India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీని నిషేధించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. దేశద్రోహానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడమే కారణం. ఆ పార్టీపై ఆంక్షలు విధించేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కాగా ప్రభుత్వ ప్రకటనను PTI ఖండించింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామని <<13630881>>TCS<<>> ప్రకటించింది. APR1-JUN30 మధ్య నియమించుకున్న 5,452 మంది కంపెనీ వృద్ధిలో కీలకపాత్ర పోషించారంది. ఉద్యోగులకు 4.5%-7% ఇంక్రిమెంట్ ఇచ్చామని, మరింత మెరుగ్గా పని చేసినవారు 10%-12% అందుకున్నట్లు వివరించింది. కొత్త టాలెంట్‌కు భారత్ గమ్యస్థానంగా ఉందని, సమీప భవిష్యత్తులో ఇది మారదని పేర్కొంది.
TG: ఆగస్టు 15 లోగా రైతులకు రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఒకే దఫాలో రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గత KCR ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీరందించలేకపోయిందని ఆరోపించారు. రుణాల మాఫీ సహా పలు కీలక అంశాలపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని పేర్కొన్నారు.
<<13629724>>వింబుల్డన్<<>> వంటి అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీల్లో సింగిల్స్‌లో భారత్ ప్రవేశించలేకపోవడానికి అనేక కారణాలున్నాయి. సింగిల్స్‌లో రాణించాలంటే ఫిట్నెస్ ముఖ్యం. యురోపియన్ ప్లేయర్లతో పోల్చితే మనవాళ్లు ఫిట్నెస్‌లో కాస్త వీక్ అని కొన్ని వాదనలున్నాయి. మన దగ్గర క్రికెట్‌లా నాణ్యమైన కోచ్‌లు, ఆర్థిక మద్దతు, సౌకర్యాలు, పేరెంట్స్ ప్రోత్సాహం లేవనేది మరో వాదన. అయితే IND పలు డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ గెలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు తెలంగాణ పోలీసులు పలు సూచనలు చేశారు. వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున పరిమిత వేగంతోనే నడపాలన్నారు. ‘విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలను ఎట్టిపరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు. రైతులు పొలాల్లో ఉంటే ఫోన్స్ మాట్లాడకండి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకండి. రోడ్డుపై మ్యాన్‌హోల్స్, గుంతల పట్ల జాగ్రత్త వహించండి’ అని తెలిపారు.
TG: ఒక రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం నేరుగా మాఫీ చేస్తుంది. ఏ కుటుంబానికైతే రూ.2 లక్షలకు మించి రుణం ఉంటుందో ఆ రైతులు రూ.2 లక్షలకు పైబడి ఉన్న మొత్తాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాత అర్హతగల రూ.2 లక్షలను రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఉదాహరణకు మీకు రూ.2.50లక్షల లోన్ ఉంటే రూ.50వేలను మీరు కట్టాల్సి ఉంటుంది. మిగతా రూ.2 లక్షలు మాఫీ అవుతాయి.
డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన చర్చనీయాంశమైన వేళ మరిన్ని కీలక వివరాలు వెలుగు చూశాయి. పెన్సిల్‌వేనియాలో ట్రంప్‌ను హతమార్చేందుకు ఓ భవనంపై నక్కి ఉన్న నిందితుడు క్రూక్‌ను కాల్పులకు ముందే ఓ పోలీస్ కనిపెట్టినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. భవనం పైకప్పువైపు ఆ అధికారి వెళ్లగా క్రూక్స్ రైఫిల్ చూపి బెదిరించడంతో వెనక్కు తగ్గినట్లు తెలిపింది. అనంతరం క్రూక్ ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డాడని పేర్కొంది.
MP విజయసాయి రెడ్డిపై వస్తోన్న ఆరోపణలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. ‘టీవీ ఛానళ్లు బ్లాక్ మెయిలింగ్ సంస్థలుగా మారాయి. గిరిజనురాలైన శాంతి అనే అధికారిని ఇబ్బంది పెట్టేందుకు కూడా ఒకటే ప్యాటర్న్ వాడారు. ప్రెగ్నెంట్ అని, డబ్బులు తీసుకుందన్నారు. నేను ఆ మహిళకు ఒక్కటే చెప్తున్నా. నువ్వు ఏడిస్తే వాళ్లు గెలిచామని అనుకుంటారు. ఒత్తిళ్లకు లొంగవద్దు. నిందితులకు శిక్ష పడాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
TG: రీషెడ్యూల్ చేసిన రుణాలకు రూ.2లక్షల రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పీఏసీఎస్ నుంచి తీసుకున్న రుణాలే మాఫీ అవుతాయి. SHG, JLG, RMG, LECS రుణాలకు వర్తించదని తెలిపింది. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది. రైతుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖను ప్రభుత్వం ఆదేశించింది.
TG: రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. పంట రుణమాఫీ సొమ్మును నేరుగా లబ్ధిదారుల రుణాలున్న బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. ఆరోహణ క్రమంలో(చిన్న విలువ నుంచి పెద్ద విలువ) రుణమాఫీ సొమ్మును విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
Sorry, no posts matched your criteria.