News October 17, 2024

సానియా మీర్జా మళ్లీ పెళ్లి.. నిజమెంత?

image

పాక్ మాజీ క్రికెటర్ మాలిక్ నుంచి విడాకులు తీసుకున్న సానియా మీర్జా మరోసారి పెళ్లి చేసుకున్నారా? సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. సనా జావేద్ అనే నటిని మాలిక్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమె మాజీ భర్త ఉమైర్ జస్వాల్‌కు తాజాగా వివాహం కాగా, అతడు పెళ్లాడింది సానియానేనంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే, సానియా పిల్లలతో కలిసి దుబాయ్‌లో ఉన్నారని.. ఆ వార్తలన్నీ అవాస్తవమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

News October 17, 2024

VIPలకు NSG భద్రత కట్

image

దేశంలోని వీఐపీలకు ఎన్‌ఎస్‌జీ భద్రతను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వీరి భద్రతను సీఆర్‌పీఎఫ్ పర్యవేక్షిస్తుందని తెలుస్తోంది. జెడ్ ప్లస్ కేటగిరిలో చంద్రబాబు, యోగి ఆదిత్యనాథ్, అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, మాయావతి, సర్బానంద సోనోవాల్, అజాద్, ఫరూక్ అబ్దుల్లాకు భద్రత ఉపసంహరించనున్నారు. వీరి సెక్యూరిటీని CRPF చూసుకుంటుంది.

News October 17, 2024

బాహుబలి-3 రానుందా?

image

బాహుబలి, బాహుబలి-2 సినిమాలు చరిత్ర సృష్టించాయి. వాటికి మరో సీక్వెల్ రాకపోవచ్చని జక్కన్న రాజమౌళి పలుమార్లు చెప్పారు. అయితే, కంగువ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బాహుబలి నిర్మాతలతో తాను ఇటీవల మాట్లాడినప్పుడు బాహుబలి-3 తీయనున్నట్లు అన్నారని పేర్కొన్నారు. దీంతో ఈ విషయం సినీ ప్రియుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి సిరీస్‌లను తమిళంలో జ్ఞానవేలే సమర్పించారు.

News October 17, 2024

ఎలక్షన్ కమిషనర్‌కు తప్పిన పెను ప్రమాదం

image

కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడటంతో పైలట్ పిథోరాగఢ్ జిల్లాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. హెలికాప్టర్‌లో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.

News October 17, 2024

‘ఫాస్టెస్ట్’రికార్డు సృష్టించిన డకెట్

image

ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు సృష్టించారు. అత్యంత వేగంగా 2,000 రన్స్ కొట్టిన బ్యాటర్‌గా నిలిచారు. పాకిస్థాన్‌తో ముల్తాన్‌ వేదికగా జరుగుతున్న టెస్టులో డకెట్ 129 బంతుల్లో 114 రన్స్ చేశారు. తద్వారా కెరీర్ ప్రారంభం నుంచి 2,293 బంతులు ఎదుర్కొన్న బెన్ 2,000 పరుగుల మైలురాయి అందుకున్నారు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ క్రికెటర్ సౌథీ(2,418బంతుల్లో) పేరిట ఉండేది.

News October 17, 2024

అక్టోబర్ 17: చరిత్రలో ఈ రోజు

image

1979: మదర్ థెరిసాకు నోబెల్ శాంతి బహుమతి బహూకరణ
1948: నటి అన్నపూర్ణ జననం
1965: పాప్ సింగర్ మాల్గుడి శుభ జననం
1970: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే జననం
1992: హీరోయిన్ కీర్తీ సురేష్ జననం
1992; హీరోయిన్ ప్రణీత సుభాష్ జననం
అంతర్జాతీయ దారిద్య్ర నిర్మూలన దినోత్సవం

News October 17, 2024

LLC ఛాంపియన్‌గా సదరన్ సూపర్‌స్టార్స్

image

ఛాంపియన్స్ లీగ్ క్రికెట్ 2024 విజేతగా సదరన్ సూపర్‌స్టార్స్ నిలిచింది. కోనార్క్ సూర్యాస్‌తో జరిగిన ఫైనల్లో ఈ జట్టు సూపర్ ఓవర్లో విజయం సాధించింది. సదరన్ తొలుత 164/6 పరుగులు చేసింది. ఛేదనలో కోనార్క్ కూడా సరిగ్గా అన్నే పరుగులు చేసింది. యూసుఫ్ పఠాన్ (38 బంతుల్లో 85) ఊచకోత కోసినా జట్టు విజయం సాధించలేకపోయింది. దీంతో సూపర్ ఓవర్ ఆడించగా సదరన్ గెలుపొందింది.

News October 17, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 17, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 17, గురువారం
ఫజర్: తెల్లవారుజామున 4:57 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:10 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:01 గంటలకు
అసర్: సాయంత్రం 4:15 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:53 గంటలకు
ఇష: రాత్రి 7.05 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 17, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.