News July 17, 2024
నీతి ఆయోగ్ పాలకమండలి వైస్ ఛైర్మన్‌గా సుమన్ భేరి
నీతి ఆయోగ్ పాలకమండలిని నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. PM మోదీ ఛైర్మన్‌గా ఉండగా, సుమన్ కే భేరిని వైస్ ఛైర్మన్‌గా నియమించింది. ఫుల్ టైమ్ మెంబర్స్‌గా వీకే సరస్వత్, రమేశ్ చంద్, వీకే పాల్, అర్వింద్ వీరమణి, ఎక్స్ అఫిషియో మెంబర్స్‌గా రాజనాథ్, అమిత్ షా, శివరాజ్, నిర్మలా సీతారామన్‌ను చేర్చింది. నడ్డా, గడ్కరీ, రామ్మోహన్, కుమారస్వామి, రాజీవ్ రంజన్ తదితరులను ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించింది.
Similar News
News December 10, 2024
మనోజ్.. నిన్ను కనడమే నేను చేసిన పాపమా?: మోహన్ బాబు
TG: మంచు మనోజ్ తీరుతో వాళ్ల అమ్మ ఆసుపత్రిలో చేరిందని మోహన్ బాబు అన్నారు. అతని ప్రవర్తనతో తన మనసు ఆవేదనతో కుంగిపోయిందని చెప్పారు. మనోజ్ తనను కొట్టలేదని, ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు. భార్య మాటలు విని తన కుమారుడు తాగుడుకు అలవాటయ్యాడన్నారు. ‘మనోజ్‌కు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా?’ అని మోహన్ బాబు అన్నారు. ఆస్తులు ఎలా పంచాలి అన్నది తన ఇష్టమని స్పష్టం చేశారు.
News December 10, 2024
మోహన్ బాబు ఇంటివద్ద హైటెన్షన్.. పోలీసులు కీలక ఆదేశాలు
TG: జల్‌పల్లిలో హైటెన్షన్ నెలకొంది. మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేయగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు చర్యలకు దిగారు. వెంటనే ఆయన నివాసాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు మోహన్ బాబు, విష్ణు గన్స్ సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
News December 10, 2024
రాజ్‌కుమార్‌ను రక్షించడంలో SM కృష్ణదే కీలకపాత్ర
దిగ్గజ కన్నడ నటుడు దివంగత రాజ్‌కుమార్‌ను వీరప్పన్ చెర నుంచి విడిపించడంలో అప్పటి కర్ణాటక CM <<14836897>>SM కృష్ణ<<>> కీలకపాత్ర పోషించారు. 1999లో CM పదవి చేపట్టిన కృష్ణకు 2000లో కిడ్నాప్ వ్యవహారం సవాల్ విసిరింది. 102 రోజులు బంధీగా ఉన్న రాజ్‌కుమార్‌ను విడిపించడానికి బలగాలు, మధ్యవర్తులు, తమిళనాడు ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరిపారు. సురక్షితంగా ఆయన్ను విడిపించి మన్ననలు పొందారు.