News January 17, 2025

సెలవులు ముగిశాయ్

image

తెలంగాణలోని స్కూళ్లకు నేటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. దాదాపు వారం రోజులు పండగ హాలిడేస్ ఎంజాయ్ చేసిన విద్యార్థులు రేపటి నుంచి బడి బాట పట్టనున్నారు. రాబోయే 2, 3 నెలలు పరీక్షాసమయం కావడంతో స్టూడెంట్స్ ఇక పుస్తకాలకే అంకితం కానున్నారు. కాగా ఈనెల 11 నుంచి 17 వరకు ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అటు జూనియర్ కాలేజీలు ఇవాళ్టి నుంచి పున:ప్రారంభం అయ్యాయి.

News January 17, 2025

రేషన్‌కార్డుల ఎంపికలో గందరగోళం.. విమర్శలు

image

TG: రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తమకు అందజేసిన జాబితా ప్రకారం గ్రామాల్లో సిబ్బంది సర్వే చేస్తున్నారు. ప్రజాపాలన సందర్భంగా కార్డు కోసం అప్లై చేసినా జాబితాలో పేరు లేకపోవడం ఏంటని చాలామంది సిబ్బందిని నిలదీస్తున్నారు. అర్హుల ఎంపికకు ప్రభుత్వం దేన్ని ప్రాతిపదికగా తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. కులగణన ఆధారంగా సర్కార్ జాబితా రూపొందించినట్లు సమాచారం.

News January 17, 2025

చాగంటికి తిరుమలలో అవమానమంటూ వార్తలు.. ఖండించిన TTD

image

AP: రాష్ట్ర నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ వస్తున్న వార్తలను TTD ఖండించింది. ప్రవచనం కోసం పిలిపించి కార్యక్రమాన్ని రద్దు చేశారనేది అవాస్తవమని పేర్కొంది. ఆయన అంగీకారంతోనే మరో రోజుకు వాయిదా వేశామంది. చాగంటినే సాధారణ భక్తుల తరహాలో శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించింది. అసత్య వార్తలను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News January 17, 2025

కరుణ్ నాయర్‌ను ప్రశంసించిన సచిన్

image

విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్‌ను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. ‘7 ఇన్నింగ్స్‌లలో కరుణ్ 5 సెంచరీలతో 752 పరుగులు చేయడం సాధారణమైన విషయం కాదు. ఇలాంటి ప్రదర్శనలు ఈజీ కాదు. దీనికోసం ఏకాగ్రత, హార్డ్ వర్క్ అవసరం. ప్రతి అవకాశాన్ని బలంగా వినియోగించుకోండి’ అని ఆయన పేర్కొన్నారు.

News January 17, 2025

SBI ఖాతాదారులకు ALERT

image

త్వరలోనే ఆండ్రాయిడ్ 11, అంతకంటే తక్కువ వెర్షన్ మొబైల్స్‌లో YONO సేవల్ని నిలిపివేయనున్నట్లు SBI ప్రకటించింది. అలాంటి ఫోన్లు వాడుతున్న వారు ఫిబ్రవరి 28లోపు కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలని అలర్ట్ సందేశాలు పంపుతోంది. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాత వెర్షన్ మొబైల్స్‌ యూజ్ చేస్తున్నవారికి సైబర్ నేరగాళ్ల ముప్పు ఉన్నట్లు సమాచారం.

News January 17, 2025

IPS సునీల్‌కుమార్‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశం

image

AP: సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్‌పై విచారణకు స్పెషల్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందులో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీశ్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. సునీల్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే అభియోగాలపై వీరు దర్యాప్తు చేసి నివేదిక సమర్పించనున్నారు.

News January 17, 2025

భారీగా తగ్గిన భారత ఫారెక్స్ నిల్వలు

image

గత కొన్ని వారాలుగా భారత ఫారెక్స్ నిల్వలు తగ్గుతూ వస్తున్నాయి. జనవరి 10తో ముగిసిన వారానికి ఇండియా నిల్వలు $8.714 బిలియన్లు తగ్గి $625.871 బిలియన్లకు చేరాయి. అంతకు ముందు వారంలో $5.693 బిలియన్లు తగ్గాయి. రూపాయి విలువ మరింత పడిపోకుండా ఉండేందుకు ఆర్బీఐ ఇటీవల కాలంలో ఫారెక్స్‌లో జోక్యం చేసుకుంటోంది. కాగా చివరిసారిగా గతేడాది సెప్టెంబర్‌లో ఫారెక్స్ రిజర్వ్‌లు $704.885 జీవిత కాల గరిష్ఠానికి చేరాయి.

News January 17, 2025

మంచు బ్రదర్స్ ట్వీట్స్ వార్

image

‘రౌడీ’ సినిమాలోని డైలాగ్‌తో Xలో విమర్శలు చేసిన విష్ణు ట్వీట్‌కు మనోజ్ కౌంటర్ ఇచ్చారు. ‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావ్’ అని విష్ణు ట్వీట్ చేశారు. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిలా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకు ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్’ అని మనోజ్ కౌంటర్ ఇచ్చారు.

News January 17, 2025

VIRAL: అప్పట్లో రూ.18కే తులం బంగారం

image

మార్కెట్‌లో బంగారానికి భారీగా డిమాండ్ ఉంటుంది. నిత్యం రూ.వందల్లో పెరుగుతూ అప్పుడప్పుడూ తగ్గుతూ మధ్యతరగతి ప్రజలను ఊరిస్తుంటుంది. అసలు వందేళ్ల క్రితం పది గ్రాములు బంగారం ధర ఎంతుందో తెలుసా? 1925లో దీని ధర రూ.18.75 ఉండగా 2025లో రూ.80,620గా ఉంది. 1959లో తొలిసారి రూ.100 దాటి రూ.102.56కి 1980లో తొలిసారి వెయ్యి దాటి రూ.1330, 1985లో రూ.2130, 1996లో రూ.5160, 2007లో రూ.10,800 కాగా 2022లో రూ.52వేలకు చేరింది.

News January 17, 2025

రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల

image

TG: గ్రూప్-2 ‘కీ’ రేపటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో వస్తుందని టీజీపీఎస్సీ పేర్కొంది. ఈనెల 18 నుంచి 22న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ అభ్యంతరాలను తెలపొచ్చని వెల్లడించింది. కాగా డిసెంబర్ 15, 16న గ్రూప్-2 పరీక్ష జరిగింది.