News July 15, 2024

గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలి: తమ్మినేని

image

TG: పరీక్షలు వాయిదా వేయాలని నిరసన చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటనలో పేర్కొన్నారు. డీఎస్సీ ముగిసిన రెండు రోజులకే గ్రూప్స్ పరీక్షలు ఉన్నాయన్నారు. ఎక్కువ శాతం DSC అభ్యర్థులే రాయనున్నారని ఎగ్జామ్ వాయిదా వేయడంలో ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గ్రూప్స్ పరీక్షల తేదీలను మార్చాలని ఆయన కోరారు.

News July 15, 2024

డిసెంబర్‌లోగా బీజేపీకి కొత్త చీఫ్?

image

ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా BJP జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తికానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు, సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ జరగనుంది. నవంబర్‌లో మండల, జిల్లా చీఫ్‌ల నియామకం, డిసెంబర్‌లో రాష్ట్రాధ్యక్షుల ఎంపిక ఉండనున్నట్లు సమాచారం. ఆ తర్వాత నడ్డా స్థానంలో కొత్త చీఫ్‌ రానున్నట్లు తెలుస్తోంది.

News July 15, 2024

తాగునీటి ప్రాజెక్టులకు వరల్డ్ బ్యాంక్ రుణాలు

image

AP: జల్ జీవన్ మిషన్‌లో భాగంగా పెండింగ్‌లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ముందుకొచ్చింది. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్యాంక్ ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై చర్చించారు. అలాగే రాష్ట్ర బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

News July 15, 2024

ప్రైవేటు స్కూళ్లలో 25% ఫ్రీ సీట్లు.. త్వరలో నిర్ణయం?

image

TG: ప్రైవేటు స్కూళ్లలో పేదలకు 25% సీట్లు ఇవ్వాలనే రూల్‌ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు లేని చోట ఈ నిబంధనను అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో ఒక కి.మీ లోపు ప్రైమరీ, 3కి.మీలోపు అప్పర్ ప్రైమరీ స్కూల్ లేకపోతే 25% ఫ్రీ సీట్ల విధానాన్ని అమలు చేస్తున్నారు. అదే విధానాన్ని ఇక్కడ అమలు చేసే యోచనలో TG ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

News July 15, 2024

APSRTC బస్సు దగ్ధం.. 16 మందికి గాయాలు

image

TG: మహబూబ్‌నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న APSRTC బస్సు డీసీఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్‌తో పాటు 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు.

News July 15, 2024

VIRAL: చైనాలో ట్రంప్ టీషర్టుల విక్రయం

image

డొనాల్డ్ ట్రంప్‌పై నిన్న కాల్పులు జరిగిన కాసేపటికే చైనాలో ఆన్‌లైన్ రిటైలర్లు ఆయన ఫొటోతో టీషర్ట్‌లు ప్రింట్ చేసి విక్రయించారు. కాల్పుల అనంతరం ట్రంప్ పిడికిలి చూపించిన ఫొటోతో పాటు దాడిలో గాయపడిన చిత్రాలను వాటిపై ముద్రించి అమ్మకానికి పెట్టారు. ఈ టీషర్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

News July 15, 2024

అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ముగిశాయ్..

image

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట ఏడెనిమిది నెలలుగా జరుగుతున్న పెళ్లి వేడుకలు నిన్న ‘మంగళ్ ఉత్సవ్’తో ముగిశాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిళ్లలో ఒకటిగా అనంత్-రాధిక వివాహం నిలిచింది. మొత్తం వేడుకలకు రూ.5వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు అంచనా. ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల సీఎంలు, పాప్ సింగర్లు, హాలీవుడ్, బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు, క్రీడా, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు వేడుకలకు హాజరయ్యారు.

News July 15, 2024

BIG ALERT: ఇవాళ అతి భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డి, మెదక్, NZB, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వీటితో పాటు ADB, HYD, భద్రాద్రి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అటు ఏపీలో నేడు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.

News July 15, 2024

నేడు బెంగళూరుకు జగన్

image

AP: మాజీ సీఎం జగన్ ఇవాళ ఉదయం బెంగళూరుకు వెళ్లనున్నారు. వారం రోజులు ఆయన అక్కడి నివాసంలో ఉండనున్నారు. అయితే ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పాల్గొంటారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లిన ఆయన.. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా జగన్ వారం పాటు అక్కడే బస చేశారు.

News July 15, 2024

నా ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు: VSR

image

AP: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇవాళ ఉ.11 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. కొద్దిరోజులుగా తన ప్రతిష్ఠను దిగజార్చేలా ఓ వర్గం చేస్తున్న కుట్రను బయటపెడతానని ఆయన ట్వీట్ చేశారు. కాగా కొద్దిరోజులుగా VSRపై సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది.