India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహారాష్ట్రలోని నాసిక్-పుణే హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఐచర్ ప్యాసింజర్లతో వెళ్తోన్న మాక్సిమోను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మాక్సిమో ముందున్న బస్సును ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం ధాటికి మాక్సిమో నుజ్జునుజ్జయింది. పుణే సమీపంలోని నారాయణ్‌గావ్ రోడ్డుపై ఈ యాక్సిడెంట్ అయింది.

రానున్న 50 ఏళ్లలో ఇండియా జీడీపీ భారీగా పెరుగుతుందని ‘గోల్డ్‌మన్ సాక్స్’ అంచనా వేసింది. 2075 నాటికి ఇండియా $52.5 ట్రిలియన్‌తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొంది. $57 ట్రిలియన్‌తో చైనా జీడీపీలో నంబర్ 1గా మారనుందని తెలిపింది. కాగా, మూడో స్థానంలో USA ($51.5 ట్రిలియన్), నాలుగో ప్లేస్‌లో ఇండోనేషియా ($13.7ట్రి), ఐదో స్థానంలో నైజీరియా ($13.1ట్రి) ఉంటాయని వెల్లడించింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని చదువుకునే అబ్బాయిలకు, వృద్ధులకూ కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ స్కీం కింద మహిళలు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. అలాగే గృహావసరాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆలయాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ నడ్డా మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.

ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. KL రాహుల్, డుప్లెసిస్ వంటి ప్లేయర్లున్నా టీమ్ మేనేజ్‌మెంట్ అక్షర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. 2019 నుంచి DCకి ఆడుతున్న అక్షర్, గత సీజన్‌లో ఆ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. ఒక మ్యాచులో కెప్టెన్సీ కూడా చేశారు. ఇంగ్లండ్‌తో జరిగే T20 సిరీస్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉండనున్నారు.

‘పుష్ప’ నటుడు ఫహాద్ ఫాజిల్ అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ ( ADHD) వ్యాధి సోకినట్లు గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాధిపై ఆయన భార్య నజ్రియా స్పందించారు. ‘ఆయన పరిస్థితి అర్థం చేసుకుని నేను కొంచెం ఓపిక పెంచుకున్నాను. అంతకుమించి మా జీవితంలో ఏమీ మారలేదు’ అని తెలిపారు. ఈ వ్యాధి కలిగిన వారు పరధ్యానం, చికాకు, చిన్నవాటికే కోపం తెచ్చుకోవడం వంటివి చేస్తారు.

సైఫ్ అలీఖాన్‌పై కత్తి దాడి కేసు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడు చివరిసారిగా ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌లో పోలీసులు గుర్తించారు. ఈ ఉదయం వాసాయి-విరార్ వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పోలీసు టీంలు వాసాయి, నల్లసోపారా, విరార్ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా సైఫ్ అలీఖాన్ లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

TG: నల్గొండ(D)లో అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరైన 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీసును జిల్లా కలెక్టర్ బ్రేక్ చేశారు. దీంతో గైర్హాజరైన కాలానికి సంబంధించిన సర్వీసును వారు కోల్పోనున్నారు. దీని వల్ల సర్వీస్ రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్లు, పెన్షన్ల విషయంలో వారికి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వీరిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. పాత స్థానాల్లో కాకుండా వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు.

ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రూ.650 పెరిగి రూ.81,270కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.74,500 పలుకుతోంది. కేజీ వెండి రూ.1000 పెరిగి రూ.1,04,000కు చేరింది.

<<15173290>>బీదర్ దొంగల కోసం<<>> పోలీసులు వేట కొనసాగుతోంది. నిందితులను ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. వారు హైదరాబాద్ నుంచి అడ్డదారుల్లో రాయ్‌పూర్‌కు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. నిన్న బీదర్‌లో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి ఏటీఎం డబ్బులు దొంగిలించిన నిందితులు సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. అఫ్జల్ గంజ్‌లో ట్రావెల్స్ సిబ్బందిపై కాల్పులు జరిపి పరారయ్యారు.

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.106 కోట్లు కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్.. విక్టరీ వెంకటేశ్’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
Sorry, no posts matched your criteria.