India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కోల్‌కతా హత్యాచార ఘటనపై CBI దర్యాప్తు పూర్తిగా చేయలేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఇందులో ఆరుగురు (నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు) ఉన్నట్లు DNA రిపోర్టులో వెల్లడైతే సంజయ్‌ను మాత్రమే నిందితుడిగా చేర్చారని చెప్పారు. తమ కూతురి గొంతుపై గాయాలున్నా ఆ శాంపిల్ సేకరించలేదన్నారు. అటు కేసు పురోగతిని ఎంత అడిగినా చెప్పలేదన్నారు. నేడు కోర్టుకు తమను పిలవలేదని, తమ లాయర్‌నూ రావద్దని కోరినట్లు తెలిపారు.

TG: రాష్ట్రవ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు పొందేందుకు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో 11.65 లక్షల మంది పేర్లు ఉన్నాయి. ఈ నెల 20-24 వరకు గ్రామాలు, వార్డుల్లో సభలు పెట్టి అభ్యంతరాలు సేకరించిన తర్వాత తుది జాబితా ఖరారు చేస్తారు. ఇలా కలెక్టర్ల ద్వారా వచ్చే లిస్టులతో జనవరి 26 నుంచి కార్డులు మంజూరు చేస్తారు. రేషన్ కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సంతకాలు ఉండనున్నాయి.

ఈనెల 23 నుంచి జరిగే రంజీ ట్రోఫీ మ్యాచులకు కోహ్లీ, KL రాహుల్ దూరం కానున్నట్లు ESPN CRIC INFO తెలిపింది. మెడ గాయంతో కోహ్లీ, మోచేతి గాయంతో రాహుల్ బాధపడుతున్నారని పేర్కొంది. ఈనెల 30 నుంచి జరగనున్న మ్యాచులకు వీరిద్దరూ అందుబాటులో ఉండే అవకాశమున్నా, ఆ వెంటనే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఉండటంతో వారు రంజీల్లో ఆడే అవకాశం లేదని తెలిపింది.

మంచు బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతోంది. నిన్న కుక్క-సింహం అంటూ ట్వీట్స్ చేసుకున్న ఈ అన్నదమ్ములు.. సై అంటే సై అంటూ ఈరోజు మనోజ్ సవాల్ విసిరారు. ‘దా.. కూర్చుని మాట్లాడుదాం. మహిళలు, నాన్న, స్టాఫ్‌ను పక్కన పెట్టి మనం కలుసుకుందాం. ఒట్టేసి చెబుతున్నా.. నేనొక్కడినే వస్తా. నువ్వు ఎవరినైనా, ఎంతమందినైనా తీసుకొచ్చుకో. లేకపోతే మనం హెల్తీ ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం’ అని ట్వీట్ చేశారు.

TG: గ్రూప్-2 ప్రిలిమినరీ కీ విడుదలైంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22 సా.5 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో 783 పోస్టుల కోసం గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 నిర్వహించారు. సైట్: <

బీదర్‌లో <<15169507>>ఏటీఎం డబ్బులు<<>> చోరీ చేసి, HYD అఫ్జల్‌గంజ్‌లో <<15172705>>కాల్పులు జరిపిన<<>> నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. బిహార్‌కు చెందిన మనీశ్, మరికొందరు కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని ఓ బ్యాంకులో రూ.70లక్షలు చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. మనీశ్, అతని ముఠా కోసం తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ పోలీసులు గాలిస్తున్నారు.

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ స్టేట్‌మెంట్‌ను ముంబై పోలీసులు నమోదు చేశారు. దుండగుడు సైఫ్‌ను చాలా సార్లు పొడిచాడని ఆమె తెలిపారు. తమ కుమారుడు జహంగీర్ వద్దకు వెళ్లేందుకు పదే పదే ప్రయత్నించాడని, సైఫ్ అడ్డుకున్నారని పేర్కొన్నారు. కానీ ఇంట్లో ఎలాంటి డబ్బులు, ఆభరణాలు దొంగతనం చేయలేదని పోలీసులకు వెల్లడించారు. మరోవైపు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

AP: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది. ప్రాజెక్టు సీఈ, అధికారులు భూమిపూజ, హోమం నిర్వహించారు. అనంతరం వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.990 కోట్లు ఖర్చు చేయనుంది. సగం నిర్మాణం పూర్తి కాగానే దానిపై సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించనున్నారు.

బాక్సాఫీస్ వద్ద ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ కలెక్షన్ల రాబడుతోంది. ఈ నెల 14న మూవీ విడుదల కాగా 4 రోజుల్లో రూ.131 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇవాళ, రేపు వీకెండ్స్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

TG: BC స్టడీ సర్కిళ్లలో RRB, SSC, బ్యాంకింగ్ తదితర రిక్రూట్‌మెంట్లకు ఫ్రీ కోచింగ్ తరగతులు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు JAN 20 నుంచి FEB 9 వరకు అప్లై చేసుకోవాలి. ఇంటర్, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. FEB 12-14 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం గ్రామాల్లో ₹2L, పట్టణాల్లో ₹1.50Lకు మించకూడదు.
వెబ్‌సైట్: https://tgbcstudycircle.cgg.gov.in/
Sorry, no posts matched your criteria.