News April 12, 2024

రిటైర్మెంట్ ఆలోచన లేదు: రోహిత్ శర్మ

image

తనకు రిటైర్మెంట్ ఆలోచన లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. ‘ప్రస్తుతం నా ప్రదర్శన బాగానే ఉంది. మరికొన్నేళ్లు ఆటలో కొనసాగుతా. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (2025)లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి జట్టును గెలిపించాలి. అలాగే మరో వరల్డ్ కప్ సాధించాలి. ఆ రెండూ నెరవేరుతాయని ఆశిస్తున్నా’ అని బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ కార్యక్రమంలో హిట్‌మ్యాన్ చెప్పారు.

News April 12, 2024

ఇరాన్, ఇజ్రాయెల్‌కు ఇండియన్స్ వెళ్లొద్దు: విదేశాంగశాఖ

image

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. ‘తదుపరి సమాచారం ఇచ్చేవరకు ఆ దేశాలకు భారతీయులెవరూ ప్రయాణించొద్దు. ఇప్పటికే అక్కడ ఉన్నవారు ఇండియన్ ఎంబసీతో టచ్‌లో ఉండాలి. తమ పేర్లను అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి’ అని కోరింది. ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సూలేట్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడి చేసిన విషయం తెలిసిందే.

News April 12, 2024

చంద్రబాబు 2014లో ఈ హామీలు అమలు చేశారా?: సీఎం జగన్

image

AP: 2014 ఎన్నికల్లోనూ చంద్రబాబు, దత్తపుత్రుడు, మోదీ అనేక హామీలిచ్చి మోసం చేశారని సీఎం జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు రూ.87 వేల కోట్ల రుణమాఫీ చేశారా? పొదుపు సంఘాల రుణాలు రూ.14,200 కోట్లు మాఫీ చేశారా? ఆడ బిడ్డల పేరిట రూ.25వేలు బ్యాంకులో జమ చేశారా? ఇంటింటికీ ఓ ఉద్యోగం.. లేదంటే రూ.2000 చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చారా? పేదలకు ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చారా?’ అని ప్రశ్నించారు.

News April 12, 2024

ఇంటర్ RESULTS.. కీలక అప్‌డేట్

image

AP: ఇవాళ ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ప్రాక్టికల్స్ ఫెయిల్ అయిన వారికి బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు మే 1 నుంచి 4వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో మాత్రమే నిర్వహిస్తామని వెల్లడించింది. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు కూడా రాసుకోవచ్చని పేర్కొంది.

News April 12, 2024

టాస్ గెలిచిన లక్నో..

image

ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
లక్నో: డికాక్, KL రాహుల్, పడిక్కల్, స్టోయినిస్, పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్
ఢిల్లీ: పృథ్వీ షా, వార్నర్, హోప్, రిషబ్ పంత్, స్టబ్స్, అక్షర్ పటేల్, మెక్‌గర్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

News April 12, 2024

ఉపాధి కోసం వలస వెళ్తున్నారు: చంద్రబాబు

image

AP:రాజధాని విషయంలో జగన్ 3 ముక్కలాట ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘అమరావతి పూర్తైతే ఇక్కడే అందరికీ ఉపాధి దొరికేది. ఉపాధి కోసం యువత HYD, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు. ఓటు వేసిన వారినే కాటు వేసే రకం జగన్. నా SCలు అంటూ వారి నెత్తిమీదే చెయ్యి పెడతారు. నాసిరకం మద్యంతో అనేక మంది చనిపోతున్నారు. 5 ఏళ్లలో పోలవరం ఎంత పూర్తైంది? రోడ్లపై గుంతలు పూడ్చలేని వారు 3 రాజధానులు ఎలా కడతారు?’ అని ప్రశ్నించారు.

News April 12, 2024

పెరిగిన పాస్‌ పర్సెంటేజ్

image

AP ఇంటర్ ఫలితాల్లో పాస్ పర్సెంటేజ్ పెరిగింది. గత ఏడాది ఫస్టియర్‌లో 61శాతం మంది పాస్ కాగా ఈ సారి 67శాతం మంది పాసయ్యారు. అలాగే సెకండియర్ విద్యార్థుల్లో గతేడాది 72శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది 78శాతం మంది పరీక్షలు పాసయ్యారు. 2018 నుంచి చూస్తే (2021లో కరోనా వల్ల 100శాతం పాస్) ఈ ఏడాదే పాస్ పర్సెంటేజ్ అత్యధికంగా ఉంది.

News April 12, 2024

BREAKING: సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

image

TG: ధాన్యం కొనుగోళ్లు, నీటి సరఫరాపై సమీక్షలో అధికారులపై CM రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ‘కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే చర్యలు తీసుకోవాలి. గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరు ఇచ్చి.. బస్తీలకు తక్కువ నీరు ఇచ్చే సిబ్బందిపై నిఘా పెట్టాలి. ధాన్యం కొనుగోళ్లలో తరుగు తీస్తే చర్యలు తప్పవు. ధాన్యం పక్కదారి పట్టించే మిల్లర్లపై నిఘా పెట్టాలి. MSP కన్నా తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయవద్దు’ అని స్పష్టం చేశారు.

News April 12, 2024

ఐదేళ్లలో జగన్ ఎవరినైనా కలిశారా?: చంద్రబాబు

image

AP: గత ఐదేళ్లలో సీఎం జగన్ ఎవరినైనా కలిశారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరులో టీడీపీ సభలో మాట్లాడిన ఆయన.. ‘కరవు, తుపాన్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. తుపాన్ల కంటే అసమర్థ సీఎం వల్ల ఎక్కువ నష్టపోయారు. రాష్ట్రంలో ధాన్యం కొనే దిక్కు లేదు. తుపాను వల్ల నష్టపోతే పరామర్శించేందుకు సీఎం రాలేదు. ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.

News April 12, 2024

‘ఆడు జీవితం’ రికార్డ్ కలెక్షన్లు

image

పృథ్వీరాజ్ నటించిన ఆడు జీవితం సినిమా కలెక్షన్లలో రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.130 కోట్ల వసూళ్లు రాబట్టి.. సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘లూసిఫర్’ కలెక్షన్లను(రూ.128కోట్లు) దాటేసింది. దీంతో మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాల్లో నిలిచింది. తొలి 4 స్థానాల్లో మంజుమ్మల్ బాయ్స్ (రూ.230Cr), 2018(రూ.176Cr), పులి మురుగన్(రూ.150 Cr), ప్రేమలు (రూ.136Cr) సిినిమాలున్నాయి.