India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేది: అక్టోబర్ 17, గురువారం
పౌర్ణమి: సాయంత్రం 4.56 గంటలకు
రేవతి: సాయంత్రం 4.20 గంటలకు
వర్జ్యం: ఉదయం 7.13 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉదయం 9.55-10.42 గంటల వరకు,
మధ్యాహ్నం 2.36-3.23 గంటల వరకు
AP: గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన బోరుగడ్డ అనిల్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు నగరంలో పలు విద్యాసంస్థల అధినేతను డబ్బుల కోసం డిమాండ్ చేసినందుకు గాను ఆయనపై కేసు నమోదైంది. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న అతణ్ని నల్లపాడు పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.
➥ఏపీలో కొత్తగా 6 పాలసీలు: సీఎం చంద్రబాబు
➥వాయుగుండం ఎఫెక్ట్.. పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
➥కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారు: సజ్జల
➥జగన్ ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకున్నారు: లోకేశ్
➥AP, TG నుంచి ఐఏఎస్ అధికారుల రిలీవ్
➥TG:త్వరలో రైతు భరోసా నగదు జమ: మంత్రి తుమ్మల
➥TG:మా ఫామ్ హౌస్ FTL పరిధిలో ఉంటే కూల్చేయండి: KTR
➥TG:గ్రూప్-1 నియామకాలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
➥ఆరు పంటలకు MSP పెంచిన కేంద్రం
భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ను మధ్యాహ్నం రెండున్నరకే నిలిపేసిన సంగతి తెలిసిందే. హాక్ ఐ సాంకేతికతను ఇన్‌స్టాల్ చేసేందుకు టైమ్ లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందురోజే దాన్ని అమర్చాల్సినప్పటికీ వర్షం కారణంగా సాధ్యం కాలేదు. దాన్ని అమర్చేందుకు సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఒకవేళ మధ్యాహ్నం వర్షం ఆగిపోయినా హాక్ ఐ అమర్చేసరికి సాయంత్రం అవుతుంది కాబట్టే ఆటను త్వరగా రద్దు చేశారు.
రతన్ టాటా అపర కుబేరుడు. టాటాల వారసుడు. ఆగర్భ శ్రీమంతుడు. అలాంటి వ్యక్తి వాడే వస్తువులంటే ఎంత ధర ఉండాలి? ఓ సినిమాలో డైలాగ్‌లా ఆయన వాచ్ అమ్మితే ఓ మధ్య తరగతి మనిషి లైఫ్ సెటిల్ అయిపోవాలి. కానీ కేవలం టైమ్ చూసేందుకు అంత ఖర్చెందుకు అని భావించేవారాయన. విక్టోరినాక్స్ బ్రాండ్‌కు చెందిన సుమారు రూ.10వేల విలువైన స్విస్ ఆర్మీ వాచ్‌ని మాత్రమే రతన్ ధరించేవారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదే కదా!
TG: న్యాయం కోసం శాంతియుత నిరసన చేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BRS MLA హరీశ్‌రావు అన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘విద్యార్థులుండే అశోక్‌నగర్‌లో కరెంట్ తీసేసి, నిర్బంధించడమే ప్రజా పాలన? ఎన్నికలప్పుడు రాహుల్‌గాంధీ అశోక్‌నగర్‌లో ఓట్లడిగింది మరిచిపోయారా? ’అని ప్రశ్నించారు.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రతరం చేస్తోంది. హెజ్బొల్లా మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా ఖనా నగరంపై జరిపిన ఎయిర్ స్ట్రైక్‌లో నబాతియే మేయర్ అహ్మద్ కహిల్ మరణించారు. ఆయనతో సహా 15 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 250 మంది మిలిటెంట్లు మరణించారు. తమ సరిహద్దుల్లో హెజ్బొల్లాను తరిమికొట్టేంత వరకు కాల్పుల విరమణ చేపట్టమని ఇజ్రాయెల్ PM నెతన్యాహు తేల్చిచెప్పారు.
న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ముంగిట రోహిత్ శర్మ ఇటీవల ఎన్నడూ లేనంత ఫిట్‌గా కనిపిస్తున్నారు. బెంగళూరు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ సందర్భంగా ఆయన ఫొటోలు బయటికొచ్చాయి. ఇంతకు ముందుతో పోలిస్తే సన్నగా, కండలు తిరిగిన దేహంతో హిట్‌మ్యాన్ కనిపిస్తున్నారు. ఇప్పుడు రోహిత్ హిట్‌మ్యాన్ కాదు ఫిట్‌మ్యాన్ అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రోహిత్ ప్రస్తుతం వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతుండటం తెలిసిందే.
TG: ఫార్మసీ కాలేజీల్లో రేపటి నుంచి క్లాసులు బంద్ చేస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఇప్పటికే డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్‌ను చేపడుతుండగా, రేపటి నుంచి ఫార్మసీ కాలేజీలు సైతం బంద్‌లో పాల్గొననున్నాయి.
ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఒకే రాజధాని అనేది ఎన్డీఏ పాలసీ అని చెప్పారు. ‘అమరావతి రాజధాని. విశాఖ ఆర్థిక రాజధాని. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం. కర్నూలు ఇండస్ట్రియల్ హబ్‌గా, అద్భుతమైన సిటీగా అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.