వహణకు ప్రత్యామ్నాయ వేదికలను చూస్తామని తెలిపింది. కాగా బ్లిచ్‌ఫెల్ట్ రెండో రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

IPL-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా రిషభ్ పంత్ వ్యవహరిస్తారని ESPN CRIC INFO పేర్కొంది. దీనిపై రేపు అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఆక్షన్‌లో అతడిని రూ.27కోట్లకు LSG కొనుగోలు చేసింది. స్క్వాడ్‌లో పూరన్, మార్క్రమ్, మిల్లర్ వంటి ప్లేయర్లున్నా స్వదేశీ కెప్టెన్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. పంత్ 2021, 2022, 2024 సీజన్లలో DCకి కెప్టెన్సీ చేసిన విషయం తెలిసిందే.

AP: విజయవాడలో రాష్ట్ర బీజేపీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం ముగిసింది. సుమారు గంటన్నర పాటు చర్చించి, కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టిందన్నారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అంతర్గత విభేదాలను పక్కనబెట్టాలని సూచించారు. ‘హైందవ శంఖారావం’ విజయం పట్ల VHP, BJP నేతలను షా అభినందించారు.

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.130+ కోట్ల కలెక్షన్లు రాబట్టగా నిన్నటితో కలిపి రూ.161కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే, కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్ పొందడంతో బాక్స్ ఆఫీస్‌ను రూల్ చేస్తోందని వెల్లడించాయి. షోలు పెరిగినప్పటికీ హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని పేర్కొన్నాయి.

TG: సింగపూర్‌లో పర్యటిస్తున్న CM రేవంత్ బృందం మరో భారీ పెట్టుబడిని రాబట్టినట్లు CMO వెల్లడించింది. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్కు ఏర్పాటుకు ₹450 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కాపిటా ల్యాండ్ సంస్థ ముందుకొచ్చిందని పేర్కొంది. దీని వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. నిన్న STT గ్లోబల్ డేటా సెంటర్ ₹3,500 కోట్ల పెట్టుబడితో ఆర్ట్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో MOU చేసుకుంది.

డొనాల్డ్ ట్రంప్ ఈనెల 20న అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులను మూకుమ్మడిగా అరెస్టు చేయిస్తారని వార్తలు వస్తున్నాయి. అలాంటి వారిపై ఆయన ఉక్కుపాదం మోపుతారని పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. దీనిపై అమెరికా వలసల విభాగం మాజీ అధికారి ఒకరు స్పందిస్తూ ట్రంప్ ప్రమాణం చేశాక 21నుంచే ఈ అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అక్రమంగా చొరబడ్డ వలసదారులను వెనక్కి పంపే చర్యలను ముమ్మరం చేస్తారన్నారు.

ప.గో జిల్లా భీమవరానికి చెందిన బుల్లిరాజు క్యారెక్టర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ పాత్రకు ముగ్ధులైనట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘బుల్లిరాజు’ పాత్రలో నటించిన రేవంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సినిమా చూశాక మహేశ్ సార్‌ను టీమ్‌తో కలిశాను. చాలా బాగా చేశావు బుల్లిరాజు. నీ కోసమైనా మళ్లీ సినిమా చూస్తానన్నారు. నాతో పాటు డాన్స్ కూడా చేశారు’ అని చెప్పుకొచ్చారు.

AP: మంత్రి లోకేశ్‌ను డిప్యూటీ CM చేయాలన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమర్థించారు. ‘ఆ పదవికి లోకేశ్ వందశాతం అర్హులే. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్నాక పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. డిప్యూటీ CM పదవికి అన్ని విధాలా అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.