News July 16, 2024

‘నవోదయ’లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మొత్తం దేశంలో 653 నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి సీట్ల భర్తీకి రెండు విడతల్లో ఎంపిక పరీక్ష(JNVST2024) ఉంటుంది. ఒక విడతలో పర్వత ప్రాంతాల్లో, మరో విడతలో మిగిలిన ప్రాంతాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

News July 16, 2024

3,220 ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశం

image

APలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,220 ఉద్యోగాలను భర్తీ చేయాలని అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. ఈ ఉద్యోగాల భర్తీలో నెలకొన్న న్యాయపరమైన చిక్కులను తొలగించాలని సూచించారు. పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా పోస్టుల భర్తీ ఉండాలని ఉన్నత విద్యపై అధికారులతో సమీక్షలో లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇక కాలేజీల్లో డ్రగ్స్‌పై విద్యార్థులను చైతన్యం చేసేందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని చెప్పారు.

News July 16, 2024

బీసీసీఐతో సెటిల్‌మెంట్ కోసం బైజూస్ ప్రయత్నం?

image

BCCI పిటిషన్‌తో NCLT బైజూస్‌పై <<13640730>>చర్యలు<<>> చేపట్టడంతో ఈ వ్యవహారాన్ని కోర్టు వెలుపల సెటిల్ చేసుకోవాలని ఆ సంస్థ భావిస్తోందట. BCCIని వెనక్కితగ్గేలా ఒప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి ముందు ప్రస్తుతం అమలులో ఉన్న ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్‌పై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ నుంచి బైజూస్ స్టే తెచ్చుకోవాలని సంబంధిత వర్గాలు తెలిపాయి.

News July 16, 2024

అప్పుడు నా మైండ్ బ్లాంక్ అయ్యింది: రోహిత్ శర్మ

image

T20WC ఫైనల్ మ్యాచ్‌లో కీలకమైన చివరి 5 ఓవర్లలో పడిన టెన్షన్‌ను రోహిత్ శర్మ ఓ ఈవెంట్‌లో పంచుకున్నారు. ’15వ ఓవర్‌లో క్లాసెన్ దంచికొట్టడంతో అంతా మారిపోయింది. సౌతాఫ్రికా 30 బంతుల్లో 30 రన్స్ చేయాలి. నా మైండ్ పూర్తిగా బ్లాంక్ అయ్యింది. ఎక్కువ ఆలోచించలేదు. ఆ క్షణంలో ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టా. భయపడలేదు. మేమంతా ప్రశాంతంగా ఉన్నాం. అప్పుడు మా జట్టు ప్రవర్తించిన తీరు బాగుంది’ అని రోహిత్ వెల్లడించారు.

News July 16, 2024

నైట్ ఫుడ్ కోర్టులకు ఇబ్బంది కలిగించొద్దు: సీఎం రేవంత్

image

HYDలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లు, SPలతో సమావేశంలో CM రేవంత్ స్పష్టం చేశారు. ‘మానవ అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. నేరస్థులతో కాకుండా బాధితులతో పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలి. HYDలో రాత్రిపూట ఫుడ్ కోర్టులకు ఇబ్బంది కలిగించవద్దు. డ్రగ్స్ నియంత్రణకు పోలీస్, ఎక్సైజ్ శాఖలు కలిసి పనిచేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్‌తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలి’ అని సీఎం సూచించారు.

News July 16, 2024

అమిత్ ‌షాతో సీఎం చంద్రబాబు భేటీ

image

AP: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. విభజన సమస్యలు, తాజా రాజకీయ అంశాలపై షాతో సీఎం చర్చిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.

News July 16, 2024

SAD: ఇంటికి వస్తున్నానని ఫోన్.. ఇక లేడని మరో ఫోన్!

image

J&Kలోని డోడాలో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో మరణించిన నలుగురు జవాన్లలో రాజస్థాన్‌కు చెందిన అజయ్ సింగ్ ఒకరు. అయితే కాల్పులకు ముందురోజు అజయ్ తన ఇంటికి ఫోన్ చేసి ‘కాల్పులు కొనసాగుతున్నాయి. కానీ నాకు సెలవులు మంజూరయ్యాయి. ఇంటికి వచ్చేస్తున్నా’ అని అన్నారట. కానీ ఈరోజు ఆర్మీ అధికారులు తన తండ్రికి ఫోన్ చేసి ‘మీ అబ్బాయి ఇకలేరు’ అని చెప్పారట. అతడికి రెండేళ్ల క్రితమే వివాహం జరిగిందని బంధువులు చెప్పారు.

News July 16, 2024

అలాగైతే నా కొడుకుని ఉరి తీయండి: HD రేవణ్ణ

image

తన కొడుకు తప్పు చేసి ఉంటే ఉరి తీయండని కర్ణాటక JDS MLA HD రేవణ్ణ అన్నారు. మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న MP ప్రజ్వల్ అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా రేవణ్ణ ఉద్వేగానికి లోనయ్యారు. ‘నా కుమారుడిని శిక్షిస్తామంటే అడ్డు చెప్పను. కానీ ఎవరో ఓ మహిళను డీజీపీ ఆఫీసుకు తీసుకొచ్చి ఆరోపణలు చేయించారు. ఫిర్యాదు తీసుకున్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు’ అని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

News July 16, 2024

టీమ్ ఇండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్?

image

టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో హార్దిక్ పాండ్య పగ్గాలు చేపడతారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ రేసులోకి వచ్చారని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) తెలిపింది. 2026 టీ20 ప్రపంచకప్ వరకు సూర్య T20లకు సారథిగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు గంభీర్, అజిత్ అగార్కర్.. పాండ్యతో చర్చించారని, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు PTI వివరించింది.

News July 16, 2024

T-SAT సేవలు తక్షణమే పునరుద్ధరించాలి: KTR

image

TG: T-SAT ఛానళ్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూగబోయాయని కేటీఆర్ ఆరోపించారు. ‘ప్రస్తుతం కొన్ని నోటిఫికేషన్లు విడుదలైన పరిస్థితుల్లో T-SAT ఛానళ్ల ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులకు శిక్షణ అందేది. కాంగ్రెస్ అస్తవ్యస్త విధానాలతో వారికి తీవ్ర నష్టం జరుగుతోంది. NSILతో ఒప్పందంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. తక్షణమే T-SAT సేవలు పునరుద్ధరించాలి’ అని KTR డిమాండ్ చేశారు.