India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొద్ది రోజులుగా విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మైనర్(17)ను అదుపులోకి తీసుకున్నారు. తన స్నేహితుడిని ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేసినట్లు చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. డబ్బు విషయంలో ఫ్రెండ్‌తో గొడవ కావడంతో అతని పేరుతో Xలో అకౌంట్ క్రియేట్ చేసి బాంబు బెదిరింపు పోస్టులు చేశాడని పోలీసులు తెలిపారు.
TG: సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలపై కేటీఆర్ Xలో సెటైర్లు వేశారు. ‘10 నెలల్లో 25 సార్లు హస్తిన పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేశావ్. పైసా పనిలేదు.. రాష్ట్రానికి రూపాయి లాభం లేదు. అన్నదాతల అరిగోసలు, గాల్లో దీపాల్లా గురుకులాలు, కుంటుపడ్డ వైద్యం, గాడితప్పిన విద్యా వ్యవస్థ, ఆడబిడ్డలకు అందని చీరలు, స్కూటీలు, కుట్టు మెషీన్లు లేవు, అవ్వాతాతలకు పెరగని పింఛన్.. అయినా పోయి రావాలె హస్తినకు’ అని ఎద్దేవా చేశారు.
తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుత సీజే చంద్రచూడ్ జస్టిస్ సంజీవ్ ఖన్నాను ప్రతిపాదించారు. తాను నవంబర్ 11న రిటైర్ కాబోతున్నానని, తన స్థానంలో ఖన్నాను నియమించాలని కోరారు. ఈ ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఖన్నా అవుతారు. ఆయన 2025 మే 13 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రణ్‌బీర్ కపూర్‌లు నటిస్తారని ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అలాగే ఓ స్టార్ హీరోను ఈ చిత్రంలో విలన్‌గా తీసుకోవాలని సందీప్ ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఈ మూవీలో రెబల్ స్టార్ డ్యుయెల్ రోల్ పోషించనున్నట్లు సమాచారం.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు ఈడీ క్లీన్‌చిట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ సెటైర్లు వేసింది. ‘2023లో చంద్రబాబుపై స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు. 2024లో బీజేపీతో పొత్తు. 2024లో బాబుకు క్లీన్‌చిట్. మోదీ బ్రాండ్ వాషింగ్ మెషీన్. అవినీతి మటు మాయం’ అని ట్వీట్ చేసింది. చంద్రబాబు వాషింగ్ మెషీన్ నుంచి బయటకు వస్తున్నట్లు ఉన్న ఫొటోను షేర్ చేసింది.
TG: హైదరాబాద్‌లోని కొల్లూరు, రాయదుర్గంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 30 చోట్ల ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. బొప్పరాజు అచ్యుతరావు, శ్రీనివాసరావు, అనూప్ రావు ఇళ్లతో పాటు విజయవాడకు చెందిన రియల్టర్ల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.
త్వరగా నిద్ర లేచే వారి కంటే ఆలస్యంగా మేల్కొనే వారిలోనే తెలివితేటలు, జ్ఞాపకశక్తి, ఐక్యూ ఎక్కువగా ఉన్నట్లు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. 26 వేల మంది అమ్మాయిలపై వారు స్టడీ చేశారు. త్వరగా నిద్ర నుంచి మేల్కొనే వారి కంటే ఆలస్యంగా మేల్కొన్న వారే పనులు సమర్థవంతంగా చేయగలుగుతున్నారని వెల్లడించింది. త్వరగా లేవాలనే ఉద్దేశంతో చాలీచాలని నిద్రపోవడం మంచిది కాదని పేర్కొంది.
TG: TGSPDCL, TGNPDCLలో 3,500 జూనియర్ లైన్‌మెన్ ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు డిస్కంలు సిద్ధం అవుతున్నాయి. JLMతో పాటు 50 వరకు అసిస్టెంట్ ఇంజినీర్ (AE) పోస్టులకు కూడా TGSPDCL నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎస్సీ వర్గీకరణ అంశం నేపథ్యంలో ముందుగా నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ నాటికి ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకెళ్లే అవకాశం ఉంది.
AP: <<14377119>>వాయుగుండం<<>> బలహీనపడినప్పటికీ మధ్యాహ్నం వరకు తీరం అలజడిగానే ఉంటుందని IMD తెలిపింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని వెల్లడించింది. సముద్ర తీరాల్లో అలలు 1.5 మీటర్ల ఎత్తున ఎగసిపడుతాయని పేర్కొంది. కాగా నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
TG: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి స్వచ్ఛమైనదేనని పరీక్షల్లో తేలినట్లు ఈవో భాస్కరరావు తెలిపారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నెయ్యిని పరీక్షలకు పంపామన్నారు. కిలో రూ.609కి కొనుగోలు చేస్తున్న నెయ్యి నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నట్లు తెలిపారు. రోజుకు వెయ్యి కిలోల నెయ్యిని మదర్ డెయిరీ నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.