News July 18, 2024
ACA అధ్యక్షుడిగా టీడీపీ ఎంపీ కేశినేని?
AP: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడిగా TDP MP కేశినేని శివనాథ్ ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ జిల్లాల క్రికెట్ సంఘాలు, క్లబ్‌లు ఆయన అభ్యర్థిత్వానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుత అపెక్స్ కౌన్సిల్ త్వరలో రాజీనామా చేయనుంది. ఈ నెల 21న ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియను ప్రకటించనుంది. మరో నెలన్నరలో కొత్త ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు కానుందని అంచనా.
Similar News
News December 10, 2024
శబరిమల వెళ్లే మహిళలకు గుడ్‌న్యూస్
శబరిమల వెళ్లే మహిళల భద్రత పట్ల కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంబా బేస్‌లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది. ఈ వసతి గృహంలో 50మంది మహిళలు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేసి సోమవారం ప్రారంభించింది. అయ్యప్ప మాలధారులతో వచ్చే మహిళలు తమవారు తిరిగొచ్చే వరకు పంపా బేస్, హిల్ టాప్ వద్ద వాహనాల్లోనే ఎదురు చూడాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో మహిళలకు ఆ కష్టాలు తీరనున్నాయి.
News December 10, 2024
మీడియా సంస్థలపై జగన్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా
AP: సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో తనపై అవాస్తవాలు ప్రచురించాయంటూ పలు మీడియా సంస్థలపై రూ.100 కోట్లకు మాజీ సీఎం జగన్ పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఆ కథనాలు తొలగించి బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు నోటీసులిచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.
News December 10, 2024
మంత్రివర్గంలోకి నాగబాబు.. అంబటి సెటైర్
AP: నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం’ అని Xలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, నాగబాబును ట్యాగ్ చేశారు.