News April 11, 2024

రేపు ఉదయం ఇంటర్ ఫలితాలు

image

AP: ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు రేపు ఉదయం విడుదల కానున్నాయి. ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ఏర్పాట్లు చేసింది. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగగా, మొత్తం 9,99,698 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 4వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. అందరికంటే ముందుగా WAY2NEWSలో ఇంటర్ ఫలితాలను చూసుకోండి.

News April 11, 2024

పవన్ తరఫున ప్రచారం చేస్తా: నవదీప్

image

AP: పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తానని టాలీవుడ్ హీరో నవదీప్ తెలిపారు. నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని, పవన్‌కు తన మద్దతు ఉంటుందని వెల్లడించారు. తాను నటించిన ‘లవ్‌మౌళి’ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పిఠాపురంలోని శ్రీపాదవల్లభుడిని దర్శించుకున్న ఆయన.. ఈ కామెంట్స్ చేశారు. ‘లవ్‌మౌళి’ ఈనెల 19న విడుదల కానుంది.

News April 11, 2024

ఆ సమయంలో చనిపోతానేమో అనిపించింది: రణదీప్ హుడా

image

బాలీవుడ్ యాక్టర్ రణదీప్ హుడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. సావర్కర్ పాత్రకోసం ఏకంగా 26 కేజీలకుపైగా బరువు తగ్గాను. అందుకోసం రోజూ ఒక ఖర్జూర పండు, గ్లాసు పాలు మాత్రమే తీసుకున్నా. ఆ సమయంలో ఇక చనిపోతానేమో అనిపించింది’ అని హుడా పేర్కొన్నారు. కాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

News April 11, 2024

గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

image

AP: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో SPF కానిస్టేబుల్ శంకర్ రావు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక ఓ బ్యాంకులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన ఉ.5 గంటలకు డ్యూటీ‌కి హాజరై ఈ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు.

News April 11, 2024

ఒలింపిక్స్‌ విజేతలకు ఇకపై ప్రైజ్‌మనీ

image

ఒలింపిక్స్‌లో పథకాలు సాధించే అథ్లెట్లకు ఇక నుంచి నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వరల్డ్ అథ్లెటిక్స్ ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్‌లో 48విభాగాల్లో గోల్డ్ మెడలిస్టులకు ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు తెలిపింది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం, రజతం, కాంస్య విజేతలకు నగదు ఇస్తామని వెల్లడించింది. ఇలా ప్రైజ్‌మనీ ఇచ్చే మొదటి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యగా WA నిలవనుంది.

News April 11, 2024

బ్రేక్‌ఫాస్ట్‌గా అన్నం తినొచ్చా?

image

కొందరు నైట్ డ్యూటీ కారణంగా మరికొందరు ఆలస్యంగా నిద్రలేవడం వల్ల నేరుగా మధ్యాహ్నం అన్నం తింటారు. అయితే.. పోషకభరితమైన ఆహారం తీసుకుంటే.. తినే సమయాల్లో కొంచెం అటూ ఇటూ అయినా సమస్య ఉండదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనంలో దంపుడు బియ్యం అన్నం, ఆకు కూరలు, పప్పు, పెరుగు వంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. నైట్ డ్యూటీ చేసే వారు రోజంతా పడుకోకుండా.. కాసేపు ఎండలో నడవాలని చెబుతున్నారు.

News April 11, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,570 మంది భక్తులు దర్శించుకోగా.. 24,446 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు సమకూరింది.

News April 11, 2024

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో మిగిలిన 3 ఎంపీ స్థానాలకు అభ్యర్థులపై పార్టీ అధిష్ఠానంతో ఆయన చర్చలు జరపనున్నారు. అలాగే ప్రచారానికి రావాలని ఖర్గే, రాహుల్, ప్రియాంకలను ఆయన కోరనున్నారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

News April 11, 2024

‘తెర’ నుంచి ‘పోరు’లోకి!

image

ఈ లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సినీ నటుల పోటీయే ఇందుకు కారణం. ఇప్పటికే పోటీ చేసిన వారు కొందరైతే.. ఇంకొందరు కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు. BJP నుంచి హేమా మాలిని(మథుర, UP), స్మృతి ఇరానీ(అమేఠీ, UP), కంగన(మండీ, HP), రవికిషన్(గోరఖ్‌పూర్, UP), నవనీత్‌కౌర్(అమరావతి, MH), రాధిక(విరుదు నగర్, TN), TMC నుంచి రచనా బెనర్జీ(హుగ్లీ, WB) పోటీ చేస్తున్నారు. ఇలా 20మందికిపైగా ఉన్నారు.<<-se>>#Elections2024<<>>

News April 11, 2024

క్రౌడ్ పుల్లర్‌ ‘ఆదితి’

image

యూపీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూతురు ఆదితి యాదవ్ హైలెట్‌గా నిలుస్తున్నారు. ఆమెను చూసేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. ఆమె కూడా తన పదునైన ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. బీజేపీ, మోదీని విమర్శిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. కాగా లండన్‌లో చదువుతున్న ఆదితి.. సెలవులు కావడంతో తన తల్లి డింపుల్‌ యాదవ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు.