News April 14, 2024

పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్?

image

వరుస ఓటములతో డీలాపడ్డ పంజాబ్ కింగ్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. గాయం కారణంగా కెప్టెన్ శిఖర్ ధవన్ మరో 3 మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. గాయం తీవ్రత తగ్గకపోవడంతో మరో 10 రోజులు ఆయన విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ స్థానంలో సామ్ కరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కాగా పంజాబ్ ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడి రెండింట్లో గెలుపొంది నాలుగింటిలో ఓటమి పాలైంది.

News April 14, 2024

వైఎస్ జగన్‌పై దాడి హేయం: పురందీశ్వరి

image

AP: సీఎం వైఎస్ జగన్‌పై నిన్న జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు. ‘ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. కాగా.. ప్రధాని మోదీ ఇప్పటికే జగన్‌కు సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే.

News April 14, 2024

స్వదేశం వెళ్లిపోయిన మార్ష్

image

చీలమండ గాయంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ మిచెల్‌ మార్ష్‌ స్వదేశానికి వెళ్లారు. ఏప్రిల్‌ 3న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ అతడు ఆ తర్వాత ముంబై, లక్నో మ్యాచ్‌లకు దూరమయ్యారు. ఈ క్రమంలో మార్ష్ మిగిలిన మ్యాచ్‌లు ఆడటం సందేహమే. మరోవైపు ఆ టీమ్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వేలి గాయంతో బాధపడుతున్నారు. దీంతో బుధవారం గుజరాత్‌తో మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా మారింది.

News April 14, 2024

జగన్‌పై దాడి టీడీపీ కుట్రే: మంత్రి

image

AP: సీఎం జగన్‌పై రాళ్ల దాడి టీడీపీ కుట్రేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ‘సిద్ధం సభలు, బస్సుయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి ప్రతిపక్షాలకు వణుకుపుడుతోంది. ఈ ఆదరణను చూసి వారు ఓర్వలేకపోతున్నారు. ఈ దాడిపై లోకేశ్ నీచపు వ్యాఖ్యలు దారుణం. ఎవరైనా రాయితో ప్లాన్ చేసి కొట్టించుకుంటారా? లోకేశ్ వ్యాఖ్యలు చూస్తుంటే ఈ దాడి వెనుక టీడీపీ ఉందనే అనుమానం కలుగుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.

News April 14, 2024

భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు: మోదీ

image

జమిలీ ఎన్నికలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని మోదీ అన్నారు. దీంతో పాటు దేశం మొత్తం ఉమ్మడి పౌరస్మృతి(UCC)ని అమలు చేస్తామని చెప్పారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. తాము ప్రవేశపెట్టిన మేనిఫెస్టో బ్లూప్రింట్ వంటిదని తెలిపారు.

News April 14, 2024

జగన్‌పై ఎయిర్‌గన్‌తో దాడి: ఎమ్మెల్యే తోపుదుర్తి

image

AP: సీఎం జగన్‌పై దాడి విషయంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగింది రాళ్ల దాడి కాదన్నారు. ఎయిర్‌గన్‌తో చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ‘జగన్ నుదుటిని టార్గెట్ చేసి ఎయిర్‌గన్‌తో దాడి చేశారని భావిస్తున్నాం. ఆ పెల్లెట్ కంటికి తగిలి ఉండొచ్చు. షెడ్యూల్ వచ్చాక జగన్‌కు భద్రత కూడా తగ్గించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి’ అని డిమాండ్ చేశారు.

News April 14, 2024

థాంక్యూ మోదీ గారు: జగన్

image

రాయి దాడిలో గాయపడ్డ తాను త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు సీఎం జగన్ రిప్లై ఇచ్చారు. ‘థాంక్యూ మోదీ గారు’ అని జగన్ Xలో స్పందించారు. కాగా అర్ధరాత్రి గాయానికి ట్రీట్‌మెంట్ తర్వాత జగన్ కేసరపల్లికి వెళ్లారు. ఇవాళ అక్కడే రెస్ట్ తీసుకోనున్నారు.

News April 14, 2024

నారా లోకేశ్‌కు ఆర్జీవీ కౌంటర్

image

AP: సీఎం జగన్ మీద దాడిని ఉద్దేశించి టీడీపీ నేత నారా <<13048311>>లోకేశ్<<>> చేసిన ట్వీట్‌పై ఆర్జీవీ కౌంటర్ ఎటాక్ చేశారు. ‘నీ ట్వీట్ నీకు బ్రెయిన్‌తో పాటు హృదయం లేదని నిరూపిస్తోంది. అంత కచ్చితత్వంతో రాయిని ఎలా విసిరారో నీకున్న కొద్దిపాటి జ్ఞానంతో వివరించాలి. కంటికి ఆ రాయి తగిలితే ఎలా ఉండేది? అప్పుడు కూడా జగన్ ప్లాన్ అని అనుకునేవాడివా?’ అని లోకేశ్‌ని ప్రశ్నించారు.

News April 14, 2024

2036లో భారత్‌లో ఒలింపిక్స్: మోదీ

image

తమ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందని PM మోదీ అన్నారు. 2036లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యువత కలలను సాకారం చేసేలా మేనిఫెస్టో ఉంటుందన్నారు. ట్రాన్స్‌జెండర్లను ఆయుష్మాన్ భారత్ యోజనలో భాగం చేస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో అన్ని రంగాల్లో మహిళా భాగస్వామ్యాన్ని పెంచేలా శిక్షణ ఇస్తామన్నారు.

News April 14, 2024

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ

image

బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ముద్ర యోజన కింద లోన్ల పరిమితి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు చెప్పారు. పేదలకు మరో 3 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని, భవిష్యత్తులో పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేస్తామని మోదీ ప్రకటించారు.