India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రూ.లక్షలోపు రైతు రుణాలను ప్రభుత్వం ఇవాళ మాఫీ చేయనుంది. దీంతో ఆపై లోన్ ఉన్న ఉన్నవాళ్లకు ఎప్పుడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈనెలాఖరులోగా రూ.లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న లోన్లను ఆగస్టు 15లోపు మాఫీ చేయనున్నట్లు సీఎం తెలిపారు.
TG: రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారని, ఈ విషయం ఇంటింటికీ వెళ్లి చెప్పాలని పార్టీ శ్రేణులకు CM రేవంత్ రెడ్డి సూచించారు. ఊరూరా సంబరాలు నిర్వహించాలని చెప్పారు. రుణమాఫీపై జాతీయ స్థాయిలోనూ చర్చ జరగాలని, పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు ఈ విషయాన్ని ప్రస్తావించాలని దిశానిర్దేశం చేశారు. తన జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని సీఎం వ్యాఖ్యానించారు.
AP: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడిగా TDP MP కేశినేని శివనాథ్ ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ జిల్లాల క్రికెట్ సంఘాలు, క్లబ్‌లు ఆయన అభ్యర్థిత్వానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత అపెక్స్ కౌన్సిల్ త్వరలో రాజీనామా చేయనుంది. ఈ నెల 21న ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియను ప్రకటించనుంది. మరో నెలన్నరలో కొత్త ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు కానుందని అంచనా.
AP: పల్నాడులో తమ పార్టీ కార్యకర్త <<13650476>>హత్య<<>> నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైసీపీ Xలో ఫిర్యాదు చేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌కు ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్ రాష్ట్రపతి మేడం. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకొని, రాష్ట్ర ప్రజలను కాపాడండి. అలాగే మాకు ప్రతి భారతీయుడి మద్దతు కావాలని కోరుతున్నాం. ఎందుకంటే మేము కూడా ఇండియాలో భాగమే’ అని రాష్ట్రపతిని ట్యాగ్ చేస్తూ మర్డర్ వీడియోను పోస్ట్ చేసింది.
TG: ఈ ఏడాది వాస్తవిక అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆదాయం, రుణ సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్లకు చేరే అవకాశాలున్నాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులపై స్పష్టత వచ్చాకే రాష్ట్ర ఆదాయ, వ్యయాల మొత్తాలను ఖరారు చేయాలని ఆర్థికశాఖకు ప్రభుత్వం సూచించింది. ఈ నెల 23న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా, రాష్ట్రంలో ఈ 25న ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
హ్యాకింగ్, సైబర్ మోసాల నేపథ్యంలో ప్రధాని మోదీ అధికారులకు కీలక సూచన చేశారు. పని పూర్తయిన వెంటనే సిస్టమ్స్(కంప్యూటర్/ల్యాప్ టాప్) లాగౌట్ చేయాలని ఆయన చెప్పారని జాతీయ మీడియా కథనం పేర్కొంది. తన పని పూర్తయిన వెంటనే సిస్టమ్ లాగౌట్ చేస్తానని, సైబర్ భద్రత విషయంలో ఇది చాలా ముఖ్యమని చెప్పారు. రోజు చివర్లో అన్ని సిస్టమ్స్ లాగౌట్ అయ్యాయా? లేదా? అని చూసుకునే పనిని ఓ వ్యక్తికి అప్పగించాలని సూచించారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో ఆ రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువన జూరాల జలాశయానికి నీటిని వదిలారు. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 62,955 క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతోంది. రెండు మూడు రోజుల్లో జూరాల నిండనుంది. ఆ తర్వాత గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని వదలనున్నారు. కృష్ణా నదికి ఉపనది తుంగభద్రకు వరద కొనసాగుతోంది.
తిరుమల శ్రీవారి అక్టోబర్ నెల ఆర్జిత సేవా టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. ఉ.10 గంటలకు టీటీడీ అధికారిక <
AP: అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా కథకు 27 మంది రచయితలు పని చేశారని కల్కి నిర్మాత అశ్వనీదత్ చెప్పారు. వైజయంతీ మూవీస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. APని తుఫాన్ వణికిస్తున్న సమయంలోనూ JVAS థియేటర్లలో ప్రభంజనం సృష్టించిందన్నారు. ఆ తర్వాత చిరంజీవితో ఏర్పడిన అనుబంధంతో చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవ చిత్రాలు చేసినట్లు దత్ పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.